Thursday, August 27, 2026
News Navigation
Thursday, August 27, 2026
News Navigation

Breaking

Thursday, August 27, 2026
Home Sports IPL-2026 తొలి మ్యాచ్ వివరాలను అధికారికంగా ప్రకటించింది.

IPL-2026 తొలి మ్యాచ్ వివరాలను అధికారికంగా ప్రకటించింది.

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న క్రికెట్ లవర్స్‌కు BCCI గుడ్ న్యూస్ చెప్పింది.

by CVR NEWS

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న క్రికెట్ లవర్స్‌కు BCCI గుడ్ న్యూస్ చెప్పింది. IPL-2026 తొలి మ్యాచ్ వివరాలను అధికారికంగా ప్రకటించింది. మార్చి 28 నుంచి ఈ మెగా టోర్నీకి ప్రారంభం కానుంది. మొదట మార్చి 26వ తేదీన ఐపీఎల్ 2026 టోర్నమెంట్ ప్రారంభమవుతుందని ప్రచారం జరిగింది. కానీ పలు రాష్ట్రాల్లో ఎన్నికల దృష్ట్యా షెడ్యూల్ విడుదల కాస్త ఆలస్యమైంది. అయితే ఎన్నడూ లేని విధంగా సరికొత్తంగా ఈ సీజన్‌కు తెరలేవనుంది. ఈసారి రెండు గ్రూప్‌ల్లో ఈ టోర్నీని నిర్వహించనున్నారు. ప్రస్తుతానికి 20 మ్యాచ్‌లకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేశారు. ఏప్రిల్ 12 వరకు ఇవి కొనసాగనున్నాయి. మార్చ్ 28న ఈ సీజన్ తొలి మ్యాచ్ జరగనుండగా.. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాత్రి 7.30 లకు RCB, హైదరాబాద్ సన్ రైజర్స్ జట్లు తలపడనున్నాయి. సెకండ్ మ్యాచ్ మార్చ్ 29వ తేదీన ముంబై వేదికగాKKR వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య రెండో మ్యాచ్ ఉంటుంది. మొదటి దశ షెడ్యూల్లో ఆడే 10 జట్లు, తలో నాలుగు మ్యాచ్‌లు ఆడబోతున్నాయి.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: