Tuesday, September 29, 2026
News Navigation
Tuesday, September 29, 2026
News Navigation

Breaking

Tuesday, September 29, 2026
Home Latest News డిసెంబర్‌లో ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్.

డిసెంబర్‌లో ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్.

by CVR NEWS

తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు ఆకర్షించేందుకు డిసెంబర్‌లో ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించనున్నారు. సమ్మిట్ ఏర్పాట్లపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా సమ్మిట్‌ను ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ప్రపంచానికి చాటిచెప్పేలా సమ్మిట్‌ను నిర్వహించాలని సీఎం సూచించారు. వ్యాపార రంగంలోని వివిధ సెక్టార్లలో గుర్తింపు పొందిన ప్రముఖ పారిశ్రామికవేత్తలను సమ్మిట్‌లో సన్మానించేలా కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. గతంలో నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ ద్వారా రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు, ప్రస్తుతం వాటి పురోగతి, అమలు పరిస్థితిపై పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని అధికారులను సీఎం ఆదేశించారు. పెట్టుబడుల్లో మరింత పురోగతి సాధించేందుకు అవసరమైన ప్రత్యేక ప్రణాళికలను సిద్ధం చేయాలని సూచించారు. ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌ను విజయవంతం చేసి రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: