Wednesday, September 30, 2026
News Navigation
Wednesday, September 30, 2026
News Navigation

Breaking

Wednesday, September 30, 2026
Home Latest News ఆగస్టు 14న ట్యాంక్‌బండ్ వద్ద భారీ ‘తిరంగా యాత్ర’.

ఆగస్టు 14న ట్యాంక్‌బండ్ వద్ద భారీ ‘తిరంగా యాత్ర’.

by CVR NEWS

హైదరాబాద్‌లో ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమానికి బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తిని చాటాలని ఆయన కోరారు. ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా రామచందర్ రావు తన ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేశారు. తన ఊరు, తన గల్లీలోని యువతతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు తెలిపారు. ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశం కోసం ప్రాణాలర్పించిన స్వాతంత్ర్య సమరయోధులను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని ఆయన అన్నారు. ప్రజలంతా స్వచ్ఛందంగా ‘హర్ ఘర్ తిరంగా’లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఇదే సమయంలో ఆగస్టు 14న హైదరాబాద్ ట్యాంక్‌బండ్ వద్ద భారీ ‘తిరంగా యాత్ర’ నిర్వహించనున్నట్లు రామచందర్ రావు వెల్లడించారు. ఈ యాత్ర ఏ ఒక్క పార్టీకి పరిమితం కాదని, దేశ ఐక్యత, శక్తిని ప్రపంచానికి చాటిచెప్పే కార్యక్రమమని పేర్కొన్నారు. ‘వికసిత భారత్’ సంకల్పంతో నిర్వహిస్తున్న ఈ యాత్రలో రాజకీయాలకు అతీతంగా హైదరాబాద్ ప్రజలందరూ పాల్గొనాలని కోరారు. కుల, మత, రాజకీయ విభేదాలను పక్కనబెట్టి జాతీయ జెండా కింద ప్రజలంతా ఏకమై తిరంగా యాత్రను విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: