Wednesday, September 30, 2026
News Navigation
Wednesday, September 30, 2026
News Navigation

Breaking

Wednesday, September 30, 2026
Home Andhra Pradesh విజయవాడ నుంచి కాశీకి నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం.

విజయవాడ నుంచి కాశీకి నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం.

by CVR NEWS

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మరో కీలక విమాన కనెక్టివిటీ అందుబాటులోకి వచ్చింది. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి పవిత్ర కాశీ నగరం వారణాసికి నేరుగా విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈ సర్వీసులను వర్చువల్‌గా ప్రారంభించారు. వారానికి మూడు రోజులు.. మంగళవారం, గురువారం, శనివారం ఈ విమానాలు అందుబాటులో ఉంటాయి. దీంతో కాశీ విశ్వనాథుడి దర్శనానికి వెళ్లే భక్తులతో పాటు వ్యాపారం, విద్య, పర్యాటకం కోసం ప్రయాణించే వారికి మరింత సౌలభ్యం కలగనుంది. టైర్-2, టైర్-3 నగరాలను ప్రధాన విమాన కేంద్రాలతో అనుసంధానించడమే లక్ష్యమన్నారు. మరోవైపు నాగార్జున సాగర్, ప్రకాశం బ్యారేజ్, శ్రీశైలం ప్రాజెక్ట్ మధ్య సీ-ప్లేన్ ప్రాజెక్టుపై కూడా వ్యూహరచన చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: