జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో మేయర్,డిప్యూటీ మేయర్‌పై అవిశ్వాసం పెట్టేందుకు బీఆర్‌ఎస్ సిద్దమవుతుండగా… ఎంఐఎం సపోర్టు ఎవరికన్న దానిపై సస్పెన్స్ నెలకొంది. మధ్యలో బీజేపీ స్టాండ్ ఏంటి..? అన్న దానిపైనా తెగ చర్చ నడుస్తోంది. మేయర్, డిప్యూటీ మేయర్ బీఆర్ఎస్‌కు బై చెప్పి… హస్తం పార్టీకి నేస్తం కావడంతో ఇవాళ్టి మీటింగ్‌పై ఆసక్తి నెలకొంది. వారిద్దరిపై అవిశ్వాసం పెట్టేందుకు బీఆర్‌ఎస్ సిద్ధమైంది. కారు పార్టీ గుర్తుతో గెలిచి కాంగ్రెస్‌లోకి ఎలా వెళ్తారంటూ,మేయర్, డిప్యూటీ మేయర్ రాజీనామాకు బీఆర్ఎస్ డిమాండ్ అయ్యింది. అయితే మొన్నటివరకు బీఆర్ఎస్‌తో ఫ్రెండ్‌షిప్ చేసిన ఎంఐఎం పార్టీ , బీఆర్‌ఎస్ అవిశ్వాసానికి మద్ధతు ఇస్తుందా…? లేక కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతుందా…? అన్నది సస్పెన్స్‌గా మారింది. అయితే ఎంఐఎం ఎవరికి మద్దతిస్తే , వారికే బల్దియా పీఠం దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
బీఆర్‌ఎస్‌లో ప్రస్తుతం 47 మంది కొర్పొరేటర్లు ఉండగా.. ఎంఐఎంకి 41. బీజేపీకి 39, ఇటు కాంగ్రెస్‌కు 19 మంది కౌన్సిలర్లు ఉన్నారు. 2020లో కాంగ్రెస్‌కు ఇద్దరు కార్పొరేటర్లు మాత్రమే ఉండగా , అధికారంలోకి రావడంతో వారి సంఖ్య 19కి చేరింది. అయితే కౌన్సిల్‌లో బీఆర్‌ఎస్ బలంగా ఉన్నప్పటికీ , ఏదో ఒకపార్టీ మద్దతు ఉంటేనే అవిశ్వాసం నెగ్గే అవకాశం ఉంది. మరోవైపు ఇప్పుడున్న బీఆర్ఎస్ కార్పొరేటర్లలో ఎంతమంది మీటింగ్ వస్తారన్నది క్లారిటీ లేదు. మరోవైపు బీజేపీ స్టాండ్‌పైనా తెగ చర్చ నడుస్తోంది. కౌన్సిల్ మీటింగ్‌లో వారు ఏం మాట్లాడతారు…? వారి వ్యూహమేంటన్నది…? ఉత్కంఠగా మారింది.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- ఇరాన్‌పై అదనపు దాడుల నేపథ్యంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు.ఇరాన్‌పై అదనపు దాడులు ముమ్మరమైన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము ఇప్పటికే సైనికంగా విజయం సాధించామని, ప్రస్తుతం ఇరాన్ వద్ద చాలా తక్కువ వనరులు మాత్రమే మిగిలి ఉన్నాయని ఆయన ప్రకటించారు. అమెరికా చర్యలతో…
- అణు విద్యుత్ కేంద్రం సమీపంలో అమెరికా దాడులు.తమ దేశంలోని బుషెహర్ అణు విద్యుత్ కేంద్రం సమీపంలో అమెరికా వైమానిక దాడులు చేసినట్లు ఇరాన్ ఆరోపించింది. అయితే, ఏదైనా నష్టం వాటిల్లిందా? అన్న విషయంపై స్పష్టత లేదు. ఇరాన్ ఆరోపణలపై అమెరికా సైన్యం కూడా స్పందించలేదు. ఇరాన్‌లో ప్రస్తుతం పనిచేస్తున్న…
- గగన్‌యాన్ మిషన్‌లో కీలక మైలురాయి సాధించిన ఇస్రో.భారత తొలి మానవ అంతరిక్ష యాత్ర గగన్‌యాన్ మిషన్‌లో ఇస్రో మరో కీలక విజయాన్ని నమోదు చేసింది. గగన్‌యాన్ కోసం రూపొందించిన ప్రధాన పారాచూట్ వ్యవస్థను విజయవంతంగా పరీక్షించింది. మధ్యప్రదేశ్‌లో ఐఎల్-76 విమానం ద్వారా 2.5 కిలోమీటర్ల ఎత్తు నుంచి నిర్వహించిన…
- HPCL గ్యాస్ ప్లాంట్‌లోకి వరద నీరు.మహారాష్ట్రలో భారీ వర్షాలు తీవ్ర బీభత్సం సృష్టిస్తున్నాయి. రాయగఢ్ జిల్లా చవానే గ్రామంలో కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వరద నీరు స్థానిక HPCL గ్యాస్ ప్లాంట్‌లోకి చేరడంతో రీఫిల్లింగ్ కోసం నిల్వ ఉంచిన వందలాది ఖాళీ గ్యాస్…
- సాయికృష్ణ కేసులో కీలక పరిణామం.సాయికృష్ణ కేసులో సీఐ నాగరాజు కస్టడీకి సంబంధించి ఏపీ హైకోర్టు జారీ చేసిన ఆదేశాలను సిట్ సుప్రీంకోర్టులో సవాలు చేసింది. ఈ మేరకు హైకోర్టు విధించిన నిబంధనలను సడలించాలని సిట్ కోరింది. హైకోర్టు ఆదేశాల ప్రకారం, సీఐ నాగరాజును ఒక రోజు…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Total views : 196699