Wednesday, September 16, 2026
News Navigation
Wednesday, September 16, 2026
News Navigation

Breaking

Wednesday, September 16, 2026
Home Telangana GHMC అడ్డగోలు రూల్స్, ఇబ్బందులు పడుతున్న సామాన్యులు..!

GHMC అడ్డగోలు రూల్స్, ఇబ్బందులు పడుతున్న సామాన్యులు..!

by Rama
ghmc

దేవుడు వరమిచ్చినా.. పూజారి కరుణించలేదన్నది సామెత. ఇప్పుడు జీహెచ్‌ఎంసీ(GHMC) వ్యవహారం అచ్చం ఇలాగే కనిపిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో ట్యాక్స్ వసూళ్ల దందా సాగుతోంది. పన్ను వసూళ్ల పేరిట వినియోగదారులకు వేధింపులు కొనసాగుతున్నాయి. పన్ను పెనాల్టీల వసూళ్లలో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం పన్ను అపరాధ రుసుములో 10 శాతం మినహాయింపు ఇచ్చింది. అయితే, పన్ను కట్టేందుకు చాలామంది సిద్ధంగా ఉన్నా.. వాటిని తీసుకునే విషయంలో కొందరు అధికారులు, సిబ్బంది సవాలక్ష షరతులు(ghme rules) విధిస్తున్నారు.

ఒకే చెక్కు ఇవ్వాలంటూ వినియోగదారులను వేధింపులకు గురిచేస్తున్నారు. ఏఖాతాలో డబ్బు ఉంటే ఆ ఖాతా చెక్కు ఇస్తామంటే తీసుకునేందుకు ససేమిరా అంటున్నారు. పైగా.. ఇదేంటని ప్రశ్నిస్తే అన్నింటికీ కమిషనర్ రోనాల్డ్ రోస్ పేరు చెబుతున్నారు. తమ కమిషనర్ రోనాల్డ్ రోస్ చాలా స్ట్రిక్ట్ అంటూ కిందిస్థాయి ఉద్యోగులు సన్నాయినొక్కులు నొక్కుతున్నారు.

జీహెచ్ఎంసీ(GHMC) స్థలాల ఆక్రమణ ఎందుకు ఆగడం లేదు?

కమిషనర్ అంత స్ట్రిక్ట్ అయితే… జీహెచ్ఎంసీ(GHMC) స్థలాల ఆక్రమణ ఎందుకు ఆగడం లేదు? అని వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్ లో పెద్దమొత్తంలో ప్రభుత్వ స్థలాలు కబ్జాల పాలవుతున్నాయి. ఏ ఇంజనీరింగ్ పనిలో చూసినా అవినీతి కంపు స్పష్టంగా కనిపిస్తోంది. నిర్మించిన కొంత కాలానికే నాణ్యతా లోపాలు బట్టబయలవుతున్నాయి. కాల్వల పూడిక తీత పనుల్లోనూ అవినీతి కంపు కొడుతోంది.కోట్లలో పన్ను రావాల్సిన చోట నోరు మెదపని అధికారులు.. టాక్స్‌ చెల్లిస్తామంటున్న వాళ్లను మాత్రం వేధింపులకు గురిచేస్తున్నారు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.
హైదరాబాద్ ఉప్పల్ భగాయత్‌లో ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవన్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా …
కొండా సురేఖకు బుజ్జగింపులు.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి మీనాక్షి నటరాజన్, …
ఫసల్ బీమా యోజన అమలుపై పాయల్ శంకర్ నిరసన.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఫసల్ బీమా యోజన అమలుపై బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: