Thursday, August 27, 2026
News Navigation
Thursday, August 27, 2026
News Navigation

Breaking

Thursday, August 27, 2026
Home Andhra Pradesh సీఎం జగన్ కు ఈసీ నోటీసులు జారీ..!

సీఎం జగన్ కు ఈసీ నోటీసులు జారీ..!

by Satya
Notices issued to CM Jagan

ఇటీవల మేమంతా సిద్ధం సభ(Memantha Siddham Sabha)లో సీఎం జగన్(CM Jagan) విపక్ష నేత చంద్రబాబు(Chandrababu)ను అరుంధతి సినిమాలోని పశుపతితో పోల్చడం తెలిసిందే. చంద్రబాబు పసుపతి మోసం చేయడమే చంద్రబాబు అలవాటు అంటూ వ్యాఖ్యానించారు. అయితే, ఈ వ్యాఖ్యలను టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి సీఈవో ముఖేష్ కుమార్ మీనా దృష్టికి తీసుకెళ్లారు. సీఎం జగన్ చేసిన అనుచిత వ్యాఖ్యలు ఎన్నికల్ కోడ్ ఉల్లంఘన కిందికి వస్తాయని సీఈవోకు ఫిర్యాదు చేశారు.

ఇది చదవండి: చంద్రబాబుపై ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు ఆగ్రహం

దీనిపై సీఈవో ముఖేశ్ కుమార్ మీనా స్పందించారు. సీఎం జగన్ కు నోటీసులు జారీ చేశారు. 48 గంటల్లో వివరణ ఇవ్వాలని ఆ నోటీసుల్లో స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యలు కోడ్ ఉల్లంఘనే అని ప్రాథమిక అంచనాకు వచ్చామని మీనా తెలిపారు. సీఎం జగన్ సకాలంలో స్పందించకపోతే ఈసీ తగిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు.

Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం చిన్నలంక వద్ద సముద్రంలో బోటు బోల్తా పడిన ఘటన కలకలం …
అనంతపురంలో పవన విద్యుత్‌ ప్రాజెక్టులకు శ్రీకారం.
అనంతపురం జిల్లా కణేకల్లు మండలం హులికెరలో మంత్రి నారా లోకేష్‌ పర్యటించారు. రాయదుర్గం నియోజకవర్గంలో పలు …
వైభవంగా గోదావరి పుష్కరాలు.
గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: