జనగామ జిల్లా కేంద్రంలోని ధర్మకంచ అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ లో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు పరిచే మహాలక్ష్మి పథకం 200 యూనిట్లు ఉచిత విద్యుత్ స్కీం ప్రారంభించారు. కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన రెండు నెలల్లోనే ఆరు గ్యారెంటీలలో 4 గ్యారెంటీలను అమలు చేశామని చెప్పారు. మిగతా రెండు గ్యారెంటీలు 100 రోజుల్లోపు పూర్తి చేస్తామని, ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ప్రభుత్వం మాది. ఈ రోజు నుంచి మహాలక్ష్మీ పథకం ప్రారంభించామని ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు కరెంటు ను ఉచితంగా అందిస్తున్నామని చెప్పారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ నియోజకవర్గం నుంచి నైతికంగా నేనే గెలిచానని అక్రమంగా సంపాదించిన డబ్బు తోటి, దొంగ ఓట్ల తోటి మాత్రమే పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలిచాడని చెప్పారు. నైతికంగా విజయం మాదే అని చెప్పారు. కమిటీ హాల్ కు 30 లక్షలతో అభివృద్ధి పనులు చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ap elections 2024
చిత్తూరు జిల్లా పలమనేరు 2019 లో జరిగిన ఎన్నికల్లో ఏ మాత్రం రాజకీయ అనుభవం లేని యువకుడు రాష్ట్ర వ్యాప్తంగా వీచిన ఫ్యాన్ గాలితో వెంకట్ గౌడ గెలిచి అప్పట్లో రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాడు. జిల్లా మంత్రి పెద్దిరెడ్డికి సన్నిహితుడుగా మెలుగుతూ రాజకీయాలు సాగించాడు. అప్పటినుండి గడపగడపకు వైయస్సార్ కార్యక్రమంలో నియోజకవర్గంలోని ప్రతి గడపను చేరుకుని ప్రత్యర్థులను పలమనేరు ఎమ్మెల్యే వెంకట్ గౌడ ముప్పు తిప్పలు పెట్టాడు. వెంకట్ గౌడ రాబోయే ఎన్నికలకు వైసీపీ అభ్యర్థి తనే అంటూ సీటు పక్కా అనే సంకేతాలు ఇస్తూ ప్రత్యామ్యాయం లేకుండా చేసుకున్నాడు. అక్కడే డామిట్ కథ అడ్డం తిరిగింది. నియోజకవర్గ ప్రజలకు దగ్గర ఉంటూనే అధిష్టానానికి దూరంగా ఉండడం ఉమ్మడి చిత్తూరు జిల్లాకు ముఖ్యమంత్రి వచ్చినా… సన్నాహాక సమావేశాలు జరిగిన కనిపించని ఎమ్మెల్యే తీరు జిల్లాలోని పెద్దాయనకు తలనొప్పిగా మారాడు. ఇదే సమయంలో అధికార పార్టీ ఎమ్మెల్యే అయిన సొంత పార్టీలో అసంతృప్తులను బుజ్జగించడంలో విఫలమయ్యారని చర్చ కూడా నడుస్తుంది.
