Wednesday, September 16, 2026
News Navigation
Wednesday, September 16, 2026
News Navigation

Breaking

Wednesday, September 16, 2026
Home Andhra PradeshKurnool శ్రీశైలం మహాక్షేత్రంలో తాత్కాలికంగా సామూహిక అభిషేకాలు రద్దు..

శ్రీశైలం మహాక్షేత్రంలో తాత్కాలికంగా సామూహిక అభిషేకాలు రద్దు..

by Rama
Sri Sailam

శ్రీశైలం మహాక్షేత్రం (Sri Sailam Mahakshetram) లో ఇవాళ నుంచి ఏప్రిల్ 10 వరకు స్వామివారి గర్భాలయ అభిషేకాలు సామూహిక అభిషేకాలు అమ్మవారి ఆలయంలో కుంకుమార్చన పూజలు తాత్కాలికంగా దేవస్థానం అధికారులు రద్దు చేశారు. ఏప్రిల్ 6 నుంచి 10 వరకు శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు వైభవంగా ప్రారంభం కానున్న నేపథ్యంలో శ్రీశైలం ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో శ్రీశైలానికి తరలి వస్తున్నారు. భక్తుల రద్దీ కారణంగా శ్రీశైలం దేవస్థానం అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే శ్రీశైలం మల్లన్న భక్తులకు క్షేత్రంలో గర్భాలయ అభిషేకాలు సామూహిక అభిషేకాలు కుంకుమార్చన పూజలు రద్దు చేస్తున్నట్లు అధికారులు ముందస్తుగా వెళ్లడించక పోవడంతో శ్రీశైలం చేరుకున్న భక్తులు అయోమయంలో పడుతున్నారు. శ్రీశైలం దేవస్థానం అఫీషియల్ వెబ్‌సైట్ లో స్వామివారి సామూహిక అభిషేకాలు గర్భాలయ అభిషేకాలు కుంకుమార్చన పూజలు ఆన్ లైన్ లో టికెట్లు కనిపించకపోవడంతో శ్రీశైలం వచ్చిన భక్తులు నిరాశకు గురవుతున్నారు.

శ్రీశైలం ఆలయంలో ఏప్రిల్ 6 నుంచి 10 వరకు ఉగాది మహోత్సవాలు జరుగనున్న నేపథ్యంలో 6 నుంచి 10 వరకు శ్రీశైలం మహాక్షేత్రంలో స్వామివారి స్పర్శ దర్శనాలు విఐపి బ్రేక్ దర్శనాలు కూడ తాత్కాలికంగా అధికారులు రద్దు చేశారు. భక్తుల రద్దీ కారణంగా భక్తులందరికి స్వామివారి దర్శనం భాగ్యం కల్పించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఏప్రిల్ 6 నుంచి 10 వరకు భక్తులందరికి స్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. ఇవాళ నుంచి ఏప్రిల్ 5 వరకు విడుతల వారీగా రోజుకు నాలుగు విడుతలుగా స్వామివారి గర్భాలయ స్పర్శ దర్శనాలు వీఐపి బ్రేక్ దర్శనాలకు అనుమతి ఉంటుందని ఏప్రిల్ 6 నుంచి 10 వరకు స్వామివారి అభిషేకాలు స్పర్శ దర్శనాల సేవలు తాత్కాలికంగా నిలుపుదల చేసి భక్తులందరికి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి ఉంటుందని దేవస్థానం అధికారులు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. భక్తులు సహకరించాలని ఈఓ పెద్దిరాజు భక్తులకు విజ్ఞప్తి చేశారు.

ఇది చదవండి: మీలో ఒకడిని.. మీతో ఒకడిని..


నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.
ఏపీలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా పర్యటిస్తున్నారు. విజయవాడకు చేరుకున్న కేంద్రమంత్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు …
ఏపీ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్‌.
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రెండు డీఏలను విడుదల చేస్తూ ఆర్థిక …
ఏపీకి భారీ వర్షసూచన.. 9 జిల్లాలకు అలర్ట్.
ఏపీలో వాతావరణశాఖ భారీ వర్షాలపై హెచ్చరికలు జారీ చేసింది. రెండు రోజులపాటు తొమ్మిది జిల్లాల్లో వర్షాలు …

Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: