Friday, June 19, 2026
News Navigation
Friday, June 19, 2026
News Navigation

Breaking

Friday, June 19, 2026
Home Main News ఎమ్మెల్యే రెడ్యానాయక్ కు నిరసన సెగ

ఎమ్మెల్యే రెడ్యానాయక్ కు నిరసన సెగ

by
dornakal mla

డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ కు మళ్ళీ నిరసన సెగ తగిలింది. డోర్నకల్ మండలం మాన్య తండాలోఅసెంబ్లీ ఎన్నికల ప్రచారంకు వెళ్ళిన బిఆరెస్ అభ్యర్థి , స్థానిక ఎమ్మెల్యే రెడ్యానాయక్ ను నిరుద్యోగ యువకులు అడ్డగించారు. ఈవీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఈ ఘటన. నిరుద్యోగుల సమస్యలపై అసెంబ్లీలో ఎందుకు ప్రశ్నించలేదంటూ నిలదీసాడు ఓ యువకుడు.అధికారంలో ఉన్నవారు అడగమని ఎమ్మెల్యే రెడ్యానాయక్ సమాధానమిచ్చాడు.మా సమస్యలపై మీరు మాట్లాడకపోతే ఎవరు మాట్లాడుతారంటూ నిరుద్యోగులు ఎమ్మెల్యేను ప్రశ్నించారు.నిరుద్యోగ యువతతో ఎమ్మెల్యే రెడ్యానాయక్ తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. నిలదీసిన యువకులను పోలీసులు అక్కడనుండి పక్కకు తీసుకెళ్లారు.ఉద్యోగ నోటిఫికేషన్ల నిర్వహణలో ప్రభుత్వం విఫలమైందంటూ నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేసారు.

Advertisements

You may also like

Our Visitor

025719
Total views : 148172

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.