ఏపీలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం రాజధాని అమరావతి పునర్నిర్మాణంపై దృష్టిపెట్టింది. సీఎం చంద్రబాబు అమరావతి అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించడం, ఎన్డీయే ప్రభుత్వం తాజా బడ్జెట్‌లో అమరావతి అభివృద్ధికి తోడ్పాటునందిస్తామని ప్రకటించిన నేపథ్యంలో లాండ్ పూలింగ్ మళ్లీ ప్రారంభమైంది. భూములు ఇచ్చేందుకు రైతులు ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు. రాజధాని అమరావతి పునర్నిర్మాణం పై సీఎం స్పెషల్ ఫోకస్. భూములిచ్చేందుకు ముందుకొస్తున్న రైతుల నుంచి తీసుకోవాలని డిప్యుటీ కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. గత ప్రభుత్వం లాండ్ పూలింగ్ ప్రక్రియను నిలిపివేసిన విషయం తెలిసిందే. భూసేకరణకు సంబంధించిన ప్రకటనను కూడా ఉపసంహరించుకుంది. ఇక రాష్ట్ర విభజన తరువాత తొలిసారిగా రాజధాని కోసం భూసేకరణ చేపట్టిన టీడీపీ ప్రభుత్వం అప్పట్లో 25,398 మంది రైతుల నుంచి 34,281 ఎకరాలను సమీకరించింది. మరో 4 వేల ఎకరాలను సేకరించాల్సి ఉండగా రైతులు తమ భూములిచ్చేందుకు నిరాకరించడంతో పూలింగ్ ప్రక్రియ నిలిచిపోయింది. మరోవైపు, రాజధానిలో కార్యకలాపాలు ఊపందుకోవడంతో ప్రభుత్వ సిబ్బంది కొరత తలెత్తింది. దీంతో, ఇతర శాఖల నుంచి అధికారులు, సిబ్బందిని డిప్యుటేషన్‌పై రాజధానికి తీసుకొచ్చేందుకు సీఆర్డీఏ కమిషనర్ ఓ ప్రకటనలో దరఖాస్తులను ఆహ్వానించారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- ఢిల్లీలో యూఎస్-ఇండియా న్యూక్లియర్ సదస్సులో మంత్రి లోకేష్.భవిష్యత్ న్యూక్లియర్ ఆర్థిక వ్యవస్థలో ఆంధ్రప్రదేశ్‌ను నమ్మకమైన గ్లోబల్ భాగస్వామిగా తీర్చిదిద్దడమే లక్ష్యమని రాష్ట్ర మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. న్యూక్లియర్ ఎనర్జీ ఇన్‌స్టిట్యూట్, యూఎస్-ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్‌షిప్ ఫోరం సంయుక్తంగా ఢిల్లీలో నిర్వహించిన ‘యూఎస్ ఎగ్జిక్యూటివ్ న్యూక్లియర్ మిషన్…
- రాయల్ ఎన్ ఫీల్డ్ భారీ ప్రాజెక్టుకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్..బుల్లెట్ వేగంతో రాష్ట్రంలో బుల్లెట్ మోటార్ సైకిల్ ప్రాజెక్టు ఏర్పాటు కావాలని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. తిరుపతి సమీపంలో ఏర్పాటు చేయనున్న రాయల్ ఎన్ ఫీల్డ్ ప్రాజెక్టును 18 నెలల్లో నిర్మాణం పూర్తి చేసి ఉత్పత్తి ప్రారంభించాలని.. దీనికి…
- మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..ఏలూరు కలెక్టరేట్ సాక్షిగా హైడ్రామా నడిచింది. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కాస్తా… అధికారులకు, వైకాపా నాయకులకు మధ్య తీవ్ర వాగ్వాదానికి వేదికగా మారింది. జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి కళ్లెదుటే వైకాపా నాయకులు, ఏలూరు మున్సిపల్ కమిషనర్ భాను ప్రతాప్…
- వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..వరంగల్‌లో అంతర్జాతీయ స్మగ్లర్ల తరహాలో సాగుతున్న వన్యప్రాణుల అక్రమ రవాణా గుట్టును డిరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు రట్టు చేశారు. గ్రే మార్కెట్‌లో అత్యంత ఖరీదైన, అంతరించిపోతున్న అరుదైన సజీవ పాములను విక్రయిస్తున్న ఒక ముఠా సభ్యుడిని సినీ ఫక్కీలో…
- పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..సరికొత్త ఆదర్శానికి వేదికైంది శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టరేట్. ఇంధన పొదుపు, పర్యావరణ పరిరక్షణ కేవలం మాటలకే పరిమితం కాదని స్వయంగా ఆచరించి చూపించారు జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్. సోమవారం కలెక్టరేట్‌లో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Total views : 80601