Wednesday, September 30, 2026
News Navigation
Wednesday, September 30, 2026
News Navigation

Breaking

Wednesday, September 30, 2026
Home Andhra Pradesh ఏపీ సీఎం చంద్రబాబుతో కాన్పూర్ ప్రతినిధుల భేటీ.

ఏపీ సీఎం చంద్రబాబుతో కాన్పూర్ ప్రతినిధుల భేటీ.

by CVR NEWS

ఫ్యామిలీ ఎంపవర్మెంట్ మిషన్‌పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో ఐఐటీ కాన్పూర్ ప్రతినిధులు సమావేశమయ్యారు. అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు మరింత సమర్థవంతంగా చేరేలా చర్యలు తీసుకోవడంపై సమావేశంలో చర్చించారు. పేద కుటుంబాల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే లక్ష్యంగా సమగ్ర ప్రణాళిక రూపొందించే అంశంపై అధికారులు, ఐఐటీ కాన్పూర్ ప్రతినిధులు సీఎంకు వివరించారు. ఇందులో భాగంగా ఆర్టీజీఎస్ సహకారంతో సమగ్రమైన సిటిజన్ డేటాబేస్‌ను రూపొందించే అంశాన్ని పరిశీలించారు. కుటుంబాల అవసరాలు, అర్హతలను గుర్తించి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు నేరుగా అందేలా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడంపై చర్చ జరిగింది. సంక్షేమ పథకాల అమలులో మరింత పారదర్శకత, సమర్థత తీసుకురావడమే ఈ మిషన్ ప్రధాన ఉద్దేశంగా ప్రభుత్వం భావిస్తోంది.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: