Saturday, August 15, 2026
News Navigation
Saturday, August 15, 2026
News Navigation

Breaking

Saturday, August 15, 2026
Home International అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం రద్దు.

అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం రద్దు.

by CVR NEWS
అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం రద్దు

స్విట్జర్లాండ్ వేదికగా జరగాల్సిన అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు ప్రారంభం కాకముందే రద్దయ్యాయి. ఇరు దేశాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు జరిగిన ఈ ప్రయత్నాలు తీవ్ర ఉద్రిక్తతల నడుమ అర్ధాంతరంగా ముగిశాయి. శాంతి ఒప్పందం కోసం స్విట్జర్లాండ్‌కు అమెరికా తరఫున జేడీ వాన్స్ బృందం వెళ్లింది. అయితే, ఈ చర్చలు ప్రారంభం కావడానికి ముందే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన కొన్ని హెచ్చరికలు వాతావరణాన్ని వేడెక్కించాయి. ట్రంప్ వ్యాఖ్యలపై ఇరుదేశాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. దీనితో ఆగ్రహానికి గురైన ఇరాన్ ప్రతినిధులు, జేడీ వాన్స్‌ను కనీసం కలవకుండానే అక్కడి నుండి వెనుదిరిగారు. చర్చల్లో మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న పాకిస్థాన్‌కు ఇరాన్ బృందం తమ నిర్ణయాన్ని తెలిపి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో తాము చర్చల్లో కూర్చోబోమని స్పష్టం చేస్తూ ఇరాన్ ప్రతినిధులు నిష్క్రమించారు. వెనుదిరిగే సమయంలో ఇరాన్ ఒక కీలక ప్రకటన చేసింది. లెబనాన్‌పై జరుగుతున్న యుద్ధాన్ని తక్షణమే ఆపితేనే అమెరికాతో శాంతి చర్చలు జరుపుతామని ఇరాన్ కరాఖండిగా తేల్చి చెప్పింది. ఆ షరతు నెరవేరితేనే భవిష్యత్తులో చర్చల గురించి ఆలోచిస్తామని స్పష్టం చేసింది.

అమెరికా-ఇరాన్ మధ్య కుదరాల్సిన శాంతి ఒప్పందం ఇలా రద్దు కావడంతో అంతర్జాతీయ మార్కెట్‌పై దీని ప్రభావం తీవ్రంగా ఉండనుంది. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉండటంతో, మరోసారి ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు భారీగా పెరగనున్నాయి. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై, ముఖ్యంగా ఇంధన దిగుమతులపై ఆధారపడే దేశాలపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉంది.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: