Friday, August 28, 2026
News Navigation
Friday, August 28, 2026
News Navigation

Breaking

Friday, August 28, 2026
Home International అమెరికాలో భారతీయ విద్యార్థి మృతి..!

అమెరికాలో భారతీయ విద్యార్థి మృతి..!

by Satya
Indian student died in America

అమెరికా(America)లోని ఒహాయోలో భారతీయ విద్యార్థి మృతి చెందాడు. ఈ విషయాన్ని న్యూయార్క్‌లోని భారతీయ కాన్సులేట్ స్వయంగా ఎక్స్‌లో పోస్ట్‌ చేసింది. కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని తెలిపింది. క్లీవ్‌ల్యాండ్‌(Cleveland)లోని ఒహాయోలో భారతీయ విద్యార్థి ఉమా సత్యసాయి గద్దె మరణం చాలా బాధాకరమని, ఈ కేసును పోలీసులు(Police) దర్యాప్తు చేస్తున్నారని, ఎక్స్‌లో ట్వీట్‌ చేసింది.

ఇది చదవండి: జపాన్ ను కుదిపేసిన భారీ భూకంపం..!

ఉమా మృతదేహాన్ని వీలైనంత త్వరగా భారత్‌కు పంపించడంతో పాటు అవసరమైన ఇతర సహాయాన్ని అందిస్తామని కూడా ఆ ట్వీట్‌లో ఇండియన్‌ ఎంబసీ పేర్కొంది. అమెరికాలో నివసిస్తోన్న భారతీయులు, భారత మూలాలున్న విద్యార్థుల మరణాలు ఇటీవల పెరిగాయి. తాజాగా ఉమా సత్యసాయి మరణంతో అమెరికాలో ఉన్న భారతీయ సమాజం షాక్‌కు గురైంది. తాజా ఘటనతో కలిపి ఈయేడాది ఆరంభం నుంచి ఇప్పటివరకు అమెరికాలో 10 మంది భారతీయ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు.

Follow us on : Google News  మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వచ్చేనెలలో భారత్‌కి వచ్చే ఛాన్స్‌.
దాదాపు ఏడేళ్ల తర్వాత చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ భారత్‌లో పర్యటించే అవకాశం కనిపిస్తోంది. వచ్చే …
డొనాల్డ్‌ ట్రంప్‌ ‘ట్రూత్‌ సోషల్‌’ వేదికగా కీలక పోస్ట్‌.
కెనడాతో వాణిజ్య విభేదాలు కొనసాగుతున్న వేళ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ‘ట్రూత్‌ సోషల్‌’ వేదికగా …
కెనడాపై ట్రంప్ సంచలన నిర్ణయం.
కెనడా నుంచి దిగుమతి అయ్యే కార్లు, ట్రక్కులు, ఆటోమొబైల్ విడిభాగాలు, స్టీల్‌పై 50 శాతం భారీ …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: