బీఆర్ఎస్ నేతల ఫామ్ హౌస్ డ్రైనేజీ నీటిని పేదలకు వేళ్లే తాగునీటిలో కలుపుతారా అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతల తాపత్రయమంతా ఫామ్‌హౌస్‌లు కాపాడుకోవడానికేనని అన్నారు. మూసీ పునరుజ్జీవం వేరు.. హైడ్రా వేరని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.తెలంగాణ ఆర్థిక మూలాలు దెబ్బతీయాలని కొంతమంది చూస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. తమ ప్రభుత్వం అలాంటివారి భరతం పడుతుందని హెచ్చరించారు. హైడ్రా అనగానే కేటీఆర్, హరీశ్‌రావు, ఈటల రాజేందర్ బయటకు వచ్చారని.. పేదలు ఎవరైనా ఫామ్‌హౌస్‌లు కట్టుకోగలరా అని ప్రశ్నించారు. గాంధీ కుటుంబంతో కేసీఆర్ కుటుంబానికి ఏమైనా పోలిక ఉందా? అని నిలదీశారు. ప్రధాన మంత్రి పదవినే త్యాగం చేసిన చరిత్ర సోనియా గాంధీది అని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు.
కేసీఆర్ కుటుంబానిది దోపిడీ చరిత్ర అని ఆరోపించారు. ఆక్రమణదారులే హైడ్రాను చూసి భయపడుతున్నారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. మూసీ మురికిలో ఉన్న పేదలను ఆదుకోవడానికి తాము ప్రయత్నిస్తున్నామని చెప్పారు. బుల్డోజర్లను కూడా సిద్ధం చేశా.. ఎవరు అడ్డం వస్తారో రావాలని హెచ్చరించారు. వాళ్ల ఫామ్ హౌస్‌లపైకి బుల్డోజర్లు వస్తాయనే భయంతో మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, బీఆర్ఎస్ నేతలు నాటకాలు ఆడుతున్నారని సీఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. తన ఇంటి ముందుకొచ్చి చేతులు కట్టుకున్న రోజులను హరీశ్‌రావు మర్చిపోయారా అని ప్రశ్నించారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- పీఎఫ్ క్లెయిమ్‌లు ఇక మరింత సులభతరం.దేశంలోని కోట్ల మంది పీఎఫ్ ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పీఎఫ్ విత్‌డ్రా ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ EPFOలో విప్లవాత్మక మార్పులను ప్రవేశపెట్టింది. ఇకపై ఎలాంటి ఆలస్యం లేకుండా రూ.5 లక్షల…
- అమరావతి నిర్మాణ పనులపై మంత్రి నారాయణ సమీక్ష.అమరావతి నిర్మాణ పనుల పురోగతిపై మంత్రి నారాయణ కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ భవనాలు, రోడ్లు, ఎల్పీఎస్ లేఅవుట్లు తదితర ప్రాజెక్టుల పనులు ఎంతవరకు పూర్తయ్యాయో సంస్థల ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ప్రాజెక్టు…
- ఇంగ్లండ్ దెబ్బకు కుప్పకూలిన టీమ్ ఇండియా.ఇంగ్లండ్ చేతిలో ఇది ఘోర పరాజయం. ఓటమి ఒక్కటే కాదు, ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ భారత జట్టు తరఫున పరుగుల తేడాతో జరిగిన అతిపెద్ద ఓటమికి నాయకత్వం వహించిన కెప్టెన్‌గా ఒక అనవసర రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. డగౌట్‌లో…
- విద్యార్థులతో కలిసి ఫుట్‌బాల్ మ్యాచ్ వీక్షించిన సీఎం రేవంత్ రెడ్డి.ఫిఫా వరల్డ్ కప్-2026లో భాగంగా అర్జెంటినా, ఈజిప్ట్ జట్ల మధ్య జరిగిన ఉత్కంఠభరిత పోరును తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థులతో కలిసి వీక్షించారు.హైదరాబాద్ శిల్పకళా వేదికలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన భారీ ఎల్ఈడీ స్క్రీన్‌పై సంక్షేమ పాఠశాలల విద్యార్థులతో కలిసి…
- హర్యానాలోని గురుగ్రామ్‌లో కుండపోత వర్షాలు.రుతుపవనాల ప్రభావంతో హర్యానాలోని గురుగ్రామ్‌లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా నగరంలోని పలు ప్రాంతాలు నీటమునిగిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.వర్షాల ప్రభావంతో ఢిల్లీ-జైపూర్ జాతీయ రహదారి ఎన్‌హెచ్-48పై నర్సింగ్‌పూర్ ప్రాంతంలో రహదారి ఒక్కసారిగా కుంగిపోవడంతో భారీ గుంత…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Total views : 194053