14
హైదరాబాద్ బొల్లారం మద్రాస్ రెజిమెంట్ ఆయుధాల చోరీ కేసులో నేడు రెండో రోజు నిందితుడు మల్లేష్ పోలీసుల విచారణను ఎదుర్కోనున్నాడు. కోర్టు అనుమతితో మల్లేష్‌ను పోలీసులు 10 రోజుల కస్టడీకి తీసుకున్నారు. తొలి రోజు సుమారు ఆరు గంటల పాటు ప్రశ్నించిన అధికారులు.. ఆయుధాల చోరీకి సంబంధించి కీలక వివరాలు రాబట్టినట్లు సమాచారం. చోరీకి ముందే మల్లేష్ పథకం రచించాడా? ఆయుధాలను ఎక్కడికి తరలించాడు? ఈ ఘటనలో మరెవరైనా సహకరించారా? అనే కోణాల్లో విచారణ కొనసాగుతోంది. మల్లేష్ మాజీ ఆర్మీ సహచరుల పాత్రపైనా పోలీసులు దృష్టి సారించారు. రెండో రోజు విచారణలో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.