Friday, August 14, 2026
News Navigation
Friday, August 14, 2026
News Navigation

Breaking

Friday, August 14, 2026
Home Andhra Pradesh అమరావతిని ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేయడమే లక్ష్యం.

అమరావతిని ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేయడమే లక్ష్యం.

by CVR NEWS

ఏపీ రాజధాని అమరావతి అంటే ఇక గ్రాఫిక్స్ కాదు… గ్రౌండ్‌లో కనిపిస్తున్న రియాలిటీ. రాజధాని రోడ్లపై రయ్‌మంటూ దూసుకెళ్లే వాహనాలకు మరో కొత్త మార్గం సిద్ధమైంది. రాజధాని రవాణా వ్యవస్థకు వెన్నెముకగా నిలిచే ఈ-3 సీడ్ యాక్సెస్ రోడ్డు రెండో దశతో పాటు, బకింగ్‌హామ్ కెనాల్‌పై నిర్మించిన అద్భుతమైన స్టీల్ బ్రిడ్జిని సీఎం చంద్రబాబు అధికారికంగా ప్రారంభించారు. ఉండవల్లి వద్ద శిలాఫలకం ఆవిష్కరించడమే కాదు.. స్వయంగా కాలినడకన వెళ్లి మరీ రోడ్లను తనిఖీ చేశారు.ఈ కార్యక్రమంలో మంత్రులు నారాయణ, నాదెండ్ల మనోహర్, పలువురు ప్రజాప్రతినిధులు, సీఆర్‌డీఏ అధికారులు, వేలాది మంది రైతులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని లేని రాష్ట్రంగా ఏర్పడిందని గుర్తుచేశారు. రాష్ట్రానికి ఒక మంచి రాజధానిని నిర్మించాలనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు నాయుడు ముందుకు సాగారని తెలిపారు. హైదరాబాద్, బెంగళూరు, ముంబై నగరాలకు దీటుగా అమరావతిని అభివృద్ధి చేయాలన్నది చంద్రబాబు విజన్ అని మంత్రి నారాయణ అన్నారు. అమరావతి కేవలం పరిపాలనా రాజధానిగా కాకుండా రాష్ట్ర ఆర్థిక రాజధానిగా కూడా ఎదగాలనే లక్ష్యంతో ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. ప్రపంచంలోని టాప్-5 నగరాల్లో అమరావతిని ఒకటిగా తీర్చిదిద్దాలన్నదే ముఖ్యమంత్రి లక్ష్యమని తెలిపారు.

Advertisements

You may also like

Leave a Comment

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: