269
రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ చుట్టూ లైంగిక వేధింపుల ఉచ్చు బిగుస్తోంది. ఈ వ్యవహారం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఎమ్మెల్యే తనను వేధించారంటూ ఆరోపిస్తున్న సదరు మహిళ హర్షవీణ.. తాజాగా మరో వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేశారు. తన గోడును డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గారు పట్టించుకోకపోతే, జనసేన పార్టీ కార్యాలయం ముందే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్నప్పటి నుంచి పవన్ను తన కుటుంబ సభ్యుడిగా భావించానని, అలాంటి వ్యక్తి తనకు న్యాయం చేయకపోవడం బాధాకరమని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. మరి ఈ వ్యవహారంపై జనసేన అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాలి.