Sunday, June 14, 2026
News Navigation
Sunday, June 14, 2026
News Navigation

Breaking

Sunday, June 14, 2026
Home International ఉత్తర కొరియా, దక్షిణ కొరియాల మధ్య వివాదం..!

ఉత్తర కొరియా, దక్షిణ కొరియాల మధ్య వివాదం..!

by Satya
Conflict between North Korea and South Korea

ఉత్తర కొరియా తన నిఘా ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టిన వేళ ఉత్తర కొరియా, దక్షిణ కొరియాల మధ్య వివాదం ముదురుతున్నట్లు కనిపిస్తోంది. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు మరింత రాజుకున్నాయి! 2018 నాటి ఓ ఒప్పందం ప్రకారం సరిహద్దులో తొలగించిన గస్తీ కేంద్రాలను ఉత్తర కొరియా పునరుద్ధరిస్తున్నట్లు సియోల్‌ ఆరోపించింది. సైన్యంతోపాటు భారీఎత్తున ఆయుధాలనూ మోహరించినట్లు పేర్కొంది. సైనిక ఘర్షణలను తగ్గించేందుకుగానూ 2018 నాటి ఓ ఒప్పందం ప్రకారం ఇరు దేశాలు గతంలో తమ సరిహద్దుల్లో 11 చొప్పున ‘గార్డు పోస్ట్‌’లను తొలగించాయి. ఉత్తర కొరియా నిఘా ఉపగ్రహ ప్రయోగానికి ప్రతిగా 2018 నాటి ఈ ఒప్పందాన్ని పాక్షికంగా నిలిపేస్తున్నట్లు దక్షిణ కొరియా ఇటీవల ప్రకటించింది. దీన్ని కనీస రక్షణ చర్యగా పేర్కొంటూ తమ నిఘా విమానాలు తిరిగి సరిహద్దుల్లోని నోఫ్లై జోన్‌లో ఎగురుతాయని తెలిపింది. దీన్ని ఉత్తర కొరియా తప్పుబట్టింది. ఇకపై ఆ ఒప్పందానికి తామూ కట్టుబడి ఉండబోమని తెలిపింది. ఈ క్రమంలోనే సరిహద్దుల్లో గస్తీ కేంద్రాల పునరుద్ధరణ, కందకాల నిర్మాణం వంటి పనులను గుర్తించినట్లు ద.కొరియా సైన్యం మీడియాకు తెలిపింది. ఉత్తర కొరియా అక్కడ సైన్యాన్ని, భారీ ఆయుధాలను మోహరించినట్లు గుర్తించామని చెప్పింది. ఈ పరిణామాల నడుమ సరిహద్దుల్లో ఉత్తర కొరియా కార్యకలాపాలను నిశితంగా పరిశీలించాలని దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ తన సైన్యాన్ని ఆదేశించినట్లు అధ్యక్ష కార్యాలయం తెలిపింది. ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు దృఢమైన సంసిద్ధతను కొనసాగించాలని సూచించారు. ఇదిలా ఉండగా ఉత్తర కొరియా నిఘా ఉపగ్రహం ప్రయోగాన్ని దక్షిణ కొరియా, అమెరికా తదితర దేశాలు తీవ్రంగా ఖండించిన విషయం తెలిసిందే. దీన్ని శాంతిభద్రతలకు విఘాతం కలిగించే రెచ్చగొట్టే చర్యగా పేర్కొన్నాయి.

Advertisements

You may also like

Our Visitor

023320
Total views : 141756

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.