Saturday, August 15, 2026
News Navigation
Saturday, August 15, 2026
News Navigation

Breaking

Saturday, August 15, 2026
Home Devotional ఖైరతాబాద్‌ మహాగణపతికి కర్రపూజ షురూ.

ఖైరతాబాద్‌ మహాగణపతికి కర్రపూజ షురూ.

by CVR NEWS

చూస్తున్నంతలోనే మళ్లీ వినాయక చవితి వచ్చేస్తోంది. గణేష్‌ మహరాజ్‌కీ జై అనే నినాదాలతో మార్మోగేందుకు భాగ్యనగరం సన్నద్ధమవుతోంది. ప్రధాన మంటపాల్లో కొలువుదీరేందుకు భారీ వినాయక విగ్రహాలు సిద్ధమవుతున్నాయి. భాగ్యనగర గణేష్ ఉత్సవాలకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన ఖైరతాబాద్‌ గణేషుడి రూపం కూడా ఖరారైంది. ఈ ఏడాది కొలువుదీరే 69 అడుగుల భారీ విగ్రహం నమూనా పోస్టర్‌ను ఉత్సవ కమిటీ ఆవిష్కరించింది. ఈ ఏడాది ‘పంచముఖ సంకటహర మహాగణపతి’గా ఖైరతాబాద్‌ బడా గణేశుడు దర్శనమివ్వనున్నాడు. విగ్రహానికి ఓ వైపు సోమనాథ్‌ జ్యోతిర్లింగం, మరోవైపు కాళీమాత విగ్రహాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ ఏడాదితో ఖైరతాబాద్‌లో బడా గణేశుడి ఉత్సవాలు ప్రారంభమై 72 ఏళ్లు పూర్తికానున్నాయి. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో గణనాథుడి కర్ర పూజ కార్యక్రమం ఘనంగా జరిగింది

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: