Thursday, July 9, 2026
News Navigation
Thursday, July 9, 2026
News Navigation

Breaking

Thursday, July 9, 2026
Home Andhra Pradesh డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి కి తప్పిన పెను ప్రమాదం

డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి కి తప్పిన పెను ప్రమాదం

by Rama
డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి కి తప్పిన పెను ప్రమాదం

రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామికి పెను ప్రమాదం తప్పింది. ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం పాలేటిపాడు గ్రామంలో నిర్వహిస్తున్న పోలేరమ్మ కొలుపులకు ఆదివారం మంత్రి, పలువురు టీడీపీ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రదర్శనకు ఉంచిన ఎడ్లబండ్ల ముందు స్థానిక నాయకులు, యువత.. మంత్రితో ఫోటోలు దిగేందుకు పోటీపడ్డారు. ఈ క్రమంలో డీజే సౌండ్‌కు ఎద్దులు ఒక్కసారిగా బెదిరి మంత్రిని తలతో ముందుకు నెట్టాయి. దీంతో ముందుకు బోర్లా పడిన మంత్రిపై ఎద్దు ముందుకాళ్లతో బలంగా తొక్కింది.
వెంటనే అప్రమత్తమైన గన్‌మెన్లు, పార్టీ నాయకులు ఎడ్లను అడ్డుకొని మంత్రిని ప్రమాదం నుంచి తప్పించారు. ఘటన తర్వాత టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెంలోని నివాసానికి చేరుకొన్న మంత్రికి వైద్యులు చికిత్స అందించారు.డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి కి తప్పిన పెను ప్రమాదం ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉందని, నియోజకవర్గ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి తెలిపారు

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • కనీస మద్దతు ధరకు పొగాకు కొనాల్సిందే-సీఎం చంద్రబాబు.
    రైతుల్లో నమ్మకం, ధైర్యం కల్పించేలా వెంటనే పొగాకు కొనుగోళ్లు పెద్దఎత్తున జరపాలని, ఇందుకోసం వేలం ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పొగాకు కంపెనీలకు స్పష్టం చేశారు. ట్రేడర్లు కొనుగోళ్లు తగ్గించడం సరికాదని, కర్నాటకలో తలెత్తని సమస్య ఏపీలో…
  • పీఎఫ్ క్లెయిమ్‌లు ఇక మరింత సులభతరం.
    దేశంలోని కోట్ల మంది పీఎఫ్‌ ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. పీఎఫ్ విత్‌డ్రా ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ EPFOలో విప్లవాత్మక మార్పులను ప్రవేశపెట్టింది. ఇకపై ఎలాంటి ఆలస్యం లేకుండా రూ.5 లక్షల…
  • అమరావతి నిర్మాణ పనులపై మంత్రి నారాయణ సమీక్ష.
    అమరావతి నిర్మాణ పనుల పురోగతిపై మంత్రి నారాయణ కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ భవనాలు, రోడ్లు, ఎల్పీఎస్ లేఅవుట్లు తదితర ప్రాజెక్టుల పనులు ఎంతవరకు పూర్తయ్యాయో సంస్థల ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ప్రాజెక్టు…
  • ఇంగ్లండ్ దెబ్బకు కుప్పకూలిన టీమ్ ఇండియా.
    ఇంగ్లండ్ చేతిలో ఇది ఘోర పరాజయం. ఓటమి ఒక్కటే కాదు, ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ భారత జట్టు తరఫున పరుగుల తేడాతో జరిగిన అతిపెద్ద ఓటమికి నాయకత్వం వహించిన కెప్టెన్‌గా ఒక అనవసర రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. డగౌట్‌లో…
  • విద్యార్థులతో కలిసి ఫుట్‌బాల్ మ్యాచ్ వీక్షించిన సీఎం రేవంత్ రెడ్డి.
    ఫిఫా వరల్డ్ కప్-2026లో భాగంగా అర్జెంటినా, ఈజిప్ట్ జట్ల మధ్య జరిగిన ఉత్కంఠభరిత పోరును తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థులతో కలిసి వీక్షించారు.హైదరాబాద్ శిల్పకళా వేదికలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన భారీ ఎల్ఈడీ స్క్రీన్‌పై సంక్షేమ పాఠశాలల విద్యార్థులతో కలిసి…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

039103
Total views : 194292

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: