న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. విమానం ఎక్కేందుకు సిద్ధమైన ఓ ప్రయాణికుడి చేతి సంచిలో దాచి ఉంచిన పుర్రెను సీఐఎస్ఎఫ్ సిబ్బంది గుర్తించారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ వెళ్లేందుకు సిద్ధమైన ప్రయాణికుడి బ్యాగ్‌ను ప్రీ-ఎంబార్కేషన్ సెక్యూరిటీ చెక్‌లో తనిఖీ చేస్తుండగా అనుమానాస్పద వస్తువు బయటపడింది. దీనిపై ప్రశ్నించగా అది కోతి పుర్రె అని ప్రయాణికుడు వెల్లడించాడు. దీంతో అప్రమత్తమైన సీఐఎస్ఎఫ్ అధికారులు పుర్రెను స్వాధీనం చేసుకున్నారు. వన్యప్రాణులతో సంబంధం ఉన్న వస్తువు కావడంతో తదుపరి దర్యాప్తు, చట్టపరమైన చర్యల కోసం ప్రయాణికుడిని స్థానిక పోలీసులకు అప్పగించారు. 1972 వన్యప్రాణి సంరక్షణ చట్టం నిబంధనల ప్రకారం చర్యలు చేపట్టే అవకాశం ఉంది. ఈ ఘటన విమానాశ్రయ భద్రతలో సీఐఎస్ఎఫ్ అప్రమత్తతను మరోసారి స్పష్టం చేసింది.
ఐజీఐ ఎయిర్‌పోర్టులో ప్రయాణికుడి బ్యాగ్‌లో కోతి పుర్రె కలకలం.
12
previous post