Monday, May 18, 2026
News Navigation
Monday, May 18, 2026
News Navigation

Breaking

Monday, May 18, 2026
Home Latest News మానవత్వాన్ని చాటుకున్న ఆటో డ్రైవర్..

మానవత్వాన్ని చాటుకున్న ఆటో డ్రైవర్..

by Rama
Auto driver

తెలంగాణ ప్రజాభవన్ వద్ద వారంలో రెండు సార్లు ప్రజాపాలన దరఖాస్తులు తీసుకుంటున్నారు. ప్రతి మంగళ, శుక్రవారాలలో ప్రజాభవన్ వద్ద వేలాదిమంది దరఖాస్తులు సమర్పిస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల దాహార్తిని తీర్చడం కోసం ఓ ఆటో డ్రైవర్ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. అక్కడికి వచ్చిన వారందరికీ ఉచితంగా మంచినీరు అందిస్తున్నారు. ఇక్కడే కాకుండా సిటీలో కొన్ని ప్రాంతాల్లో కూడా ఉచితంగా అందిస్తున్నానని ఆటో డ్రైవర్ సయ్యద్ జమీల్ తెలిపారు. దేశంలో అందరూ కలిసిమెలిసి ఉండాలని, కులమత భేదాలను చూపవద్దని జమీల్ తెలిపారు. కష్టాలలో ఉన్నవారికి మనకు చేతనైనంత సాయమందించాలని కోరారు.

Advertisements

You may also like

Our Visitor

014488
Total views : 80373

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.