1.2K
ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం సమ్మక్క-సారలమ్మ ఆలయ పరిసరాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను మంత్రి సీతక్క పరిశీలించారు. ఆలయానికి చేరుకున్న మంత్రి వనదేవతలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సమ్మక్క భవన్‌లో మదర్ ఎడ్యుకేషన్ రూరల్ డెవలప్‌మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళల ఉచిత టైలరింగ్ శిక్షణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. శిక్షణ పూర్తిచేసుకున్న మహిళలకు ఉచిత కుట్టుమిషన్లను పంపిణీ చేసి, స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మహిళల ఆర్థిక సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు.