Sunday, June 14, 2026
News Navigation
Sunday, June 14, 2026
News Navigation

Breaking

Sunday, June 14, 2026
Home Latest News ఖమ్మం జిల్లా బూర్గంపాడులో రెచ్చిపోయిన ఇసుక మాఫియా…

ఖమ్మం జిల్లా బూర్గంపాడులో రెచ్చిపోయిన ఇసుక మాఫియా…

by CVR NEWS

ఖమ్మం జిల్లా బూర్గంపహాడ్ మండలంలో ఇసుక మాఫియా ఆగడాలు పరాకాష్టకు చేరుకుంటున్నాయి. అక్రమంగా ఇసుక తరలిస్తున్న వారిని అడ్డుకుంటూ అధికారి, ప్రజాప్రతినిధి అని తేడా లేకుండా ఇసుక మాఫియా దాడులకు తెగబడుతోంది. ఇటీవల కాలంలో రెవెన్యూ శాఖకు చెందిన అధికారి, ఓ పార్టీ నాయకుడిపై, తాజాగా సారపాక ఉప సర్పంచ్ పై దాడికి యత్నించారు. అక్రమ ఇసుక రవాణాపై స్థానికంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులను చూసి ఉప సర్పంచ్ అక్రమ ఇసుక రవాణాను అడ్డుకునేందుకు బ్రిడ్జి సమీపంలోని అనధికార ర్యాంపు ప్రదేశానికి వెళ్లగా ప్రజాప్రతినిధిపై ఇసుక మాఫియా దాడికి యత్నించింది. సారపాక బ్రిడ్జి సమీపంలోని అనధికార ర్యాంపు నుంచి 30 ట్రాక్టర్ల వరకు ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని తెలుసుకుని ఉప సర్పంచ్ కన్నెదారి రమేష్ అక్రమ రవాణాను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే ఆయనతో పాటు కొందరు మీడియా వ్యక్తులు కూడా కవరేజికి వెళ్లగా అప్పటికే ఉప సర్పంచ్ వచ్చిన విషయం తెలుసుకున్న ఇసుక మాఫియా ఆయనపై కత్తులతో దాడికి యత్నించే ప్రయత్నం చేశారు. మీడియా ఉండడాన్ని గమనించి వెనక్కు తగ్గారు. ఈ విషయాన్ని పోలీసులు, రెవెన్యూ శాఖ అధికారులకు తెలిపేందుకు ఉప స‌ర్పంచ్‌ ఫోన్లు చేయగా ఎవరూ స్పందించలేదు. దీంతో ఆయన ఆగ్రహానికి గురై పాల్వంచ డీఎస్పీకి ఫోన్ చేసి సమాచారం అందించడంతో కొద్దిసేపటికి పోలీసులు వచ్చి అక్రమ రవాణా చేస్తున్న ఏడు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

Advertisements

You may also like

Our Visitor

023320
Total views : 141756

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.