Saturday, August 15, 2026
News Navigation
Saturday, August 15, 2026
News Navigation

Breaking

Saturday, August 15, 2026
Home Andhra Pradesh అంగన్‌వాడీల అభివృద్ధితోనే చిన్నారుల ఉజ్వల భవిష్యత్తు.

అంగన్‌వాడీల అభివృద్ధితోనే చిన్నారుల ఉజ్వల భవిష్యత్తు.

by CVR NEWS
అంగన్‌వాడీల అభివృద్ధితోనే చిన్నారుల ఉజ్వల భవిష్యత్తు

చిన్నారుల సమగ్రాభివృద్ధికి అంగన్‌వాడీ కేంద్రాలే బలమైన వేదికలని ఏపీ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో.. మహిళా, శిశు సంక్షేమ శాఖ, ఐటీసీ మిషన్ సునెహ్రా కల్, మరియు ప్రథమ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన అంగన్‌వాడీ కేంద్రాల బలోపేత కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యా వ్యవస్థలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకువచ్చి, ప్రతి ఒక్కరికీ నాణ్యమైన విద్యను అందించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. 3 నుండి 6 సంవత్సరాల వయస్సు గల ఫ్రీ స్కూల్ చిన్నారులకు నాణ్యమైన ప్రాథమిక బాల్య సంరక్షణ, విద్య అందించడమే ఈ ఉమ్మడి కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యమని చెప్పారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: