Tuesday, September 29, 2026
News Navigation
Tuesday, September 29, 2026
News Navigation

Breaking

Tuesday, September 29, 2026
Home Telangana జటప్రోలులో యంగ్ ఇండియా స్కూల్ పనుల పరిశీలన.

జటప్రోలులో యంగ్ ఇండియా స్కూల్ పనుల పరిశీలన.

by CVR NEWS

నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులను మంత్రి జూపల్లి కృష్ణారావు పరిశీలించారు. పెంట్లవెల్లి మండలం జటప్రోలులో నిర్మిస్తున్న పాఠశాల పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడొద్దని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సారథ్యంలోని ప్రజా ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని వర్గాల పిల్లలకు సమానంగా నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేస్తోందని మంత్రి తెలిపారు. పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు కార్పొరేట్ స్థాయి విద్యను అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. విద్యతో పాటు ఆధునిక వసతులు, ప్రయోగశాలలు, క్రీడా సదుపాయాలతో విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి ఈ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో బాలురు, బాలికలకు ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేయాలన్నదే ప్రభుత్వ విజన్ అని మంత్రి పేర్కొన్నారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: