Saturday, September 26, 2026
News Navigation
Saturday, September 26, 2026
News Navigation

Breaking

Saturday, September 26, 2026
Home Andhra Pradesh బి.కొత్తకోటలో గ్యాస్ సిలిండర్ల కోసం ఆందోళన.

బి.కొత్తకోటలో గ్యాస్ సిలిండర్ల కోసం ఆందోళన.

by CVR NEWS

అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట పట్టణంలోని పిటియం రోడ్డులో ఉద్రిక్తత నెలకొంది. పెద్దతిప్పసముద్రం మండలంలో వంట గ్యాస్ సిలిండర్ల కోసం లబ్ధిదారులు రోడ్డెక్కారు. ఇండియన్ గ్యాస్ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు గ్యాస్ బుక్ చేసుకున్నా.. బుకింగ్‌ను రద్దు చేసి సిలిండర్లు ఇవ్వడం లేదని లబ్ధిదారులు ఆరోపించారు. మరోవైపు కొంతమంది దుకాణదారులకు గ్యాస్ సిలిండర్లను బ్లాక్‌లో విక్రయిస్తూ.. సాధారణ వినియోగదారులకు సిలిండర్లు అందడం లేదని ఆరోపిస్తూ స్థానికులు రోడ్డుపై బైఠాయించారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గతంలోనూ గ్యాస్ సరఫరాపై ఫిర్యాదులు రావడంతో నెల రోజుల క్రితం అధికారులు ఇండియన్ గ్యాస్ ఏజెన్సీని సీజ్ చేశారు. అనంతరం తిరిగి ప్రారంభించినప్పటికీ పరిస్థితిలో మార్పు లేదని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. గ్యాస్ కొరతకు శాశ్వత పరిష్కారం చూపాలని, అర్హులైన వినియోగదారులకు సకాలంలో సిలిండర్లు అందించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Advertisements

You may also like

Leave a Comment

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: