Wednesday, September 30, 2026
News Navigation
Wednesday, September 30, 2026
News Navigation

Breaking

Wednesday, September 30, 2026
Home Andhra Pradesh కేశినేని నాని…ఆంధ్రా విజయ్‌మాల్యా: విజయవాడ ఎంపీ చిన్ని.

కేశినేని నాని…ఆంధ్రా విజయ్‌మాల్యా: విజయవాడ ఎంపీ చిన్ని.

by CVR NEWS
కేశినేని నాని...ఆంధ్రా విజయ్‌మాల్యా: విజయవాడ ఎంపీ చిన్ని

కేశినాని నాని… ఆంధ్రా విజయమాల్య అంటూ విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని విమర్శించారు. మాజీ ఎంపీ కేశినేని నాని… నేషనలైజ్ బ్యాంకులో 120 కోట్ల రుణం తీసుకుని మోసం చేశాడని ఆరోపించారు. రైతులు రుణం తీసుకుని రెండో వాయిదా కట్టకుంటేనే ఇంటికి వస్తారని… మరి మాజీ ఎంపీ అప్పును ఎందుకు వసూళ్లు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. బ్యాంకులో తనఖా పెట్టిన ఆస్తిని మరోసారి కుదవ పెట్టి రతన్ టాటాకు చెందిన వెస్ట్ సైడ్ కంపెనీని మోసం చేశారని ఎద్దేవా చేశారు. రైతులు, కార్మికులు, డ్రైవర్లకు సమయం ఇవ్వని బ్యాంకులు… మాజీ ఎంపీని 11 ఏళ్లుగా ఎందుకు విడిచిపెడుతున్నారని నిలదీశారు. తన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని కేశినేని చిన్న సవాల్ విసిరారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: