Thursday, August 13, 2026
News Navigation
Thursday, August 13, 2026
News Navigation

Breaking

Thursday, August 13, 2026
Home Latest News జీనోమ్ వ్యాలీలో ‘యామ్జెన్’ అత్యాధునిక పరిశోధన కేంద్రం.

జీనోమ్ వ్యాలీలో ‘యామ్జెన్’ అత్యాధునిక పరిశోధన కేంద్రం.

by CVR NEWS

తెలంగాణలో బయోటెక్ రంగానికి మరో భారీ పెట్టుబడి రానుంది. హైదరాబాద్‌లోని జీనోమ్ వ్యాలీలో ప్రముఖ బయోఫార్మా సంస్థ యామ్జెన్ అత్యాధునిక పరిశోధన, ఆవిష్కరణ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వంతో యామ్జెన్ సంస్థ అవగాహన ఒప్పందం MoU కుదుర్చుకుంది. మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. హైదరాబాద్‌ను కేంద్రంగా చేసుకుని తమ కార్యకలాపాలను మరింత విస్తరించాలని యామ్జెన్ నిర్ణయించింది. జీనోమ్ వ్యాలీలో రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఈ కేంద్రం ద్వారా పరిశోధన, ఆవిష్కరణలకు మరింత ఊతం లభించడంతో పాటు.. హైదరాబాద్‌ బయోటెక్, లైఫ్ సైన్సెస్ రంగాల్లో మరింత కీలక కేంద్రంగా ఎదిగే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది.

Advertisements

You may also like

Leave a Comment

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: