57
నారా లోకేష్‌ది అట్టర్ ప్లాప్ యాత్ర అని సెటైరికల్ కామెంట్స్ చేశారు మాజీ మంత్రి పేర్ని నాని. చంద్రబాబు పాపపు సొమ్ముతో లోకేష్ యాత్ర చేశారు. యువగళం యాత్రతో టీడీపీ ఏం సాధించిందని పేర్ని నాని ప్రశ్నించారు. మీడియాతో మాట్లాడుతూ నారా లోకేష్ అట్టర్ ప్లాప్ సినిమా. అది పాదయాత్ర కాదు జంపింగ్ జపాంగ్ యాత్ర. లోకేష్ యాత్ర కోసం వచ్చి మేనమామ కొడుకు చనిపోతే ఆపలేదు. కానీ, చంద్రబాబు జైలుకు వెళ్తే మాత్రం యాత్రను ఆపేశారు. ప్రజల కోసం పనిచేసే నాయకుడు సమస్యల పరిష్కారానికి ఆలోచిస్తాడు. యువగళం యాత్ర పేరుతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని బూతులు తిట్టారు. రాజకీయ లబ్ధి కోసమే మొక్కుబడి యాత్ర చేశారు. సాయంత్రం సూర్యుడు దిగిపోయాక లోకేష్ బయటకు వస్తారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.