Friday, August 14, 2026
News Navigation
Friday, August 14, 2026
News Navigation

Breaking

Friday, August 14, 2026
Home Latest News మంచిర్యాల జిల్లాలో ముగిసిన ప్రపంచ ఆదివాసి దినోత్సవ వేడుకలు.

మంచిర్యాల జిల్లాలో ముగిసిన ప్రపంచ ఆదివాసి దినోత్సవ వేడుకలు.

by CVR NEWS

మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసి దినోత్సవ ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆదివాసీల సాంస్కృతిక ప్రదర్శనలు, భారీ ర్యాలీ నిర్వహించి తమ ఐక్యతను చాటిచెప్పారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా ఆదివాసుల హక్కుల పరిరక్షణ, అభివృద్ధి కోసం 1994లో ఐక్యరాజ్యసమితి ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని ప్రకటించిందని తెలిపారు. దేశంలో ఆదివాసులు తీవ్రమైన దాడులు, భూసమస్యలు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. అడవులను ప్రైవేటీకరించే చర్యలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. సాగులో ఉన్న ప్రతి పొడు భూమికి తక్షణమే పట్టాలు మంజూరు చేయాలని, ఆదివాసులపై అటవీ అధికారుల దాడులను పూర్తిగా నిలిపివేయాలని కోరారు. నూటికి నూరుపాళ్లు ఆదివాసులు నివసించే నాన్-ఏజెన్సీ గ్రామాలను షెడ్యూల్డ్ జాబితాలోకి చేర్చాలని డిమాండ్ చేశారు. ఆదివాసి యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాల కోసం ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని కోరారు. సమస్యలు పరిష్కారమయ్యే వరకు ఐక్యంగా పోరాటాలను ఉధృతం చేస్తామని సంఘం నాయకులు హెచ్చరించారు.

Advertisements

You may also like

Leave a Comment

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: