Wednesday, July 22, 2026
News Navigation
Wednesday, July 22, 2026
News Navigation

Breaking

Wednesday, July 22, 2026
Home Andhra Pradesh నరసాపురం బరిలో రెబల్స్ పోటీ…

నరసాపురం బరిలో రెబల్స్ పోటీ…

by Prakash
Janasena party


నరసాపురం జనసేన పార్టీ (Janasena party) కార్యాలయం..

పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం జనసేన పార్టీ (Janasena party) కార్యాలయంలో టిడిపి బిజెపి జనసేన కూటమి సమన్వయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి టిడిపి ఇంచార్జి పొత్తూరి రామరాజు, బిజెపి ఇంచార్జ్ పులపర్తి వెంకటేశ్వరరావు జనసేన ఇంచార్జ్, కూటమి ఉమ్మడి అభ్యర్థి బొమ్మిడి నాయకర్ పాల్గొన్నారు. ఈ సమావేశానికి బొమ్మిడి నాయకర్ అధ్యక్షత వహించారు.

ఎన్డీఏ కూటమి సమన్వయ సమావేశం..


అసలు విషయం ఏమిటంటే ఈ సమావేశానికి డుమ్మాకొట్టిన నాయకులు అంతా ఒకటే సామాజవర్గానికి(కాపు) చెందిన వారవటం అదే సామాజిక వర్గానికి చెందిన ఓట్లే నియోజకవర్గంలో అధిక సంఖ్యలో ఉండటంతో ఆ నలుగురు నేతల సపోర్ట్ లేకుండా ఉమ్మడి అభ్యర్థి గెలుపు అంతా ఈజీ కాదని పార్టీ కార్యకర్తలు అభిప్రాయ పడుతున్నారు. ఇదిలా ఉండగా నరసాపురం నియోజకవర్గంలో మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు, మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు, కొవ్వలి నాయుడు, చాగంటి మురళి కృష్ణ చిన్నలు కాపు సామాజిక వర్గానికి చెందిన ఈ నలుగురు నేతల అండ లేకుండా ఉమ్మడి అభ్యర్థి గెలవడం చాలా కష్టమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కాపు సామాజిక వర్గానికి చెందిన చక్రం తిప్పిన నాయకులను ప్రధాన పార్టీలు పక్కన పెట్టడం పై నియోజకవర్గంలోని కాపు నాయకులు మండిపడుతున్నారు. ఈ నలుగురు నేతలలో ఎవరో ఒకరిని ఎన్నికల బరిలో స్వతంత్ర అభ్యర్థిగా నిలిపి ప్రధాన రాజకీయ పార్టీలకు కాపుల సత్తా ఏమిటో చూపించాలని నియోజకవర్గం లోని కాపు ముఖ్య నాయకులు ఈ నేతలతో చర్చించినట్లు తెలుస్తోంది. ఎది ఏమైనా కీలక నేతలను ప్రధాన పార్టీలు పక్కన పెట్టడం ను నరసాపురం నియోజకవర్గం లోని కాపు ముఖ్య నాయకులు గుర్రుగా ఉన్నారు.

ఇదిలా ఉంటే సమన్వయ కమిటీ సమావేశానికి జనసేన లో టిక్కట్టు ఆశించిన మాజీ మంత్రి జనసేన నేత కొత్తపల్లి సుబ్బారాయుడు టీడీపీ లో టిక్కట్ నాదే అన్న టిడిపి మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు టీడీపీ జాతీయ అధ్యకుడు నారా చంద్రబాబు నాయుడు టీడీపీ నుండి టిక్కట్టు నికే ఇస్తానని హామీ ఇచ్చారని అన్న టిడిపి సీనియర్ నాయకుడు కొవ్వలి రామ్మోహన్ నాయుడు టిక్కట్టు పై ఆశపడ్డ ఈ నాయకులు అందరూ సమన్వయ కమిటీకి డుమ్మా కొట్టడంతో కూటమి అభ్యర్థి బొమ్మిడి నాయకర్ గెలుపుకు పనిచేస్తార లేక రెబల్ అభ్యర్థులుగా బరిలో ఉంటారా అని ఆయా పార్టీ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు.

Follow us on : FacebookInstagramYouTube & Google News


నంద్యాల జిల్లా ఆత్మకూరులో పులి, పులికూనలు హల్చల్.
నంద్యాల జిల్లా, ఆత్మకూరు అటవీ డివిజన్‌లో నాలుగు పులి కూనలు హల్‌చల్ చేశాయి. నల్లకాల్వ గ్రామానికి …
అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఎమ్మెల్యే సమీక్ష.
అనంతపురం నగర ప్రభుత్వ ఆసుపత్రిలో పారిశుద్ధ్యం, వైద్య సేవల మెరుగుదలపై కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు. …
కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం.
రాష్ట్రంలో నమోదవుతున్న కోవిడ్ కేసుల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాల …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

042274
Total views : 223713

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: