Monday, May 18, 2026
News Navigation
Monday, May 18, 2026
News Navigation

Breaking

Monday, May 18, 2026
Home Andhra Pradesh బుల్లెట్ మంత్రిగా మారిన అంబటి…

బుల్లెట్ మంత్రిగా మారిన అంబటి…

by Prakash
Ambati Rambabu

అంబటి రాంబాబు (Ambati Rambabu) :

సత్తెనపల్లిలో అంబటి రాంబాబు (Ambati Rambabu) ఏది చేసినా సంచలనమే. ఆయన నిత్యం ఏదో రకంగా ప్రజలతో మమేకం అయ్యేందుకు ప్రయత్నిస్తూనే ఉంటారు. వినూత్నంగా ఆలోచిస్తూ సరికొత్తగా కార్యాచరణతో ముందుకు సాగుతుంటారు. ఇటీవల బుల్లెట్ వాహనంపై పర్యటిస్తూ, స్థానికులను పలకరిస్తూ, కార్యకర్తలను పరామర్శిస్తూ, ప్రధాన కూడళ్లలో నేతలతో భేటీ అవుతున్నారు. ఆర్భాటాలకు దూరంగా, సహజంగా, సౌలభ్యంగా ఉండేందుకు ఆయన రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ వాహనం పై గ్రామాలలో పర్యటిస్తూ వైఎస్ఆర్సిపి శ్రేణుల్లో నయా జోష్ ను నింపుతున్నారు రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు అంబటి రాంబాబు. కార్యకర్తలతో మమేకం అయ్యేందుకు కాన్వాయిని సహితం విడిచి కార్యకర్తలతో మమేకం అయ్యేందుకు ద్విచక్ర వాహనాలతో తరలి వెళ్తున్నారు. దీంతో యువకులు, నాయకులు ఆయన వెంట భారీగా హాజరవుతున్నారు. కొత్త తరాన్ని ప్రోత్సహిస్తున్నారు. గ్రామాల్లో సరికొత్త సందడిని తీసుకొస్తున్నారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

గతంలో పట్టణం, మాదల, లంకెలకూరపాడు, భీమవరం గ్రామాల్లో పర్యటనతో స్థానికుల నుంచి మంచి స్పందన లభించింది. సరికొత్త ట్రెండును సృష్టిస్తున్న అంబటికి పల్లెల్లో జనం నిరాజనం పలుకుతున్నారు. ఎన్నికల సమీపిస్తుండటతో పట్టణంలోని కీలక నేతలను పరామర్శించడం, పలకరించడం చేశారు, ఇదే కోవలో కొందరు వైద్యులను, ఇతర ప్రభావితం చేయగల వ్యక్తులను ఆయన కలుస్తున్నారు. గ్రామాలలోని వర్గ విభేదాలు, నాయకత్వ లోపాలు ఉన్నచోట సర్ది చెప్పి ఒక తాటిపై తీసుకొచ్చారు. దానికి పెద్ద మక్కిన గ్రామమే మంచి ఉదాహరణ. ఇలా అనేక కీలక అంశాలలో ఆయన అంతర్గతంగా వేగం పెంచారు. నేడు 500 బైకులతో భారీ ర్యాలీ రూరల్ మండలంలోని కీలకమైన పది గ్రామాలను ద్విచక్ర వాహనాలతో చుట్టి వచ్చేలా అంబటి ప్రణాళిక సిద్ధం చేశారు. తద్వారా గ్రామాలలో స్థానిక అంశాలపై చర్చించడం, రానున్న ఎన్నికలకు సన్నద్ధం చేయడం, మండలంలో వైయస్సార్సీపి నేతల్లో ఎన్నికల జోషిని నింపడమే లక్ష్యంగా ఆయన సాగుతున్నారు. ఏడవ తేదీ ఉదయం రామకృష్టాపురం, నందిగం, గుడిపూడి, లక్ష్మీపురం, ఫణిదం, భట్లూరు, కట్టమూరు, దీపాలదిన్నెపాలెం, అబ్బూరు, గండ్లూరు గ్రామాలలో మంత్రి ద్విచక్ర వాహన ర్యాలీగా పర్యటన జరగనుంది.

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇది చదవండి : హిందూపురం శంఖారావం యాత్రకు విచ్చేసిన లోకేష్…


కోనసీమ జిల్లా రాజోలులోని సీహెచ్ సీ లో గైనకాలజిస్టుల కొరత..
డాక్టర్..బిఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో గైనకాలజిస్టుల కొరత వేధిస్తోంది. ప్రభుత్వ …
గోదావరికి వరద పోటెత్తితే లంక గ్రామాలపై ప్రభావం..
అంబేద్కర్ కోనసీమ జిల్లా, పి. గన్నవరం మండలంలోని ఊడిమూడి లంక, బూరుగులంక, గంటి పెదపూడి, ఉచ్చుల …
నెల్లూరు జిల్లాలో నకిలీ సర్టిఫికెట్లు, ఫోర్జరీ సంతకాల మాఫియా..
నెల్లూరు జిల్లాలో నకిలీ సర్టిఫికెట్లు, ఫోర్జరీ సంతకాల మాఫియా కలకలం రేపుతోంది. గూడూరు, కోట ప్రాంతాలను …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

014439
Total views : 80210

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.