నియోజకవర్గం లోని పార్టీ సీనియర్ నాయకులైన పెద్ద పంజాని విజయభాస్కర్ రెడ్డి, సివి కుమార్, రాకేష్ రెడ్డికి వంటి వారు పార్టీకి దూరమయ్యారు. సొంత పార్టీ నేతలతోను ఎమ్మెల్యేకు సఖ్యత లేకపోవడం పెద్ద దెబ్బె.. ముఖ్యంగా సొంత మండలమైన వి.కోటలో జెడ్పి చైర్మన్ శ్రీనివాసులుతో ప్రతి విషయంలో బహిరంగంగానే వెంకట్ గౌడ విభేదిస్తూ వస్తున్నారు. ప్రతి మండలంలోనూ ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం ఉంది అనడం లో సందేహం లేదు. దీనికి తోడు ఎమ్మెల్యే తన నుండి బలవంతంగా క్వారీ లాక్కున్నాడన్న జనార్ధన నాయుడు అనే వ్యక్తి ఆరోపణలు చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కుప్పంలో జరిగిన చంద్రబాబు యాత్రలో వెంకట్ గౌడ గురించి తనకు జరిగిన అన్యాయాన్ని బహిరంగంగా ప్రజలకు తెలిపారు జనార్ధన నాయుడు. ఎమ్మెల్యే అనుచరుల, కౌన్సిలర్ల భూకబ్జాలు, ఇసుక దందాలు వంటి ఆరోపణలతో నిత్యం వార్తలలో నిలిచారు గౌడ. టిడిపి అభ్యర్థి మాజీ మంత్రి అమర్నాథరెడ్డి వెంకట్ గౌడ ఆగడాలను, వారి అనుచరులు చేస్తున్న అరాచకాలను ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో సిట్టింగ్ ఎమ్మెల్యే వెంకట్ గౌడకు మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి ల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు జరిగాయి. వీటన్నింటిని చూస్తున్న ప్రజలు విసిగిపోయారు. ఈ నేపథ్యంలో టీడీపీ సీనియర్ నాయకుడు ఆర్వీ సుభాష్ చంద్రబోస్ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు, ఆయన ప్రభావం పెద్దగా నియోజకవర్గంలో ఉండదని పలమనేరు ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
మండల స్థాయిలో జరుగుతున్న జగనన్న ఆసరా కార్యక్రమాన్ని కూడా అర్ధాంతరంగా నిలిపివేసిన ఎమ్మెల్యే ప్రవర్తన నాయకులకు ఆశ్చర్యం కలిగిస్తుంది. నియోజకవర్గ నాయకులకు కూడా ఎమ్మెల్యే అందుబాటులో లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది. ఎమ్మెల్యే గౌడ వ్యవహారాన్ని గమనిస్తున్న పెద్దాయన ప్రాతన్యాయంపై ఆలోచిస్తున్నారంటూ పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. నియోజకవర్గంలో తను చేసిన కాంట్రాక్టులకు నిధులను మంజూరు చేయాలంటూ కూడా అధిష్టానం వద్ద తన వాయిస్ వినిపించినట్టుగా పలమనేరు పట్టణంలో పెద్ద చర్చ జరుగుతుంది. ఇప్పటివరకు టికెట్టు నాది అని చెప్పుకుంటున్న వెంకట్ గౌడ రానున్న ఎన్నికల బరిలో దిగుతాడా లేదా అన్న విషయం నియోజకవర్గంలో ప్రశ్నగా మారింది.
ఈ నేపథ్యంలోనే పలమనేరు నియోజకవర్గంలో రాజకీయం ఆసక్తికరంగా మారింది. పలమనేరు అసెంబ్లీ అభ్యర్థిగా తనకు అధిష్టానం అవకాశం ఇస్తే పోటీ చేస్తానని జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు మంగళవారం తెలిపారు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా వున్న వెంకట్ గౌడను మార్చాలని, ఆయన స్థానంలో పోటీ చేయాలని అధిష్ఠానం నిర్ణయిస్తే కచ్చితంగా పోటీ చేసి గెలిచి పలమనేరు నియోజకవర్గాన్ని వైసీపీ ఖాతాలో వెస్తాను అంటే నిలబెడతానంటున్నారు జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు. తన అభ్యర్థిత్వానికి పలమనేరు మున్సిపల్ చైర్ పర్సన్ చాముండేశ్వరి సుధ, మార్కెట్ కమిటీ చైర్మన్ హేమంత్ రెడ్డి, పెద్దపంజాణి, బైరెడ్డిపల్లి, పలమనేరు, గంగవరం ఎంపీపీలు రెడ్డెప్ప, రెడ్డెప్ప, శ్రీదేవి, మురళీమోహన్ రెడ్డి తదితరులు మద్దతు ఇస్తున్నారన్నారు. పలమనేరు స్థానానికి పోటీ చేసే విషయమై అంతకుముందు ఆయన తన అనుచరులతో కూడా మంతనాలు చేశారు. దీంతో పాటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆశీర్వచనం ఉండడంతో ఈసారి కచ్చితంగా జడ్పీ చైర్మన్ శ్రీనివాసులకి టికెట్ వస్తుందని పలమనేరు నియోజకవర్గ ప్రజలు ఆశిస్తున్నారు. మొత్తం మీద రాబోయే 2024 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి, మాజీమంత్రి అమరనాథ రెడ్డి పై వైసిపి అధిష్టానం ఎవరిని అభ్యర్థిగా నిర్ణయిస్తుందో అని పలమనేరు నియోజకవర్గ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కుటుంబానికి ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే టికెట్ కేటాయించనున్నట్లు జెసి ప్రభాకర్ రెడ్డి పరోక్షంగా చెప్పారు. అనంతపురం జిల్లా యాడికి మండల కేంద్రంలో ఆయన చేపట్టిన బస్సు యాత్ర ముగింపు సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జేసీ కుటుంబానికి ఎన్ని టికెట్లు అని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ కుటుంబానికి ఒకటే అని నా దగ్గర అధినేత చంద్రబాబు చెప్పలేదని స్పష్టం చేశారు. మిగతా చాలామంది నేతలకు ఆ విషయం చెప్పిండోచ్చేమో అన్నారు. అనంతపురం పార్లమెంట్ స్థానంతో పాటు తాడిపత్రి ఎమ్మెల్యే టికెట్ తమకు కేటాయించాలని అధిష్టానానికి చెప్పగా సానుకూల సంకేతాలు వచ్చినట్లు ఆయన పరోక్షంగా వెల్లడించారు. జగన్ ప్రభుత్వంలో ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నట్లు ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. యాడికి మండల వ్యాప్తంగా మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అలాగే రైతాంగం సాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని ఆయన చెప్పారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఈ రోజు మందమర్రి ఏరియా సింగరేణి MVTC వృత్తి శిక్షణ కేంద్రంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించరు. ఈ రక్తదాన శిబిరానికి ముఖ్యఅతిథిగా మందమర్రి ఏరియా GM ఏ మనోహర్ విచ్చేసి, ఈ శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ…. రక్తదానం చెయ్యడం అనేది ప్రాణదానంతో సమానం అని అన్నారు. ఈ శిబిరంలో గనుల, డిపార్ట్మెంట్ల కార్మికులు, అప్రెంటీస్ కార్మికుల తో రక్తదాన శిబిరం నిర్వహించామని అన్నారు. రెడ్ క్రాస్ సొసైటీ మంచిర్యాల వారు రక్త నిల్వలు తగ్గాయన్న సూచన మేరకు తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ సేకరించిన రక్తాన్ని తలసేమియా వ్యాధిగ్రస్తులకు మరియు మంచిర్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని నిరుపేదలకు, గర్భిణీ స్త్రీలకు, కిడ్నీ డయాలసిస్ పేషెంట్లకు, అత్యవసర ఆపరేషన్లకు ఉచితంగా రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకు వారు అందజేస్తారని ఈ సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీ ని అభినందించారు. సింగరేణి సంస్థ ఉత్పత్తితో పాటు ప్రజల సంక్షేమానికి అనేక పథకాలు చేపడుతూ రక్తదాన శిబిరాలు చేపడుతూ తలసేమియా వ్యాధి గ్రస్తులను ఆదుకుంటున్నమని అన్నారు. మందమరి MVTVC యాజమాన్యము రక్తదాన శిబిరాలు ఏర్పాటు ఇప్పటివరకు 37 రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈరోజు మొత్తంగా 77 మంది రక్తదానం చేయడం చాలా సంతోషకరమైన విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో సలేంద్ర సత్యనారాయణ (ఏఐటియుసి వైస్ ప్రెసిడెంట్ ), ఏరియా సేఫ్టీ ఆఫీసర్ రవీందర్, సిఎంఓఏఐ ప్రెసిడెంట్ రమేష్, ఎంవిటిసి మేనేజర్ శంకర్, ట్రైనింగ్ ఆఫీసర్ అశోక్ కుమార్, జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ కంకణాల భాస్కర్ రెడ్డి, మేనేజ్మెంట్ కమిటీ సభ్యుడు కాసర్ల శ్రీనివాస్, తలసేమియా వెల్ఫేర్ సొసైటీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కాసర్ల రంజిత్ కుమార్, MVTC అధికారులు పాల్గొన్నారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీధి రౌడీలా మాట్లాడుతున్న బాల్క సుమన్ ను వెంటనే అరెస్టు చేయాలని మాజీ ప్రభుత్వ విప్, కాంగ్రెస్ నాయకులు నల్లాల ఓదెలు పేర్కొన్నారు. ఓదెల నివాసం వద్ద ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు వెంటనే అతని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని పట్టుకొని చెప్పుతో కొడతానంటు చెప్పు చూపెట్టడం ప్రజాస్వామ్యంలో సరైంది కాదని, సుమన్ ఓడిపోయిన ఒత్తిడిలో ఉన్నాడని వెంటనే అతన్ని పిచ్చాసుపత్రికి తరలించాలని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో సుమన్ ఈ నియోజకవర్గ ప్రజలు దగ్గరికి కూడా రానివ్వరని, పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడిగా, చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా పదేళ్లు పాలించి వేల కోట్ల ఆస్తులు అక్రమంగా కూడా పెట్టుకున్నారని మండిపడ్డారు. మొదటిసారి పెద్దపెల్లి పార్లమెంట్ లో పోటీ చేసినప్పుడు తనకు ఏమీ లేవా అని పేదవాన్ని ప్రజలను నమ్మించి ఓట్లు వేయించుకొని గెలిచి ఇప్పుడు వేల కోట్లకు అధిపతి అయ్యాడని మండిపడ్డారు. సుమన్ మతిభ్రమించి మాట్లాడుతున్నాడని చెన్నూరు నియోజకవర్గ ప్రజలు మంచిర్యాల జిల్లా ప్రజలు రాబోయే రోజుల్లో చెప్పులతో తరిమి తరిమి కొడతారని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ ఇచ్చిన 102 హామీలలో ఎన్ని నెరవేర్చాడు చెప్పాలని విమర్శించారు. దళిత బంధు దళితులకు మూడు ఎకరాలు వంటి ఎన్నో హామీలను విస్మరించినందుకే ప్రజలు తగిన బుద్ధి చెప్పి ఓడ కొట్టారని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి పై సుమన్ చేసిన వ్యాఖ్యలకు వెంటనే అతన్ని అరెస్టు చేసి జైలుకు తరలించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో నాయకులు, మహిళ పట్టణ అధ్యక్షురాలు గడ్డం రజిని, మహిళా నాయకురాలు సమత, సరిత పాల్గొన్నారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
నంద్యాల జిల్లా శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్న బీహార్ కు చెందిన 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవారి దర్శనార్థం ఆలయ రాజా గోపురం వద్దకు చేరుకున్న బీహార్ కాంగ్రెస్ 22 మంది ఎమ్మెల్యేలకు ఆలయ మర్యాదలను అనుసరించి ఆలయ అధికారులు అర్చకస్వాములు స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యేలు శ్రీ స్వామివారికి రుద్రాభిషేకం అమ్మవారికి కుంకుమార్చన తదితర ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. దర్శనానంతరం ఎమ్మెల్యేలకు శ్రీ స్వామి అమ్మవార్ల లడ్డు ప్రసాదాలు ఆలయ అధికారులు అందజేశారు. అయితే గత కొద్ది రోజులుగా బీహార్లో ప్రభుత్వంపై బల ప్రదర్శన నిర్వహించాలని ఈ నెల 12న బలపరీక్ష ఉండడంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పుణ్యక్షేత్రాలకు తిప్పుతున్నారని సమాచారం. అందులో భాగంగానే నేడు శ్రీశైలం, రేపు జోగులాంబ గద్వాల జిల్లాకు వెళుతున్నట్టుగా సమాచారం బీహార్ ఎమ్మెల్యేల వెంట తెలంగాణ అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ కూడా వెంటే ఉండి బీహార్ ఎమ్మెల్యేకు దర్శన ఏర్పాట్లు దగ్గరుండి చూస్తున్నారు. శ్రీశైలం పర్యటన దర్శనానంతరం తెలంగాణ అలంపూర్ జోగులాంబ ఆలయానికి బీహార్ ఎమ్మెల్యేలు వెళ్తున్నట్లు సమాచారం తెలుస్తోంది.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
గ్రామీణ ప్రాంతాల్లో దొరికే తాటి కల్లు, ఈత కల్లు గురించి అందరికీ తెలుసు.. కానీ ఖర్జూర కల్లు గురించి అంతగా ఎవరికీ తెలియదు. నిజానికి ఈ మధ్యే ఖర్జూర కల్లు గురించి ఎక్కువగా వింటున్నాము. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలో దాసరోజు నాగేశ్వర చారి అనే వ్యక్తి తన ఇంటి ముందు 3 ఏళ్ళ క్రితం సరదాగా నాటాడు. చెట్టు ఏపుగా పెరగడంతో తన మిత్రుడు గందసిరి రమేష్ అనే గీత కార్మికుడ్ని సంప్రదించి కర్జూర చెట్టుకు కల్లును తీయిస్తూ అందరికీ ఆసక్తిని కలిగిస్తున్నాడు. కాగా తెల్లని పాలవలె కనిపిస్తున్న ఈ కల్లు అందరి నోళ్ళూ ఊరిస్తోంది. ప్రకృతి సిద్ధంగా లభించే ఈ కల్లు ఆరోగ్యంతో పాటు, ఆదాయాన్ని ఇస్తుంది. కిడ్నీలో రాళ్లను కరిగించే శక్తి ఖర్జూర కల్లుకు ఉందని కల్లు ప్రియులు అంటున్నారు. ఉదయాన్నే ఈ కల్లు తాగితే ఆరోగ్యానికి మంచిదని, అద్భుతంగా ఉంటుందని కల్లు ప్రియులు చెబుతున్నారు. తాటి చెట్టు, ఈత చెట్టు అయితే సంవత్సరంలో కొన్ని నెలలు మాత్రమే కల్లుని ఇస్తాయి. అదే ఖర్జూర చెట్లు అయితే ఏడాది మొత్తం కల్లుని ఇస్తుంది. ఒక్కో చెట్టు నుంచి రోజుకు 20 లీటర్ల కల్లు వస్తుంది. లీటర్ యాభై రూపాయలకు విక్రయిస్తున్నారు. ఖర్జూర కల్లు తాగేవారి సంఖ్య ఎక్కువగా ఉన్నా చెట్లు తక్కువగా ఉండడంతో సరిపడా కల్లు ఉత్పత్తి చేయలేకపోతున్నామని కల్లు విక్రయదారులు వాపోతున్నారు. ప్రభుత్వం సహకరించి ఖర్జూర చెట్లను పెంచి తమకు ఉపాధి కల్పించాలని గీత కార్మికులు కోరుతున్నారు. ప్రభుత్వం ప్రోత్సహిస్తే ప్రజలకు ఆరోగ్యవంతమైన ఖర్జూర కల్లును అందిస్తామని తద్వారా ప్రజలు మద్యానికి బానిసై ఆర్థికంగా, ఆరోగ్యంగా నష్టపోకుండా ఉంటారని కల్లు గీత కార్మికులు చెబుతున్నారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
తిరుపతి ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు (Nellore Car Burn News ) :
వెంకటగిరి నుండి గూడూరు వైపు వస్తున్న కారు విద్యుత్ స్తంభాన్ని ఢీకొని అగ్నికి ఆహుతైంది. అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో షార్ట్ సర్క్యూట్ తో దగ్ధమైన కారు (Nellore Car Burn). గూడూరు మండల పరిధిలోని తిప్పవరపాడు జంక్షన్లో చోటు చేసుకున్న ఘటన.
Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లి, కుమారుడు మృతి.
ఈ ప్రమాదాన్ని అక్కడే ఉన్న కొంత మంది గమనించి అందులో ఉన్న నలుగురు వ్యక్తులను హుటాహుటిన కారు అద్దాలు పగలగొట్టి బయటికి తీసి రక్షించిన స్థానికులు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా సంఘటన వద్దకు చేరుకుని మంటలను అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది. ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్న స్థానికులు. కారులో ఉన్న వ్యక్తులు ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తింపు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఘోర రోడ్డు ప్రమాదం ఘటన వివరాలు..
కరీంనగర్ జిల్లా లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తల్లి, కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన ఘటన శంకరపట్నం మండలంలో చోటుచేసుకుంది. కరీంనగర్ నుండి హుజూరాబాద్ వెళ్తున్న కారును కొత్తగట్టు వద్ద టిప్పర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తల్లి, కుమారుడు మృతి చెందగా. మరో కుమార్తె, కుమారుడికి తీవ్రగాయాలయ్యియి. టిప్పర్ ఢీ కొట్టటం తో కారులో వెళ్తున్న వారిలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులు కరీంనగర్ కి చెందిన కొమురమ్మ, ప్రభాకర్ గా పోలీసులు గుర్తించారు.
Read Also: ఎమ్మెల్సీ కవిత : కులగణన చేపట్టిన తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహించాలి..
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఎమ్మెల్సీ కవిత : కులగణన చేపట్టిన తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహించాలి..
ఎమ్మెల్సీ కవిత కామెంట్స్..
- అసెంబ్లీలో పూలే విగ్రహం ఏర్పాటుపై ఏప్రిల్ 11లోగా ప్రభుత్వం సానుకూల ప్రకటన చేయాలి
- కులగణన చేపట్టిన తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహించాలి.
