మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్‌లో అక్రమంగా తరలిస్తున్న భారీ మొత్తంలో పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. పేదలకు ప్రభుత్వం పంపిణీ చేసే రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న ముఠాపై ఘట్‌కేసర్ పోలీసులు దాడి చేశారు. అంబేద్కర్ విగ్రహం సమీపంలో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా వెళ్తున్న అశోక్ లేలాండ్ డోస్ట్ వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా.. అందులో సుమారు 38 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం ఉన్నట్లు గుర్తించారు. బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. అరెస్టైన వారిని నాగరాజు, చంద్రశేఖర్, తరుణ్‌గా గుర్తించారు. ఈ అక్రమ రవాణాతో సంబంధం ఉన్న మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వారి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ కేసులో పీడీఎస్ బియ్యంతో పాటు అక్రమ రవాణాకు ఉపయోగించిన అశోక్ లేలాండ్ డోస్ట్ వాహనం, ఇతర సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పేదలకు అందాల్సిన రేషన్ బియ్యాన్ని అక్రమంగా సేకరించినా, రవాణా చేసినా, విక్రయించినా కఠిన చర్యలు తప్పవని ఘట్‌కేసర్ పోలీసులు హెచ్చరించారు.
ఘట్‌కేసర్ అంబేద్కర్ విగ్రహం వద్ద పోలీసుల తనిఖీలు.
30
previous post