38
చైనా రాజధాని బీజింగ్‌లో విమాన ప్రమాదం జరిగింది. ఒక స్మాల్ ప్లేన్ 108 అంతస్తుల అత్యంత ఎత్తైన ఆకాశహర్మ్యం ‘చైనా జున్’ను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటన ధాటికి భవనం పై అంతస్తుల నుంచి శిథిలాలు, విమాన భాగాలు కింద ఉన్న రోడ్లపై చెల్లాచెదురుగా పడ్డాయి. దేశీయంగా తయారైన ఒక చిన్న విమానం ఈ మేరకు ప్రమాదానికి గురైనట్లు ప్రాథమికంగా గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బంది, సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకొని సహాయకచర్యలు చేపట్టాయి. ఈ ఘటనతో ముందు జాగ్రత్తగా భవనంలోని పలు అంతస్తుల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భవనం సమీపంలో విమాన శకలాలు పడి పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. అత్యంత ఎత్తైన భవనాన్ని విమానం ఢీకొట్టిన ఈ ఘటనతో పరిసర ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.





Total views : 180027