294
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు భారీ షాక్ తగిలింది. మైసూరు నగరాభివృద్ధి సంస్థ స్థలాల కేటాయింపుల కుంభకోణంలో సిద్ధరామయ్యను విచారించేందుకు రాష్ట్ర గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ఆదేశాలు జారీ చేశారు. ప్రదీప్ కుమార్, అబ్రహాం, స్నేహమయి కృష్ణ అనే ముగ్గురు యాక్టివిస్టులు దాఖలు చేసిన పిటిషన్ల నేపథ్యంలో సీఎంను ప్రాసిక్యూట్ చేయాలని గవర్నర్ ఆదేశించారు. గవర్నర్ ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై అవినీతి నిరోధక చట్టం 1988, భారతీయ నాగరిక సురక్ష సంహిత 2023 కింద ఆయనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణకు ఆదేశిస్తున్నట్టు గవర్నర్ సెక్రటేరియట్ లేఖను విడుదల చేసింది.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఎడ్యుకేషన్ కిట్ల పంపిణీ.హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థులతో డ్రగ్స్ వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించారు. పాఠశాలలు, కళాశాలలను మాదకద్రవ్య రహిత విద్యా కేంద్రాలుగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి,…
- కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.మాజీ మంత్రి కొడాలి నానిపై నమోదైన కేసు విచారణకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 2021లో పంచాయతీ ఎన్నికల సమయంలో నమోదైన కేసులో ప్రాసిక్యూషన్‌కు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. 2021 ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో…
- హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. కొండచరియ విరిగిపడటంతో ధల్లి… సంజౌలి బైపాస్‌ను పూర్తిగా మూసివేశారు. దీంతో ఇరువైపులా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కొండచరియ విరిగిపడటంతో భారీగా శిథిలాలు రహదారిపైకి వచ్చిపడ్డాయి. శిథిలాలు అడ్డంకి ఉండటంతో వాహనాల రాకపోకలకు…
- అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.అమెరికాలోని న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ వద్ద కాల్పులు కలకం సృష్టించాయి. కాల్పులకు తెగబడటమే కాకుండా ఓ వ్యక్తిపై కత్తితో దాడి చేశాడు. నిత్యం రద్దీగా ఉండే మాన్‌హాటన్ పర్యాటక ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాల్పుల శబ్దం వినిపించడంతో పర్యాటకులు, స్థానికులు…
- అనకాపల్లి జిల్లాలో యలమంచిలిలో ప్రమాదం.ఏపీలో మరో బస్సు ప్రమాదం జరిగింది. అయితే వెంటనే అప్రమత్తం కావడంతో ప్రయాణికులంతా సురక్షితంగా బయట పడ్డారు. అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మండలం రేగుపాలెం జాతీయ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. భువనేశ్వర్ నుంచి చెన్నై…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి






Total views : 150272