Friday, August 14, 2026
News Navigation
Friday, August 14, 2026
News Navigation

Breaking

Friday, August 14, 2026
Home Latest News పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో అధికారుల చర్యలు.

పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో అధికారుల చర్యలు.

by CVR NEWS

పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఆవరణలోని వ్యాపార సముదాయాలపై అధికారులు చర్యలు చేపట్టారు. లీజు గడువు ముగిసినా దుకాణాలను ఖాళీ చేయకపోవడంతో.. అధికారులు షటర్లకు సీల్‌ వేశారు. లీజు పునరుద్ధరణపై అంగీకారం కుదరకపోవడంతో ఇంటర్మీడియట్‌ విద్యా శాఖ ఆదేశాల మేరకు ఈ చర్యలు చేపట్టారు.

పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఆవరణలోని వ్యాపార సముదాయాలను అధికారులు సీజ్‌ చేశారు. ఈ దుకాణాల లీజు అగ్రిమెంట్‌ గత ఏడాది మార్చి 31తోనే ముగిసింది. అనంతరం లీజు పునరుద్ధరణ కోసం ప్రయత్నాలు జరిగినప్పటికీ.. ఎలాంటి అంగీకారం కుదరలేదు.దీంతో తదుపరి చర్యలు చేపట్టాలని ఇంటర్మీడియట్‌ విద్యా సంచాలకులు ఆదేశాలు జారీ చేశారు. అధికారులు దుకాణదారులకు దాదాపు ఆరుసార్లు ముందస్తు నోటీసులు ఇచ్చారు. అయినప్పటికీ దుకాణాలను ఖాళీ చేయకపోవడంతో.. అధికారులు రంగంలోకి దిగారు.ఇంటర్మీడియట్‌ విద్యాశాఖ ఆదేశాల మేరకు మున్సిపల్‌, పోలీస్‌, రెవెన్యూ, కళాశాల సిబ్బంది సంయుక్తంగా సీజింగ్‌ ప్రక్రియ చేపట్టారు. దుకాణాల షటర్లకు సీల్‌ వేసి స్వాధీనం చేసుకున్నారు. నిబంధనల ప్రకారం ఉన్నతాధికారుల మార్గదర్శకాలకు అనుగుణంగా తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

Advertisements

You may also like

Leave a Comment

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: