ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాయంత్రం పూట క్రికెట్ మ్యాచ్ చూడండి తప్పులేదు కానీ రైతుల గురించి కూడా పట్టించుకోండి అని జగిత్యాల జిల్లా కోరుట్ల ఎమ్మెల్యే డా. సంజయ్ అన్నారు. మెట్ పల్లి పట్టణంలోని పాత బస్ స్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన రైతు దీక్షలో ఆయన పాల్గొని రైతులకు మద్దతు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు పెరిగాయి అని అన్నారు. రైతులకు ఇచ్చిన ఒక్క మాట కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేక పోయిందని అన్నారు. రైతులకు తక్షణమే రైతు రుణ మాఫీ, పంట నష్ట పరిహారం, వరి పంటకు బోనస్ అందించాలని డిమాండ్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కళకళలాడిన చెరువులు, కుంటలు, కాలువలు నేడు వెల వెల బోతున్నాయని అన్నారు. రైతులు ఎవరు ఎవరు అధైర్య పడి ఆత్మహత్యలు చేసుకోవద్దని బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు.
Prakash
పలు పార్లమెంట్ నియోజకవర్గాలకు అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా పార్లమెంట్ ఎన్నికల సమన్వయకర్తలను భారత రాష్ట్ర సమితి నియమించింది. మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ అసెంబ్లీల సమన్వయకర్తలుగా మేడ్చల్ నుంచి ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు, మల్కాజిగిరి నుంచి మాజీ చైర్మన్ నందికంటి శ్రీధర్, కుత్బుల్లాపూర్ నుంచి పార్టీ సీనియర్ నాయకులు గొట్టిముక్కుల వెంగళరావు, కూకట్ పల్లి నుంచి మాజీ ఎమ్మెల్యే బేతి రెడ్డి సుభాష్ రెడ్డి, ఉప్పల్ నుంచి పార్టీ రాష్ట్ర సెక్రెటరీ జహంగీర్ పాష, సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి మాజీ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి, ఎల్బీనగర్ నుంచి ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్త లను నియమించారు.
అదేవిధంగా చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ అసెంబ్లీల సమన్వయకర్తలుగా మహేశ్వరం నుంచి శాసనమండలి మాజీ చైర్మన్ కనకమామిడి స్వామి గౌడ్, రాజేంద్రనగర్ నుంచి పార్టీ సీనియర్ నాయకులు పుట్టం పురుషోత్తం రావు, శేరిలింగంపల్లి నుంచి ఎమ్మెల్సీ కె నవీన్ కుమార్, చేవెళ్ల నుంచి పార్టీ సెక్రటరీ నాగేందర్ గౌడ్, పరిగి నుంచి పార్టీ సీనియర్ నాయకులు గట్టు రామచంద్రరావు, వికారాబాద్ నుంచి సీనియర్ నాయకులు పట్లోళ్ల కార్తీక్ రెడ్డి, తాండూర్ నుంచి జడ్పీ వైస్ చైర్మన్ బైండ్ల విజయ్ కుమార్ నియమితులయ్యారు.
మానవాళిపై పగబట్టిన వైరస్లు.. కరోనా కంటే వేగంగా విస్తరిస్తున్న బర్డ్ ఫ్లూ..
బర్డ్ ఫ్లూ (Bird Flu) :
కోవిడ్ కంటే బర్డ్ ఫ్లూ (Bird Flu) చాలా ప్రమాదకరమని ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ హాస్పిటల్‌లోని కమ్యూనిటీ మెడిసిన్ విభాగం ప్రొఫెసర్ హెచ్ఓడి డాక్టర్ జుగల్ కిషోర్ చెప్పారు. దీని కారణంగా మరణాల రేటు కోవిడ్ కంటే చాలా రెట్లు ఎక్కువ. అయితే బర్డ్ ఫ్లూ మానవ సంక్రమణ తక్కువగా ఉంటుంది. అంటే ఈ వైరస్ పక్షి నుంచి మనిషికి వ్యాపించినప్పటికీ.. ఇది ఒకరి నుంచి మరొకరికి సులభంగా వ్యాపించదు. అయితే కోవిడ్ చాలా త్వరగా సోకుతుంది.
పిట్స్ బర్గ్‌లో బర్డ్ ఫ్లూ(Bird Flu)పై పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలు..
ప్రపంచవ్యాప్తంగా వివిధ రకాల వ్యాధులపై పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా బర్డ్ ఫ్లూ(Bird Flu)పై కూడా ఓ పరిశోధన జరిగింది. పిట్స్ బర్గ్‌లో బర్డ్ ఫ్లూపై పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలు ఈ వ్యాధిని పెద్ద ముప్పుగా అభివర్ణించారు. రాబోయే కాలంలో ఈ వ్యాధి భారీ సంఖ్యలో ప్రజలకు సోకే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. బర్డ్ ఫ్లూ వైరస్ హెచ్5ఎన్1 చాలా వేగంగా విస్తరిస్తున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.
బర్డ్ ఫ్లూ అంటే ఏమిటి ?
రాజస్థాన్ వెటర్నరీ అండ్ యానిమల్ సైన్సెస్ యూనివర్శిటీకి చెందిన డాక్టర్ ఎన్ఆర్ రావత్ హెచ్5ఎన్1 ఇన్ఫ్లుఎంజా వైరస్ వల్ల బర్డ్ ఫ్లూ వస్తుందని వివరించారు. ఈ వైరస్ పక్షుల మధ్య వ్యాపిస్తుంది. వాటి శ్వాసనాళాలపై దాడి చేస్తుంది. ఈ కారణంగా పక్షులు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడతాయి. సరైన సమయంలో చికిత్సను అందించకపోతే అవి చనిపోతాయి. ఈ వైరస్ పక్షుల మలం, లాలాజలం ద్వారా ఒకదానికొకటి వ్యాపిస్తుంది. దీని ఇన్ఫెక్షన్ రేటు చాలా ఎక్కువగా ఉంది. కొద్ది రోజుల్లోనే ఈ వైరస్ లక్షలాది పక్షులకు సోకుతుంది. వాటి మరణానికి కారణమవుతుంది.
బర్డ్ ఫ్లూ మనుషులకు ఎలా వ్యాపిస్తుంది ?
బర్డ్ ఫ్లూ సోకిన పక్షుల నుంచి మనుషులకు వ్యాపిస్తుందని డాక్టర్ రావత్ వివరించారు. పక్షుల చుట్టూ నివసించే, పౌల్ట్రీ ఫామ్‌లలో పనిచేసే వ్యక్తులు ఈ వ్యాధి బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. బర్డ్ ఫ్లూ పక్షి మలం పడిన ప్రాంతాల్లో తిరిగే మానవులకు వ్యాపిస్తుంది. దీని వల్ల దగ్గు, జలుబు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. కొన్ని సందర్భాల్లో ఇది న్యుమోనియాకు కూడా కారణం అవుతుంది. సకాలంలో చికిత్స చేయకపోతే, మరణం సంభవించవచ్చు.
ఇది కోవిడ్ కంటే ప్రమాదకరమా ?
కోవిడ్ కంటే బర్డ్ ఫ్లూ చాలా ప్రమాదకరమని ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ హాస్పిటల్‌లోని కమ్యూనిటీ మెడిసిన్ విభాగం ప్రొఫెసర్ హెచ్ఓడి డాక్టర్ జుగల్ కిషోర్ చెప్పారు. దీని కారణంగా మరణాల రేటు కోవిడ్ కంటే చాలా రెట్లు ఎక్కువ. అయితే బర్డ్ ఫ్లూ మానవ సంక్రమణ తక్కువగా ఉంటుంది. అంటే ఈ వైరస్ పక్షి నుంచి మనిషికి వ్యాపించినప్పటికీ.. ఇది ఒకరి నుంచి మరొకరికి సులభంగా వ్యాపించదు. అయితే కోవిడ్ చాలా త్వరగా సోకుతుంది.
ఒక వ్యక్తికి బర్డ్ ఫ్లూ సోకినా అది మరొకరికి వ్యాపించే అవకాశాలు తక్కువ..
అటువంటి పరిస్థితిలో, కోవిడ్ కంటే బర్డ్ ఫ్లూ పెద్ద అంటువ్యాధిగా మారే ప్రమాదం తక్కువ. డాక్టర్ కిషోర్ మాట్లాడుతూ భారతదేశంలో బర్డ్ ఫ్లూ కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. ప్రతిసారీ ఈ వ్యాధి అదుపులోకి వస్తుంది. అటువంటి పరిస్థితిలో భయపడాల్సిన అవసరం లేదు. బర్డ్ ఫ్లూ చరిత్రలో మానవులలో దాని సంక్రమణ కేసులు చాలా తక్కువ. అటువంటి పరిస్థితిలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ ప్రజలు ఈ వ్యాధి లక్షణాల గురించి తెలుసుకోవడం, దానిని నివారించడం చాలా ముఖ్యం.
మానవుల్లో కనిపించే లక్షణాలు :-
తలనొప్పి
రివర్స్ కండరాల నొప్పి
జ్వరం
శ్వాసకోస ఇబ్బంది
బర్డ్ ఫ్లూకి ఏదైనా నివారణ ఉందా?
బర్డ్ ఫ్లూకు తగిన మందు లేదని, కేవలం లక్షణాల ఆధారంగానే రోగికి చికిత్స అందిస్తున్నామని డాక్టర్ కిషోర్ చెప్పారు. అయితే బర్డ్ ఫ్లూ నివారణ సులభంగా చేయవచ్చు. దీని కోసం బర్ద్ ఫ్లూ సోకిన పక్షితో సంబంధం లేకుండా ఉండటం ముఖ్యం. పక్షి దగ్గరికి వెళ్లినా అతను PPE కిట్ ధరించాలి. చికెన్ తింటుంటే బాగా ఉడికించాలి. క్రమం తప్పకుండా చేతులు కడుక్కోండి. ఫ్లూ లక్షణాలు కనిపిస్తే చికిత్స పొందండి.
ఇది చదవండి : ప్రకాశం జిల్లా గిద్దలూరు లో వైసీపీ కి కోలుకోలేని దెబ్బ..
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి
ఐఎండి (IMD) :
ఐఎండి (IMD) సూచనల ప్రకారం నేడు 179 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 209 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని, రేపు 44 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 193 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.
ఈ రోజు తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు(179) :-
ఐఎండి (IMD) సూచనల ప్రకారం శ్రీకాకుళం 26 , విజయనగరం 25, పార్వతీపురం మన్యం15, అల్లూరి సీతారామరాజు 9, విశాఖపట్నం 3, అనకాపల్లి 16, కాకినాడ 13, కోనసీమ 7, తూర్పుగోదావరి 16, ఏలూరు 4, కృష్ణా 4, ఎన్టీఆర్ 6, గుంటూరు 14, పల్నాడు 17, బాపట్ల 1, ప్రకాశం 2, తిరుపతి ఒక మండలంలో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు. రాబోవు నాలుగు రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు తెలిపారు.
కొన్ని ప్రాంతాల్లో 45°C-46°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం..
ఈ రోజు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, ఎన్టీఆర్, పల్నాడు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 45°C-46°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, SPSR నెల్లూరు, నంద్యాల, వైయస్సార్, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 43°C-44°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. కోనసీమ, పశ్చిమ గోదావరి, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి, చిత్తూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 41°C-42°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
ఏప్రిల్ 7 ఆదివారం :-
విజయనగరం, పార్వతీపురం మన్యం, పల్నాడు, నంద్యాల, వైయస్సార్ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 43°C-44°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్, బాపట్ల, ప్రకాశం, SPSR నెల్లూరు, కర్నూలు, అన్నమయ్య జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 42°C-43°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, అనంతపురం, శ్రీ సత్యసాయి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 40°C-41°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
ఏప్రిల్ 8 సోమవారం :-
విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్సార్ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 40°C-42°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, SPSR నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 37°C-40°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
ఏప్రిల్ 9 మంగళవారం :-
విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 41°C-43°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. శ్రీకాకుళం, కాకినాడ, తూర్పుగోదావరి, కర్నూలు, నంద్యాల, అనంతపురం వైయస్సార్ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 39°C-40°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. విశాఖపట్నం, అనకాపల్లి, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, SPSR నెల్లూరు, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 35°C-39°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించారు.
శుక్రవారం ఈ జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం…
శుక్రవారం అనకాపల్లి జిల్లా దేవరపల్లి, వైయస్సార్ జిల్లా పోరుమామిళ్లలో 44.5°C, నంద్యాల జిల్లా బనగానపల్లెలో 44.4°C, శ్రీకాకుళం జిల్లా జి. సిగడాంలో 44.2°C, అనంతపురం జిల్లా పాత కొత్త చెరువు, బాపట్ల జిల్లా జనకవరం పంగులూరు, ప్రకాశం జిల్లా గుండ్లపల్లె, విశాఖ జిల్లా పద్మనాభంలో 44°C అధిక ఉష్ణోగ్రతలు, 18 జిల్లాల్లో 43°Cకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు. అలాగే 94 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 159 మండలాల్లో వడగాల్పులు వీచాయన్నారు.
ఇది చదవండి : పాము కాటుకు గురైన విద్యార్థిని పరామర్శించిన ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ..
ప్రజలు వీలైనంతవరకు ఇంట్లోనే ఉండాలని, వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలి. డీహైడ్రేట్ కాకుండా ఉండటానికి ORS (ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్), ఇంట్లో తయారు చేసిన పానీయాలైన లస్సీ, నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు మొదలైనవి త్రాగాలని విపత్తుల సంస్థ ఎండి కూర్మనాథ్ సూచించారు.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి
బెంజ్ సర్కిల్ సిగ్నల్ వద్ద ఇద్దరు వ్యక్తులు యువకుడి పై దాడికి పాల్పడ్డారు. వన్ టౌన్ కు చెందిన సాయి కుమార్ బెంజ్ సర్కిల్ వైపు వస్తున్నాడు. కృష్ణలంకకు చెందిన ఆడపాల నాగేంద్ర, కంకిపాడుకు చెందిన దేవరపల్లి విజయకుమార్ లు ఒకే బైక్ పై వెళ్తూ బెంజ్ సర్కిల్ సిగ్నల్ సమీపంలో రోడ్డుపై గొడవ పడుతున్నారు. ఈ సమయంలో సాయి వచ్చి వారిని బైక్ పక్కకు తీయమనడం.. వారు పక్కన నుంచి వెళ్లు అనడంతో వారి మధ్య వాగ్వివాదం మొదలైంది. వాగ్వాదం పెరగడంతో సాయి పై నాగేంద్ర, విజయకుమార్ కలిసి దాడి చేసారు. ఇద్దరు యువకులు దాడి చేస్తున్న పోలీసులు అటు వైపు కన్నెతైనా చూడలేదు. స్థానికులు జోక్యం చేసుకొని ట్రాఫిక్ పోలీసులను వివాదం ఆపండి అని చెప్పడంతో పోలీసులు అప్పుడు స్పందించారు. మాచవరం పోలీసులకు ట్రాఫిక్ పోలీసులు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వెంటనే దాడికి పాల్పడిన వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పాము కాటుకు గురైన విద్యార్థిని పరామర్శించిన ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ..
ద్రావిడ విశ్వవిద్యాలయంలో చదువుతున్న విద్యార్థి బాబు పాముకాటుకు గురికాగా చికిత్స పొందుతున్న బాబును శుక్రవారం టిడిపి కుప్పం నియోజకవర్గ సమన్వయ కమిటీ చైర్మన్ ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైసిపి ప్రభుత్వం వచ్చాక అన్ని వ్యవస్థలను నాశనం చేశారని, అందుకు ఉదాహరణ ద్రావిడ విశ్వవిద్యాలయం అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో ద్రావిడ విశ్వవిద్యాలయంలో వేల పది మంది విద్యార్థులతో కళకళలాడిందన్నారు.
ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితులు కూడా ఈ ప్రభుత్వం లేదన్నారు. వర్సిటీ హాస్టల్ భవనంలోకి పాము వచ్చి విద్యార్థిని కరిచిన అక్కడ సిబ్బంది పట్టించుకోకపోవడంతో తోటి విద్యార్థులు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారన్నారు. విద్యార్థి ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడినట్లు తెలిపారు. ప్రకాశం జిల్లా దర్శికి చెందిన బాబు అనే విద్యార్థికి ఏదైనా జరగరానిది జరిగి ఉంటే ఎవరు బాధ్యత తీసుకునే వారిని ప్రశ్నించారు. పాము కరిచినట్టు బయటకు చెబితే మార్కులు కట్ చేస్తామంటూ వార్డెన్ బెదిరిస్తున్నట్లు విద్యార్థి తెలిపారన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం రాగానే వర్సిటీ కి పూర్వ వైభవం తీసుకొస్తామని ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రకటించినట్లు తెలిపారు.
ప్రకాశం జిల్లా (Prakasam District) :
వైసీపీకి గుడ్ బై చెప్పిన కాపు సంఘం ముఖ్య నేతలు..
ప్రకాశం జిల్లా (Prakasam District) గిద్దలూరు వైసీపీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. నియోజకవర్గ కాపు సంఘం ముఖ్య నాయకులంతా మూకుమ్మడిగా అధికార వైసీపీకి గుడ్ బై చెబుతూ టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు. గిద్దలూరు పట్టణంలోని ఒంగోలు రోడ్డులో గంగాభవాని కాంప్లెక్స్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డి, మరియు ఒంగోలు పార్లమెంటు ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసుల రెడ్డి కుమారుడు రాఘవరెడ్డి గార్ల సమక్షంలో నియోజకవర్గ కాపు సంఘం కీలక నేత, కాపు సంఘం మాజీ అధ్యక్షులు యల్లా శ్రీనివాసులు, మరియు కాపు సంఘం ప్రధాన కార్యదర్శి పసుపులేటి శ్రీనివాసులు గార్ల ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని కాపు సంఘం ముఖ్య నాయకులు, 400 కాపు కుటుంబాలతో సహా అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు.. వైసిపిని వీడిన వారందరికీ టీడీపీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ చేరికలతో గిద్దలూరు నియోజకవర్గంలో టీడీపీ జనసేన బీజేపీల కూటమి బలం మరింత పెరిగిందని రాబోయే ఎన్నికల్లో గిద్దలూరు అసెంబ్లీ, ఒంగోలు పార్లమెంట్ స్థానాల్లో అత్యధిక మెజార్టీ తథ్యమన్నారు.
మాగుంట, ముత్తుముల సమక్షంలో టీడీపీలో భారీగా చేరిన కాపు నాయకులు..
ఈ కార్యక్రమంలో వైసిపిని వీడి టీడీపీలో చేరిన కాపు నాయకులు రాస బాలుడు, సూరె కొండయ్య, C.I కొండయ్య, గోనుగుండ్ల బాల నరసయ్య, యల్లా శివ ప్రసాద్, యల్లా కోటయ్య, యల్లా క్రిష్ణ, యల్లా సుబ్బారాయుడు, యల్లా శివరంగస్వామి, యగటిల రంగస్వామి, యగటిల రంగ నాయకులు, B నెమలి గుండం, ముద్దర్ల వెంకటేశ్వర్లు, తంబూరి నాగయ్య, పోరుమామిళ్ల వెంకట సుబ్బయ్య, జొన్నలగడ్డ వెంకట రమణ, షేక్ రఫీ, షేక్ నూరుల్ల, వంగిటి నవీన్, మాలపాటి సత్యం, D రమణ, V.తిరుపతయ్య, V. మల్లి, S.ఖాదర్ వలి, బెట్టి శ్రీను, అనురాజుల చంటి, లింగయ్య, పార్శ రంగస్వామి, పార్శ రామ లింగస్వామి, మోడీగిరి యర్రన్న, తదితరులు పాల్గోన్నారు.
ఇది చదవండి : ఆర్బీఐ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష సమావేశం..
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి
జగిత్యాల కొత్త బస్టాండ్ లో ఈ రోజు మధ్యాహ్నం ఓ మహిళ వద్ద బ్యాగ్ లో ఉన్న 15 తులాల బంగారు నగలు అపహరణకు గురైన ఘటన చోటుచేసుకుంది. మెట్ పల్లి పట్టణంలో వెల్లుల్ల రోడ్ కి చెందిన కి చెందిన సురిగి మంగరాణి తన కూతురుతో బీర్పూర్ మం. లో జరిగిన ఒక శుభకార్యానికి హాజరై తిరుగు ప్రయాణంలో జగిత్యాల కొత్త బస్టాండ్ లో మెట్ పల్లి బస్సు కోసం నిరీక్షిస్తుంది. ఈ క్రమంలో నగలు అపహరణకు గురైనట్లు గుర్తించిన బాధితురాలు వెంటనే జగిత్యాల టౌన్ పోలీసులకు సమాచారం అందించింది. విషయం తెలుసుకున్న జగిత్యాల టౌన్ సిఐ వేణుగోపాల్, ఎస్ ఐ నరేష్ లు జగిత్యాల కొత్త బస్టాండ్ కు చేరుకుని బస్ స్టాండ్ లోని కంట్రోల్ రూమ్ లోని సీసీ టివి ఫుటేజ్ లను పరిశీలించారు. అనంతరం బాధితురాలి నుండి ఫిర్యాదు స్వీకరించి జగిత్యాల టౌన్ సి ఐ వేణుగోపాల్ దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా మరోసారి కీలక వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగించింది. రెపోరేటును 6.5 శాతం వద్ద స్థిరంగా ఉంచుతున్నట్లు ప్రకటించింది. వరుసగా ఏడోసారి ఎలాంటి మార్పు లేకపోవడం గమనార్హం. బుధవారం ప్రారంభమైన ఆర్బీఐ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష సమావేశ నిర్ణయాలను గవర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం వెల్లడించారు. భారత ఆర్థిక వ్యవస్థ పరిణామ క్రమానికి రిజర్వ్ బ్యాంక్ ప్రయాణానికి దగ్గరి సంబంధం ఉందని దాస్ అన్నారు. సంస్థపై ఉన్న బహుళ బాధ్యతలను నిర్వర్తిస్తూనే కొత్త అంశాలను స్వీకరిస్తామన్నారు. నూతన ఆవిష్కరణల కోసం ప్రయత్నిస్తామని తెలిపారు. ఆర్బీఐ ఇటీవలే 90వ వార్షికోత్సవం నిర్వహించుకున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో శుక్రవారం నాటికి సామాజిక భద్రతా ఫించన్ల పంపిణీ ప్రక్రియ 94 శాతం పూర్తయిందని అనగా 1847 కోట్ల 52 లక్షల రూ.లను ఫించన్ దారులకు పంపిణీ చేయడం జరిగిందని రాష్ట్ర పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశి భూషణ్ కుమార్ తెలియ జేశారు. రాష్ట్రంలో 65.69 లక్షల మంది ఫించను దారులకు ఫించన్లు అందించేందుకు 1951 కోట్ల 69 లక్షల రూ.లను విడుదల చేయగా ఈనెల 3వ తేదీ నుండి 6వ తేదీ వరకు గ్రామ,వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా ఫించన్లు పంపిణీ ప్రక్రియ ప్రారంభమైందని తెలిపారు.
శుక్రవారం సాయంత్రానికి 94 శాతం మంది ఫించన్ దారులకు 1847 కోట్ల 52 లక్షల రూ.లను పించన్లుగా అందించడం జరిగిందని శశి భూషణ్ కుమార్ పేర్కొన్నారు. మిగతా ఫించన్ దారులకు వారి ఇళ్ళ వద్దకే వెళ్ళి పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసినట్టు ముఖ్య కార్యదర్శి శశి భూషణ్ కుమార్ తెలిపారు. శనివారం ఉదయం 7 గంటల నుండే ఫించన్లు పంపిణీ చేపట్టి నూరు శాతం ఫించన్లు పంపిణీ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసినట్టు ముఖ్య కార్యదర్శి శశి భూషణ్ కుమార్ తెలియజేశారు.