Saturday, August 15, 2026
News Navigation
Saturday, August 15, 2026
News Navigation

Breaking

Saturday, August 15, 2026
Home Andhra Pradesh పశ్చిమగోదావరి జిల్లాలో వివాహిత దీక్ష.

పశ్చిమగోదావరి జిల్లాలో వివాహిత దీక్ష.

by CVR NEWS
పశ్చిమగోదావరి జిల్లాలో వివాహిత దీక్ష

పశ్చిమగోదావరి జిల్లాలో ఓ వివాహిత న్యాయం కోసం అత్తింటి ముందు దీక్షకు దిగిన ఘటన చర్చనీయాంశంగా మారింది. తన భర్త తనకు కావాలంటూ, అదనపు కట్నం కోసం వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ మహిళ భర్త ఇంటి ముందు భీష్మించుకుని కూర్చుంది.వివాహం జరిగిన కొంతకాలం తర్వాత అదనపు కట్నం కోసం భర్త కుటుంబ సభ్యులు తనను వేధించడం ప్రారంభించారని నవ్యశ్రీ ఆరోపించింది. అంతేకాకుండా తన భర్తకు విడాకులు ఇవ్వాలంటూ నోటీసులు పంపించారని ఆవేదన వ్యక్తం చేసింది.తనకు తన భర్తతోనే కలిసి జీవించాలని ఉందని, న్యాయం జరిగేంత వరకు అత్తింటి ముందు నుంచి కదిలేది లేదని స్పష్టం చేస్తూ భీష్మించుకుని దీక్ష కొనసాగించింది.అనంతరం నవ్యశ్రీ కాళ్ల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. కాళ్ల ఎస్‌ఐ శ్రీనివాస్ వరకట్న వేధింపుల కేసు కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: