గుడిపల్లి పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ శ్రీనాథ్ మాట్లాడారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో బిసానత్తం వద్ద కారులో కర్ణాటక మద్యం గుర్తించడం జరిగిందని అన్నారు. పోలీసులను చూసి ఇద్దరు పారిపోయారన్నారు. కుప్పం రైల్వే స్టేషన్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించగా, కర్ణాటక నుండి తమిళనాడు రాష్ట్రం తీరుపత్తూరుకు అక్రమంగా కారులో మద్యం తరలిస్తున్నట్లూ విచారణలో వెల్లడైందన్నారు. సుమారు 1 లక్ష రూపాయలు విలువ చేసే మద్యంను స్వాధీనం చేసుకొని ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు డి ఎస్పీ శ్రీనాథ్ తెలిపారు. ఈ కేసులో ప్రతిభ కనబరిచిన పోలీసులను డీఎస్పీ శ్రీనాథ్ అభినందించారు. పోలీసులకు రివార్డ్ లని డీఎస్పీ చేతుల మీదుగా అందించారు.
Chittoor
కుప్పం మండల పరిధిలోని వసనాడుకు చెందిన శివ శంకర్ కు ముల్లూరు కృష్ణాపురంకు చెందిన హిమబిందుకు 13-10- 2016 న వివాహమయ్యింది. కాగా పెళ్ళైన 6 నెలల నుండి హిమబిందు ను తన భర్త శివ శంకర్ వేధింపులకు గురి చేస్తున్నాడని హిమంబిందు వాపోయింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తనకు పిల్లలు పుట్టలేదనే నెపంతో తన భర్త శివ శంకర్ కుటుంబీకులు తనను వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. శివశంకర్ కుటుంబీకులు తనపై దాడి చేసి వేధింపులకు గురి చేస్తున్నారని కన్నీటి పర్యంతమైంది. తనకు తెలియకుండా గత ఆరు నెలలకు ముందు బీహార్ కు చెందిన మైనర్ బాలికను శివశంకర్ పెళ్లి చేసుకున్నారని, గత వారం ముందు మైనర్ బాలికను ఇంటికి తీసుకొచ్చారని పేర్కొంది. రెండో పెళ్లి ఎందుకు చేసుకున్నావు అని నిలదీయడంతో, తనను కొట్టి తనను చిత్రహింసలకు గురిచేస్తున్నారని ఆరోపించింది. ముల్లురు కృష్ణాపురం గ్రామంలో అర్ధరాత్రి సమయంలో కారులో తీసుకొచ్చి పడేశారని హిమబిందు వాపోయారు. సంబంధిత అధికారులు స్పందించి శివశంకర్ పై చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని హిమబిందు కోరారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: తిరుపతిలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి
తిరుపతి (Tirupati) మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ (Ex MLA Sugunamma) తిరుగుబావుటా ఎగురవేశారు. గత ఐదు సంవత్సరాలుగా టీడీపీ ఇన్చార్జిగా ఉంటూ ప్రజల మధ్యలోనే ఉండి వారి సమస్యలను తెలుసుకొని వారికి, పార్టీకి అండగా ఉన్నానని.. ఇలాంటి పరిస్థితుల్లో కూటమిలో భాగంగా తిరుపతి సీటు జనసేనకు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో నాన్ లోకల్ వ్యక్తికి సీటు ఇవ్వద్దంటు సుగుణమ్మ అధిష్టానాన్ని కోరనున్నారు. కూటమిలో భాగంగా తిరుపతిలోని జనసేన టీడీపీ లో అభ్యర్థులకు ఎవరికి టికెట్ ఇచ్చినా ఖచ్చితంగా ఆ అభ్యర్థిని గెలిపించి చంద్రబాబునాయుడు కి పవన్ కళ్యాణ్ కి గిఫ్ట్ గా ఇస్తామని అన్నారు. తిరుపతి టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ జనసేన సీటు తనకి ఇస్తే ఆ పార్టీలో చేరుతానని ప్రకటన చేసారు. ఈ సందర్భంగా టీడీపీ ముఖ్య నేతలతో తిరుపతిలోని ప్రైవేట్ హోటల్లో సుగుణమ్మ సమావేశం అయ్యారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: చంద్రబాబు బెయిల్ రద్దు.. పిటిషన్పై విచారణ
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి
తిరుమల శ్రీవారిని ఏపీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి దర్శించుకున్నారు. శనివారం ఉదయం విఐపీ విరామ స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా.. ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల ఏపీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల పోటీకి ముందు శ్రీవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఏపీ ఎన్నికల్లో మరోమారు వైసీపీ పార్టీ గెలిచి సీఎం అవ్వాలని కోరుకున్నట్లు తెలిపారు. జగన్ ను ఎదుర్కోలేక…. పొత్తులు పెట్టుకొని గుంపులుగా వస్తున్నాయన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఒంటరిగా పోటీ చేసి గెలిచిన చరిత్ర చంద్రబాబుకు లేదన్నారు. ఎన్ని పార్టీలు వచ్చిన సీఎం జగన్ ను ఓడించలేరని ధీమా వ్యక్తం చేశారు. పవన్ కేవలం తాను అసెంబ్లీలో అడుగుపెడితే చాలు అనే పరిస్థితిలో ఉన్నారని స్పష్టం చేశారు. 2014లో అనుభవిజ్ఞుడు ఉంటే పరిపాలన సాగుతుందని అప్పట్లో ప్రజలు చంద్రబాబుకు ఓటు వేశారని…. చంద్రబాబు పాలన చూసి విసుగెత్తిన ప్రజలు వైసీపీకి పట్టం గట్టారని తెలిపారు. విశాఖలో అన్ని విధాలా అభివృద్ధి సాధ్యం కాబట్టే పరిపాలన రాజధాని చేయాలని సంకల్పించారన్నారు. మంచి పరిపాలన కోసం జగన్ ను మరోమారు ప్రజలు గెలిపిస్తారని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీకి మాకు ఎలాంటి సంబంధం లేదని…జగన్ ను రాజకీయంగా అణగతొక్కాలని చూసిన కాంగ్రెస్ పార్టీతో మేము కలిసే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. చంద్రబాబుకు మాత్రమే అన్ని సంధలు ఉంటాయనీ ఎద్దేవా చేశారు.
ఇది చదవండి: ప్రజాగళానికి అంచనాలకు మించి జన సంద్రోహం..
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి
అయ్యా.. లోకేష్ బాబు ఒక్కసారి ఆలోచించండి
గ్రామాల్లో తలెత్తుకుని తిరగలేకున్నాం
వైసిపి హయాంలో ఆదిమూలం పెట్టించిన అక్రమ కేసుల విషయమై ఇప్పటికీ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాం
తెదేపా తరపున ఆదిమూలం పోటీచేస్తే ఖచ్చితంగా ఓడిపోతాడు.. ఓడిస్తాం
తెదేపా నియోజకవర్గ మహిళా అధ్యక్ష్యురాలు వరలక్ష్మీ యాదవ్
తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఈ సారి సార్వత్రిక ఎన్నికల బరిలో సత్యవేడు నియోజకవర్గ స్థానం నుండి వైసిపి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పోటీచేయునున్నట్లు తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించింది. ఈ నేపధ్యంలో సత్యవేడు, వరదయ్యపాళెం మండలాల పరిధిలో పలువురు ఆదిమూలం తెదేపా అభ్యర్థి గా ప్రకటించడం సరికాదనే నిరసనలు తెలియజేశారు. ఈ క్రమంలోనే తెదేపా నియోజకవర్గ మహిళా అధ్యక్ష్యురాలు వరలక్ష్మీ యాదవ్ కేవిబిపురం మండల కేంద్రంలో ఆదిమూలం అభ్యర్థిత్వంపై అధిష్టానాన్ని ప్రశ్నిస్తూ నాయకులతో నిరసన వ్యక్తం చేశారు. ఆమె మాట్లాడుతూ అధిష్టానం సత్యవేడు అభ్యర్థిగా ఆదిమూలం ను ప్రకటించడం సరైన నిర్ణయం కాదన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
అధినేత చంద్రబాబు, నారాలోకేష్ లు ఈ అంశంపై పునరాలోచించాల్సిన అవసరం ఉందన్నారు. లోకేష్ పర్యటనలో రెడ్ గ్రూపు మెయిన్ టెన్ చేసి సమస్యలు సేకరించారు, అందులో ఏం సమస్యలను గుర్తించారు. ఆపైల్ ను చించేశారా అంటూ నిలదీశారు. అయ్యా లోకేష్ బాబు ఒక్కసారి ఆలోచించండి ఇక్కడ గ్రామాల్లో తలెత్తుకుని తిరగలేని పరిస్థితి ఉంది, వైసిపి వాళ్ళు ఫోన్ లు చేసి మా నాయకుడు మీ నాయకుడు అయ్యాడు ఈసారి గెలిచేది వైసిపి నే, మా మీటింగ్ లకు రండి, బస్సులు పెట్టాము అంటూ టిడిపి లీడర్లను పిలుస్తున్నారు. ఇలాంటి దౌర్భాగ్యస్థితిలో ఉన్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇది చదవండి : నిర్లక్ష్యానికి మారుపేరు గా మారిన మున్సిపల్ అధికారులు…
సర్వే చేసిన వారు కనిపిస్తే కొడతాం
తెదేపా అభ్యర్థి ఎంపిక విషయంలో సర్వే చేసిన వాళ్ళు కనిపిస్తే కొడతామని వరలక్ష్మీ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసిపి హయాంలో ఎమ్మెల్యే ఆదిమూలం గ్రామాల్లో తమపై పెట్టించిన అక్రమ కేసుల్లో ఇప్పటికీ పోలీస్ స్టేషన్ ల చుట్టూ తిరుగుతున్నామని అన్నారు. ఏవిధంగా సర్వే జరిగింది, ఎందుకు ఆదిమూలంకు టిక్కెట్ ఇచ్చారు, అసలు ఆదిమూలంకి తెదేపా సభ్యత్వం ఉందా..? పోనీ వైసిపిలో పదవికి రాజీనామా చేశారా..? అనే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఇకనైనా పార్టీ అధిష్టానం, సత్యవేడు అభ్యర్థి విషయంలో సరైన నిర్ణయం తీసుకుని, తెదేపా సొంతిగూటి నుంచి ఉన్న వారిలో ఎవరు ఎన్నికల బరిలో నిలబడినా గెలుస్తామన్నారు. ఆదిమూలం నే అభ్యర్థిగా కొనసాగిస్తే ఖచ్చితంగా ఓడిపోతాడని ఆమె పేర్కోన్నారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 14 నియోజకవర్గాలకు గాను 13 నియోజకవర్గాలలో టీడీపీ, ఒక నియోజకవర్గం జనసేనకు ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో తిరుపతిలో జనసేనకు టికెట్టు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అభ్యర్థి ఎవరు అనేదానిపై ఉత్కంఠత నెలకొంది. నిన్న టీడీపీ విడుదల చేసిన పేర్లలో జిల్లాలోని తిరుపతి పేరు మినహా మిగిలిన నియోజకవర్గాల పేర్లను ప్రకటించారు. చిత్తూరుకు చెందిన వైసీపీ సీటింగ్ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాస్ జనసేన చేరిక తర్వాత రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. దీంతో తిరుపతి జనసేన అభ్యర్థిగా ఆరని శ్రీనివాసులు ప్రకటిస్తారని సమాచారం రావడంతో టీడీపీ జనసేన నాయకులు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకొని నాన్ లోకల్ వ్యక్తులకు టికెట్ ఇస్తే సహకరించ కూడదని నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ జనసేన నాయకులు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరని శ్రీనివాస్ కే తిరుపతి టికెట్టు కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారని డాక్టర్ హరిప్రసాద్ అన్నారు. దీంతో ఆరణి శ్రీనివాస్ కపిలతీర్థం లోని శివాలయంను, తిరుపతి గంగమ్మ ని దర్శనం చేసుకున్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: నరసన్నపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా బగ్గు రమణమూర్తి..
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి
శ్రీకాళహస్తి నియోజక వర్గం మొదటి నుంచి రాజకీయ చైతన్యం కలిగినది. నాయకులే కాకుండా ఓటర్లు కూడా ఎంతో చైతన్యవంతులు. నాయకులకు పాఠం చెప్పడం, గుణపాఠం చెప్పడం కూడా ఓటర్లకు వెన్నతో పెట్టిన విద్య. ఈ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా దివంగత మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి పేరు ఖరారైంది. గత ఎన్నికల్లో ఓడిపోయిన సానుభూతి, గోపాలకృష్ణారెడ్డి సానుభూతి ఆయనకు కలిసి వచ్చే అంశం. అంతమాత్రాన గెలుపు నల్లేరు మీద నడక మాత్రం కాదు. సొంత పార్టీలోని అసమతి నేతలను మచ్చిక చేసుకోవలసిన అవసరం ఉంది. అంతేకాకుండా బిజెపి, జనసేన నాయకులతో కూడా సమన్వయం ఏర్పరచుకోవాలి.
పార్టీలో అంటీ ముట్టనట్లుగా వ్యవహరిస్తున్న మాజీ ఎమ్మెల్యేలు ముని రామయ్య, ఎస్సీవి నాయుడు, టికెట్టు ఆశించి భంగ పడిన గాలి చలపతి నాయుడు, డాక్టర్ రాజేష్ లాంటి వారిని కలుపుకొని పోవాలి. 2019లో ఓడిపోయిన తర్వాత సుమారు మూడు సంవత్సరాలకు పైగా అందుబాటులో లేకుండా ఉండడం… ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులను, కార్యకర్తలను పెద్దగా పట్టించుకోక పోవడం… పార్టీ కార్యక్రమాలకు ఆర్థిక సహకారం అందించక పోవడం… కొందరి మాటలే నమ్మడం… ఇతరుల మాటలను లెక్కలోకి తీసుకోకపోవడం.. ఎక్కువకాలం హైదరాబాద్ కి పరిమితం కావటం లాంటి సంఘటనలు జరిగాయి.
ఎక్కువ మంది నాయకులు, కార్యకర్తలు అనవసరంగా కేసుల్లో ఇరుక్కోవడం.. శ్రీకాళహస్తి రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద అనవసరంగా హంగామా చేసి తనతో పాటు అందరినీ కేసుల్లో ఇరికించడం… బెయిల్ కోసం కుటుంబాలకు దూరంగా ఉండటం లాంటి సంఘటనలతో కొందరు మనస్థాపానికి గురై ఉన్నారు. అటువంటి వారికి పూర్తిస్థాయి భరోసా ఇవ్వాల్సి ఉంది. పార్టీ అధికారంలోకి వస్తే పనిచేసిన వారికి పదవులు ఇవ్వడం… పార్టీలో సముచిత స్థానం కల్పించడం లాంటి వాటిపై ఆయన స్పష్టత ఇవ్వాల్సి ఉంది.
గీతాంజలి చనిపోయేదానికి కారణం టిడిపి నాయకులేనని చంద్రబాబు నాయుడు దిష్టిబొమ్ము (chandra babu naidu Poster)ను కాల్చిన వైసిపి నాయకులు (YCP Leaders) ధ్వజమెత్తారు. గీతాంజలి (Geethanjali) జగన్మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) మాకు ఇంటి పట్టాలు అమ్మ ఒడి పథకం వచ్చిందని సంతోషంగా ఫేస్బుక్లో వ్యక్త పరచడంతో ఫేస్బుక్లో వేధించి ఆమె చావుకు టిడిపి వాళ్ళు కారణమయ్యారని వైసిపి నాయకులు ధ్వజమెత్తారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
కౌన్సిలర్ శ్యామ్ మాట్లాడుతూ..
ప్రతిపక్షం IDDP వాళ్లు లేనిపోనివన్నీ ఫేస్బుక్లో పెట్టి ఇంట్లో గొడవలు పెట్టి ఆమె మనస్థాపం గురి అయ్యి రైలు కిందపడి చనిపోవడం జరిగిందని తెలిపాడు.
కౌన్సిలర్ మురళి మాట్లాడుతూ..
పవిత్ర మురళీకృష్ణ గుంటూరు జిల్లా తెనాలిలో గీతాంజలి వాళ్ళ ఇంటికి వెళ్లి వారిని పరామర్శించి వచ్చామని వాళ్లు చాలా పేద కుటుంబమని, గీతాంజలి భర్త 300 రూపాయలకి కూలీగా పని చేస్తున్నాడని, అటువంటి ఫ్యామిలీని ఐడిడిపి వాళ్ళు వేధించి ఆమె చావుకు కారణమయ్యారని, దీనికి కారణం తెలుగుదేశం నాయకులు, దాని వెనుక ఉన్న చంద్రబాబు నాయుడు లోకేష్ అని కౌన్సిలర్ మురళీకృష్ణ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు దిష్టిబొమ్మను కాల్చామని మేము ప్రజల పక్షాన ఎప్పుడూ ఉంటామని మేము ప్రజల మనుషులమని వైసిపి నాయకులుగా చెబుతున్నారు.
ఇది చదవండి: ఘోర రోడ్డు ప్రమాదం..
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి
తాజాగా శాంతిపురం మండలం మోరసనపల్లి పంచాయితీకి చెందిన వైసీపీ సర్పంచ్ జగదీష్ భార్య నీలమ్మ కి వైసీపీ బ్యాచ్ భయంకరంగా ట్రోల్ చేస్తున్నారు. అభివృద్ధి ఏది అని ప్రశ్నించినందుకు ఆ మహిళా మీద సమాజం సిగ్గుతో తలదించుకునేలా పోస్టులు పెట్టారు. గతంలో మోరసనపల్లి పంచాయితీ కి సంబంధించిన పశువుల సంత స్థలాన్ని కొంతమంది వైసీపీ నాయకులు కబ్జాకు ప్రయత్నిచడంతో సర్పంచ్ జగదీష్ తో పాటు అడ్డుకొన్నారు. అదేక్రమంలో కుప్పం పర్యటన కు వచ్చిన మంత్రి పెద్దిరెడ్డి వాహనాన్ని అడ్డుకొని, జరిగిన విషయాన్ని తెలుపుతూ నిరసన తెలియజేసారు. అప్పట్నుంచి తనకు వేధింపులు మొదలయ్యాయి. ఇప్పుడు ఏది ప్రశ్నించిన సరే అసభ్య పదజాలంతో సోషల్ మీడియాలో వైసీపీ బ్యాచ్ పోస్టులు పెడుతున్నారు. తన మీద వైసీపీ సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులను స్వయంగా ఆమె స్క్రిన్ షాట్ తీసి సోషల్ మీడియాలో పోస్టు చేసారు. వైసీపీ బ్యాచ్ పెట్టిన పోస్టులు చూస్తుంటే మహిళల మీద వారికున్న అభిప్రాయం ఇట్టే తెలుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: రాజధాని బస్ ను ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి
మదనపల్లి (madanapally)లో క్రూర మృగాలు లాగా కొందరు యువకులు మారిపోతున్నారు. పట్టపగలే మదనపల్లి ఇందిరా నగర్ మెట్రో కాంప్లెక్స్ సర్కిల్ (Indira gandhi metro complex circle) వద్ద స్థానిక జడ్పీ హైస్కూల్లో పదవ తరగతి చదువుతున్న ఓ మైనర్ విద్యార్థి పై పలువురు యువకులు ఇనుప రాడ్లు, బెల్టులతో పైశాచిక దాడికి పాల్పడి తీవ్రంగా కొట్టారు. స్థానికులు వారిస్తున్న వినకుండా చావ బాధారు. ఇది ఇక్కడ షర మామూలయింది. కొందరు యువకులు క్రూర మృగాల కన్నా దారుణంగా తయారై మదనపల్లి లో ఇలాంటి దాడులు తెగ రెచ్చి పోయి చేస్తున్నారు. ఇలా ఒకటా రెండా, కోమిటి వాని చెరువు ఉన్న ఓ కళాశాల ముందు జరిగిన దాడిలో ఓ విద్యార్థి అవిటివాడు అయ్యాడు. బయటకు చెప్పుకోలేక ఇంటికే పరిమితమయ్యాడు. రామారావు కాలనీలో కొందరు ఓ విద్యార్థినిని కొట్టడంతో అతనికి కులం అడ్డొచ్చింది. సంఘాల బెదిరింపులకు భయపడి కేసులు పెట్టలేదు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: నాలుగో విడత వైఎస్సార్ చేయూత చెక్కుల పంపిణీ…
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి



Total views : 196658