20
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు సంబంధించిన ఓ కీలక అప్‌డేట్ అభిమానుల్లో ఉత్సాహం నింపుతోంది. ఎన్టీఆర్‌కు ఇటీవల నిర్వహించిన సర్జరీ విజయవంతంగా పూర్తైనట్లు వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. సర్జరీ తర్వాత వైద్యుల పర్యవేక్షణలో విశ్రాంతి తీసుకుంటున్న ఎన్టీఆర్.. పూర్తిగా కోలుకున్న తర్వాత తన సినిమా షూటింగ్స్‌లో పాల్గొనే అవకాశం ఉంది. ఎన్టీఆర్ ఆరోగ్యానికి సంబంధించిన ఈ వార్తతో అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఎన్టీఆర్ త్వరగా కోలుకుని మళ్లీ షూటింగ్‌లో బిజీ కావాలని సోషల్ మీడియా వేదికగా ఆకాంక్షిస్తున్నారు. ఎన్టీఆర్ ఆరోగ్యంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.