Tuesday, September 29, 2026
News Navigation
Tuesday, September 29, 2026
News Navigation

Breaking

Tuesday, September 29, 2026
Home Andhra Pradesh ఏపీ, ఆస్ట్రేలియా మధ్య ద్వైపాక్షిక సంబంధాల దిశగా అడుగులు.

ఏపీ, ఆస్ట్రేలియా మధ్య ద్వైపాక్షిక సంబంధాల దిశగా అడుగులు.

by CVR NEWS

ఆంధ్రప్రదేశ్, ఆస్ట్రేలియా మధ్య సంబంధాలను బలోపేతం చేసే దిశగా కీలక అడుగు పడింది. ఆస్ట్రేలియా అంతర్జాతీయ విద్య, పౌరసత్వ వ్యవహారాల సహాయ మంత్రి జూలియన్ హిల్ ఆంధ్రప్రదేశ్‌లో పర్యటనకు విచ్చేశారు. గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి టీజీ భరత్‌ ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆస్ట్రేలియా ప్రతినిధి బృందం రోడ్డు మార్గంలో విజయవాడకు బయలుదేరి వెళ్లింది. గతేడాది మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియాలో పర్యటించిన సమయంలో చేసిన ఆహ్వానానికి సానుకూలంగా స్పందించి, ఆస్ట్రేలియా మంత్రివర్గ బృందం ఏపీకి వచ్చిందని మంత్రి టీజీ భరత్ తెలిపారు. విద్యారంగంలో సహకారం, అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల ఏర్పాటు మరియు పెట్టుబడులపై కీలక చర్చలు జరిపేందుకు ఈ పర్యటన చక్కటి అవకాశమని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇవాళ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవ వేడుకల్లో సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ పాల్గొంటారు. ప్రారంభోత్సవం అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ అమరావతికి చేరుకుని ఆస్ట్రేలియా ప్రతినిధులతో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో విద్యారంగంలో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోవడంపై చర్చలు జరుగనున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల ఏర్పాటు, నైపుణ్యాభివృద్ధి, పరిశోధనా రంగాల్లో సహకారం అందించడంపై చర్చించే అవకాశం ఉంది.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: