Saturday, June 20, 2026
News Navigation
Saturday, June 20, 2026
News Navigation

Breaking

Saturday, June 20, 2026
Home Andhra Pradesh ‘రాజధాని ఫైల్స్’ అందరూ చూడాలి – చంద్రబాబు

‘రాజధాని ఫైల్స్’ అందరూ చూడాలి – చంద్రబాబు

by Prakash
cbn about rajadhani files movie

‘రాజధాని ఫైల్స్’ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ చూడాలని టీడీపీ(TDP) అధినేత చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఒక ప్రాంతం పై కక్ష కట్టి, అది కూడా రాష్ట్ర రాజధాని పై పగబట్టి సర్వనాశనం చేసిన ప్రాంతం అమరావతి అని వెల్లడించారు. ఇది ఒక చారిత్రాత్మక విషాదం అని, దీని కోసం కులాల కుంపట్లు రాజేశాడని, విష ప్రచారాలు చేయించాడని చంద్రబాబు మండిపడ్డారు. అధికార బలం మొత్తం ఉపయోగించి ఉద్యమకారులను చిత్ర హింసలకు గురిచేశారని తెలిపారు.

Follow us on : Facebook, Instagram & YouTube.

జగన్ రెడ్డి క్రూరత్వానికి అద్దం పట్టిన చిత్రం ‘రాజధాని ఫైల్స్'(Rajadhani Files)…

జగన్ క్రూరత్వానికి, వైసీపీ విధ్వంసానికి నాశనమైన ఒక రాజధాని… దాని కోసం ఎన్నో త్యాగాలు చేసిన ప్రజలు ఎదుర్కొన్న కష్టాలను ఈ చిత్రం కళ్లకు కట్టిందని చంద్రబాబు వివరించారు. ఈ కుట్రలకు, దారుణాలకు అద్దం పట్టిన చిత్రం ‘రాజధాని ఫైల్స్’ అని వివరించారు. అందుకే ఈ చిత్రం విడుదల కాకుండా ఆపాలని జగన్ శతవిధాలా ప్రయత్నించాడని, కానీ కోర్టు అతడి ఆటలను సాగనివ్వలేదని చంద్రబాబు తెలిపారు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Advertisements

You may also like

Our Visitor

026180
Total views : 150005

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.