విశాఖపట్నంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదవశాత్తు ఎన్‌ఎఎఫ్‌సి యూనిట్ లో మంటలు చెలరేగాయి. దీంతో విశాఖ స్టీల్ ప్లాంట్ లో దట్టమైన పొగ కమ్మేసింది. స్టీల్ ప్లాంట్ లోని కోకోవెన్ విభాగంలో ఉన్న నాఫ్తలీన్ యూనిట్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అగ్ని ప్రమాదం చోటు చేసుకుందని సమాచారం. కోకోవెన్ యూనిట్‌లో వెల్డింగ్ పనులు చేస్తుండగా ఒక్కసారిగా నిప్పు రవ్వలు ఎగసి పడి అగ్నిప్రమాదానికి కారణంగా మారిందని తెలుస్తుంది. ఈ అగ్ని ప్రమాదంలో విద్యుత్ పరికరాలు, యంత్రాలు, అక్కడ ఉన్న మెటీరియల్ అంతా పూర్తిగా కాలిపోయాయి.
ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కార్ బులెట్ ట్రైన్ వేగంగా దూసుకెళుతోందని బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ అన్నారు. దేశంలో ఏ రాష్ట్రానికి రాని విధంగా రెండేళ్లలో 10 లక్షల కోట్ల పెట్టుబడులు ఏపీకి వచ్చాయన్నారు.ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రాభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ…
ఏపీలో ఆదాయం పెంపే లక్ష్యంగా మైనింగ్ రంగంలో ప్రభుత్వం అనేక సంస్కరణలు చేపడుతోందని మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో అక్రమ మైనింగ్, ఇసుక దోపిడీల వల్ల రాష్ట్రానికి వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని విమర్శించారు. 2019–24…
తిరుపతి జిల్లా పిచ్చాటూరు లో కూటమి ప్రభుత్వ విజయోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రెండేళ్లలోనమ్మకం, సంక్షేమం,అభివృద్ధికి చిరునామాగా చంద్రన్న ప్రభుత్వం నిలిచిందన్నారు టీడీపీ నేతలు పనపాక లక్ష్మి, శంకర్ రెడ్డి. సత్యవేడు నియోజకవర్గ అభివృద్ధి కోసం రెండేళ్లలో 500 కోట్ల రూపాయలు ఖర్చు…