జమ్మలమడుగు పట్టణంలోని శ్రీ నారాపుర వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామున నుంచి ఉత్తరద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున క్యూ కట్టారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి రాజేష్ స్వామి వైకుంఠ ఏకాదశి పండగ పర్వదినం విశిష్టతను తెలియజేశారు. ఈ రోజున స్వామి వారిని దర్శించుకుంటే సకల పాపాలు తొలగి శుభం కలుగుతాయని తెలిపారు. ఈ సందర్బంగా టిటిడి అధికారులు భక్తుల కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. శ్రీ నారాపురం వెంకటేశ్వర స్వామి గరుడ వాహనంలో భక్తులకు ఉత్తర మార్గంలో దర్శనమిచ్చారు. ఆలయానికి వచ్చిన భక్తులకు శ్రీవారి సేవా సమితి జమ్మలమడుగు సభ్యులు ప్రసాద వితరణ చేశారు.
Kadapa
నేడు కడప జిల్లా రానున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మూడు రోజులపాటు జిల్లాలో పర్యటించనున్న ముఖ్యమంత్రి జగన్. జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించినున్న ముఖ్యమంత్రి. ఈరోజు ఉదయం 10:30కు కడపకు చేరుకొని అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో బద్వేల్ నియోజకవర్గం లోని గోపవరం మండలంలో సెంచరీ ప్లైవుడ్ ఇండస్ట్రీని ప్రారంభించి. హై పవర్ లామినేషన్ ప్లాంట్ కు శంకుస్థాపన చేయనున్న సీఎం. అనంతరం12 గంటల 45 నిమిషాలకు కడప రిమ్స్ ఆసుపత్రికి చేరుకొని సుమారు 300 కోట్లతో నిర్మించిన డాక్టర్ వైఎస్ఆర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ ఆసుపత్రి, క్యాన్సర్ ఆసుపత్రి, ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రులతోపాటు… వైయస్ రాజారెడ్డి క్రికెట్ స్టేడియం ప్రారంభం. మధ్యాహ్నం అంబేద్కర్ జంక్షన్ వద్ద రోడ్డు విస్తరణ పనులను, కోటిరెడ్డి సర్కిల్లో విగ్రహాలు ఆవిష్కరణ. మున్సిపల్ స్టేడియంలో ఇంటర్నేషనల్ హాకీ కోర్టుకు శిలాఫలకం వేసి అనంతరం ఇడుపుల పాయ చేరుకొని అక్కడే రాత్రి బస చేయనున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.
అంగన్వాడీల సమస్యల పరిష్కారానికై ఏపీ అంగన్వాడీ వర్కర్స్ & హెల్పర్స్ యూనియన్ ఆదేశాల మేరకు చేపట్టిన అంగన్వాడీల నిరవధిక సమ్మె నేటికి 11 వ రోజు చేరుకొంది. అన్నమయ్య జిల్లా రాయచోటి లో ఒక్కొక రోజు ఒక్కొక నిరసన కార్యక్రమం తో అంగన్వాడీ వర్కర్స్ & హెల్పర్ లు సమ్మెను ఉధృతంగా నిర్వహిస్తున్నారు. ఈ రోజు విద్యుత్ కార్యాలయం నుండి చెక్ పోస్ట్ సర్కిల్ వరకు గ్లాస్ తో ప్లేట్ ను కొడుతూ బిచ్చగాళ్ళలా వినూత్న రీతిలో రాస్తారోకు నిర్వహించి నిరసనను తెలియజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ 11 రోజులు గా అంగన్వాడీ మహిళలు రోడ్లపైకి వచ్చి నిరసన తెలియజేస్తున్నప్పటికి ప్రభుత్వం నుండి స్పష్టమైన ప్రకటనలు మాత్రం రావడం లేదన్నారు. కేవలం వయోపరిమితి పెంచడం వల్ల వారి జీవన శైలిలో ఎటువంటి మార్పులు రావని పెరిగిన ధరలకు అనుగుణంగా సమాన పనికి సమాన వేతనం పెంచే విధంగా ప్రభుత్వ పెద్దలు ఆలోచించాలని అన్నారు. శిశు సంక్షేమ శాఖ మంత్రి కి మా డిమాండ్ల పరిష్కారానికి నోటిసులు అందజేసి చర్చలకు రమ్మంటే వారు ఏ మాత్రం పట్టీ పట్టనట్టు వ్యవహరిస్తున్న మంత్రి తీరును మార్చుకోవాలన్నారు. గతంలోనున్న జివోలను తెరపైకి తీసుకు వచ్చి అంగన్వాడీలను మభ్య పెట్టేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తుందన్నారు. మేము సమ్మెలు చేస్తున్న సమయంలో మా సమస్యలను పరిష్కరించకుండా సచివాలయ ఉద్యోగులు, రెవెన్యూ వారిని కేంద్రాల అంగన్వాడీ తాళాలు పగలగొట్టే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని వారు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి రామంజులు, సిఐటియు అంగన్వాడి ప్రాజెక్టు కోశాధికారి భాగ్యలక్ష్మి, కె.వి డిఎస్ జిల్లా అధ్యక్షుడు డిసి వెంకటయ్య, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నరసింహులు, సిద్ధమ్మ, అంగన్వాడీ హెల్పర్స్ మరియు లీడర్స్ తదితరులు పాల్గొన్నారు.
కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో అక్రమ ఇసుక రవాణా, అసాంఘిక కార్యకలాపాలు పెరిగిపోయాయని, చివరకు పోలీస్ అధికారుల మీద, ఫారెస్ట్ అధికారుల మీద ఇసుక మాఫియా దాడులు చేసే స్థితికి పెరిగిపోయిందని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరద రాజుల రెడ్డి ఆరోపించారు. నంగనూరు పల్లె ఫారెస్ట్ పరిధిలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ను పట్టుకునేందుకు ప్రయత్నించిన సిబ్బందిపై ఇసుక మాఫియా ట్రాక్టర్ తో వాహనాన్ని ఢీ కొట్టించి గాయపరిచే చర్యలకు పాల్పడ్డారని, ఇది దారుణమని మాజీ ఎమ్మెల్యే వరద అన్నారు. 50 మంది ప్రజా ప్రతినిధులను తన వెంట తీసుకువెళ్లి ప్రొద్దుటూరులో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు లేకుండా చూడాలని ఎమ్మెల్యే చేసిన విజ్ఞప్తులు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. అధికార పార్టీ నేతల అండదండలతోనే ఇసుక మాఫియా పేట్రేగిపోతోందని విమర్శించారు. జిల్లా ఎస్పీ ఎందుకు ఈ అసాంఘిక, అక్రమ కార్యకలాపాలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో చెప్పాలన్నారు. నియోజకవర్గంలో అక్రమ వ్యవహారాలను అరికట్టకపోతే ప్రజలు తీవ్రంగా నష్టపోతారని, అధికారులు అభద్రతతో పని చేయాల్సిన పరిస్థితి వస్తుందని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీకి మాజీ ఎమ్మెల్యే వరద రాజుల రెడ్డి విజ్ఞప్తి చేశారు.
కడప జిల్లా… ఇచ్చిన మాట ప్రకారం అర్హులైన పేదలందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వడమే గాక, ఇల్లు కట్టించి ఇచ్చే కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేస్తున్నామని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి చెప్పారు. ఒక్క వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలోను, మళ్లీ వైయస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో తప్ప మరే ప్రభుత్వంలోనూ నిరుపేదలకు ఈ నియోజకవర్గంలో ఇల్లు మంజూరు కాలేదన్న విషయాన్ని ఎమ్మెల్యే సందర్భంగా గుర్తు చేశారు. తెలుగుదేశం నేతలు కేవలం విమర్శలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు తప్ప, టిడిపి ప్రభుత్వం ఏ నిరుపేదకు ఏ ఇల్లు ఎక్కడ ఇచ్చిందో చెప్పాలని ఎమ్మెల్యే రాచమల్లు డిమాండ్ చేశారు. ప్రజా నేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన సందర్భంగా సోములవారి పల్లి జగనన్న కాలనీలో నూతన ఇళ్లను ఎమ్మెల్యే రాచమల్లు ప్రారంభించారు. నిరుపేదల సొంత ఇంటి కల నెరవేర్చిన ముఖ్యమంత్రికి నియోజక వర్గ ప్రజల తరపున కృతజ్ఞతలు చెప్పారు. ఇళ్ళ నిర్మాణం విషయంలో కొంత ఆలస్యమైనా అర్హులకు సిఎం పుట్టిన రోజున వెయ్యి ఇళ్లు పూర్తి చేసి అందిస్తున్నామన్నారు. మీనపురం, బొల్లారం జగనన్న కాలనీలలో కూడా రాబోయే మూడు నాలుగు నెలల్లో 17 వేల ఇళ్లు పూర్తి చేసి ఇస్తామన్నారు. అయితే నియోజక వర్గంలో 24 వేల ఇళ్లు ఇవ్వటమే కాక వాటిని నిర్మించి ఇచ్చే బాధ్యతను తీసుకున్నామన్నారు. సోములవారి పల్లెలోని రామేశ్వరం జగనన్న కాలనీ ఇళ్ళ ప్రారంభోత్సవంలో మున్సిపల్ చైర్ పర్సన్ వీనుపల్లి లక్ష్మీదేవి, ఆప్కాబ్ చైర్మన్ మల్లెల ఝాన్సీ రాణి, పద్మ చెలియా, కార్పొరేషన్ చైర్మన్ జింక విజయలక్ష్మి, వైసిపి నాయకులు నరసింహారెడ్డి, కల్లూరు నాగేంద్ర రెడ్డి, వరుకూటి ఓబుల్ రెడ్డి, పిట్ట బాలాజీ పాతకోట వంశీధర్ రెడ్డి, ఎంపీపీ శేఖర్ యాదవ్ ఇతర నాయకులు కార్యకర్తలు అధికారులు పాల్గొన్నారు..
సమగ్ర శిక్ష కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ ఉద్యోగస్తులను విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులర్ చేస్తూ సమాన పనికి సమాన వేతనం అందజేయాలంటూ అన్నమయ్య జిల్లా రాయచోటి కలెక్టర్ రేట్ కార్యాలయం సమీపంలో రెండు రోజులుగా నిరవధిక సమ్మె కొనసాగిస్తున్నారు. ఈ సమ్మెలో జిల్లా వ్యాప్తంగా ఉన్న సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగస్తులు పాల్గొన్నారు. ఈ సమ్మెకు యస్ టి యు ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ వై రవీంద్ర నాగిరెడ్డి తో పాటు ఏ పీ టీ ఎఫ్ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు హరిబాబు సంఘీభావం తెలుపుతూ ప్రభుత్వం వీరి డిమాండ్లను సత్వరమే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వీరు చేస్తున్న న్యాయపరమైన డిమాండ్లకు తమ ఉపాధ్యాయ సంఘం, నాయకుల తరుపున సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామని వారు స్పష్టం చేశారు. అదేవిధంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన నాడు నేడు నుంచి పిల్లల చదువులకు అవసరమయ్యే అమ్మబడి, ట్యాబులు, యూనిఫామ్, బుక్స్, మిడ్డే మిల్స్ తదితర వాటిని ఎప్పటికప్పుడు ప్రభుత్వం నిర్దేశించిన సమయాలలో మా వీధులను పూర్తి చేస్తున్నామన్నారు. ప్రధానంగా ఈ సమ్మెబాట పట్టడానికి కారణం సమగ్ర శిక్ష ఉద్యోగుల అందరికీ హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలి. అందరికీ మినిమం ఆఫ్ టైం స్కేల్ హెచ్ఆర్ఏడిఏ అమలు చేసి వేతనాలు పెంచాలి. ప్రస్తుతం ఉన్న పార్ట్ టైం విధానాన్ని రద్దుచేసి ఫుల్ టైం కాంట్రాక్టు విధానాన్ని అమలు చేసి వేతనాలు పెంచాలి. ఔట్సోర్సింగ్ సిబ్బందిని కాంటాక్ట్ పద్ధతిలోని మార్చి మినిమం ఆప్షన్స్ వేతనాలు పెంచాలి. 10 లక్షల రిటర్మెంట్ బెనిఫిట్ గ్రాటివిటీ కల్పించాలి. సామాజిక భద్రత పథకాలు ఈపీఎఫ్ ఈఎస్ఐ కార్డు సదుపాయాన్ని కల్పించాలి. పదవీ విరమణ వయసు 62 వేలకు పెంచాలి. వేతనంతో కూడిన మెడికల్ లీవులు మంజూరు చేయాలి. మెరుగైన హెల్త్ స్కీమ్ అమలు చేయాలి. అన్ని సంక్షేమ పథకాల తో పాటు, వడ్డీ లేని బ్యాంకు రుణాలు మంజూరు చేయాలి. మరణించిన ఉద్యోగుల కుటుంబాలను ఆదుకోవాలి, కారుణ్య నియమాకాలు చేపట్టాలి. మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేరి లీవులు మంజూరు సదుపాయాన్ని కల్పించాలి. ప్రతి నెల ఒకటో తేదీకి వేతనాలు చెల్లించి సంవత్సరానికి సరిపడే బడ్జెట్ ఒకేసారి విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు.
మాజీ ఎమ్మెల్యే ,ఇంఛార్జి అర్ రమేష్ రెడ్డి అధ్వర్యంలో రాయచోటి నియోజకవర్గంలో ముస్లింల ఆత్మీయ సదస్సు, విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ షరీఫ్ హాజరైనారు. కాబోయే రాజంపేట పార్లమెంట్ అభ్యర్థి సుగావాసి సుబ్రమణ్యం, కడప అమీర్ బాబు, ప్రొద్దుటూరు ప్రాంతానికి చెందిన ముక్తియార్, మాజీ టిటిడి పాలకవర్గ సభ్యులు సుగావాసి ప్రసాద్ బాబు,ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సమావేశానికి అధిక సంఖ్యలో మైనార్టీలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరైనారు.
కడప జిల్లా.. జమ్మలమడుగు నియోజకవర్గం పరిధిలోని ముద్దనూరు మండలం చింతకుంట గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి చెందగా 15 మంది త్రీవంగా గాయపడ్డారు. కొండాపురం నుంచి వేంపల్లి వెళ్తున్న రెండు పెళ్లి బస్సులు ఒకదాని వెనుక ఒకటి ఢీకొన్నాయి. దీంతో పెళ్లి బృందంలోని ఒక వ్యక్తి అక్కడికి అక్కడే మృతి చెందగా 15 మందికి తీవ్రంగా గాయాలు అయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సూపర్ స్పెషాల్టి హాస్పిటల్ స్థాయిలో రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించే లక్ష్యంతోనే ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి నాయకత్వంలో వంద పడకల ఆసుపత్రి నిర్మాణం తుది దశకు చేరుకుందని అన్నమయ్య జిల్లా వైకాపా విభాగం మైనార్టీ అధ్యక్షులు, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు బేపారి మహమ్మద్ ఖాన్ తెలిపారు. రాయచోటి పట్టణం నందు 23 కోట్లతో తుది దశకు చేరుకున్న వంద పడకల ఆసుపత్రి నిర్మాణం ను ఆసుపత్రి సూపరిటెండెంట్ డేవిడ్ సుకుమార్, సీనియర్ వైద్యులు బండారు కిరణ్ కుమార్, ఇంజనీరింగ్ శాఖ డి ఈ ఈ రాజగోపాల్ రెడ్డి, కాంట్రాక్టర్ కార్తీక్ లతో కలిసి వారు ఆసుపత్రి ప్రాంగణంలోని రోడ్లను భవన నిర్మాణాలను పరిశీలించి పలు విషయాలను వారిని అడిగి తెలుసుకున్నారు. వివిధ రకాల వైద్య సదుపాయాల కోసం కేటాయించిన గదులతో పాటు ఆపరేషన్ థియేటర్, లిఫ్ట్, ల్యాబ్, రిసెప్షన్ లను కూడా పరిశీలించారు. 40 లక్షల నిధులతో అదనంగా నిర్మిస్తున్న ఐ పి హెచ్ ల్యాబ్ ను 25 లక్షల నిధులతో ప్రస్తుతం ఉన్న ఆసుపత్రి భవనం పనులను, నిర్మాణాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 21వ తేదీన ఎపి సిఎం ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి జన్మదినం రోజున ప్రారంభం చేసి రోగులకు అందుబాటులోకి తేవాలన్న లక్ష్యంగా ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి పెట్టుకొన్నారన్నారు. అయితే ఇంజినీరింగ్, గుత్తేదారులు ఒక వారం సమయం ఇచ్చినట్లయితే నిర్మాణాలు పూర్తి చేసి అప్పగిస్తామని తమకు తెలియజేసారాన్నరు. ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లి వారి నిర్ణయాన్ని తెలియజేసిన తర్వాతనే వారి నిర్ణయాన్ని మీకు స్పష్టంగా తెలియజేయడం జరుగుతుందన్నారు. వారి వెంట ప్రోగ్రాం డైరెక్టర్ సాయి, వైకాపా నాయకులు అన్నా సలీం, బేపారి జబి బుల్లా ఖాన్ పాల్గొన్నారు.
అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు పట్టణం స్థానిక రైల్వే స్టేషన్ రోడ్ లోని ఓ భవనంలో జనసేన పార్టీ నూతన కార్యాలయాన్ని పార్టీ నాయకులు ముత్యాల కిషోర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు కలిసి ప్రారంభించడం జరిగింది. పూజా కార్యక్రమాలు నిర్వహించి, నియోజకవర్గంలోని ఐదు మండలాల నుంచి విచ్చేసిన జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు నూతన కార్యాలయం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని శుభాభివందనం తెలియజేశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ సీనియర్ నాయకులు మాట్లాడుతూ ఈ నూతన కార్యాలయం ప్రారంభించడం రైల్వే కోడూరు మండల కార్యకర్తలకు, నాయకులకు మంచి శుభ సూచికమని రాబోయే ఎన్నికల్లో సమిష్టిగా కృషి చేసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు, సిద్ధాంతాలకు అనుగుణంగా ఆయన మాటే శిరోధరంగా భావించి ముందుకు వెళ్లాలని నాయకులకు, కార్యకర్తలకు, దిశా నిర్దేశం చేశారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మండల తెదేపా నాయకులు కూడా పాల్గొనడం జరిగింది.





Total views : 194677