- పూర్తి స్థాయిలో రిజర్వేషన్ల అమలుకు బీసీ మేధావులు గళమెత్తాలి
- ఇచ్చిన హామీ మేరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలి
కరీంనగర్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత. రాష్ట్రంలో కులగణన చేపట్టి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో బీసీ డిక్లరేషన్ లో ప్రకటించిన మేరకు 6 నెలల్లో కులగణన చేపట్టడానికి తక్షణమే ప్రక్రియ ప్రారంభించాలని స్పష్టం చేశారు. ఆగమాగం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనుకుంటే ఊరుకోబోమని హెచ్చరించారు. బీసీ హక్కుల సాధన కోసం భారత జాగృతి, యునైటెడ్ పూలే ఫ్రంట్ సంయుక్తంగా నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ….
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై స్పష్టమైన కార్యాచరణను ప్రకటించాలని, అధికారంలోకి వచ్చి రెండు నెలలు గడిచినా ముందడుగు వేయలేదని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే కొత్తగా దాదాపు 24 వేల మంది బీసీలు ఎంపీటీసీలు, సర్పంచ్ లు, కౌన్సిలర్లు, కార్పోరేటర్లు, జడ్పీటీసీలు అవుతాయని కాంగ్రెస్ పార్టీ చెప్పిందని గుర్తు చేశారు. ఈ రీత్యా పరిపాలనలో బీసీ భాగస్వామ్యం ఉండాలంటే తక్షణమే జనగణన ప్రక్రియను ప్రారంభించాలని పునరుద్ఘాటించారు. అలాగే, బీసీల సంక్షేమ కోసం ప్రతి ఏటా రూ. 20 వేల కోట్లు బడ్జెట్ కేటాయిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, కాబట్టి ఈ 2024-25 బడ్జెట్ లో ప్రభుత్వం రూ. 20 వేల కోట్లు కేటాయించాలని అన్నారు. ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ సబ్ ప్లాన్ కి చట్టబద్ధత కల్పించాలని, ఎంబీసీల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, అంతేకాకుండా, అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని, దీనిపై ఏప్రిల్ 11 లోపు ప్రభుత్వం సానుకూల ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.
ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లు ఇచ్చుకునే సౌలభ్యం కల్పించాలని, తద్వారా జనాభా ఆధారంగా రాష్ట్రాల్లో రిజర్వేషన్లు చేసుకోవచ్చని తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ప్రతిపాదించారని గుర్తు చేశారు. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం రిజర్వేషన్లు చేసుకునే అవకాశాన్ని రాష్ట్రాలకు ఇవ్వడం లేదని తప్పుబట్టారు. నిరంతరం సుప్రీం తీర్పును చూపించి కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్ల విషయంలో రాష్ట్రాలకు వెసులుబాటు కల్పించడంలేదని చెప్పారు. మహిళా రిజర్వేషన్లలో ఓబీసీ మహిళలకు కోటా కల్పించాలని డిమాండ్ చేశారు.
2018 నుంచి ఇప్పటి వరకు 4365 మంది సివిల్స్ కు ఎంపికైతే అందులో కేవలం 1195 మాత్రమే బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఉన్నాయని లేవనెత్తారు. ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు ఉన్నా కూడా కేవలం 15.5 శాతం మందిని మాత్రమే ఎంపిక చేశారని చెప్పారు. ఎస్సీలు 5 శాతం, ఎస్టీలు కేవలం 3 శాతం మాత్రమే ఎంపికయ్యారని వివరించారు. కోల్పోతున్న రిజర్వేషన్లపై ఎవరూ మాట్లాడడం లేదని, కాబట్టి బీసీ మేధావులు ఈ అంశంపై గళమెత్తాలని పిలుపునిచ్చారు.
హక్కుల కోసం పోరాటం చేయాలంటే…తెలంగాణ ఉద్యమం తరహాలో పోరాటం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. భారత జాగృతిగా రూపాంతరం చెందిన తెలంగాణ జాగృతి అనేక సామాజిక అంశాలపై పోరాటాలు చేసిందని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంతోకొట్లాడి బతుకమ్మకు రాష్ట్ర హోదా, నిరాహార దీక్ష చేసి అసెంబ్లీ ఆవరణలో అంబేద్కర్ విగ్రహం సాధించామని, నైపుణ్యాభివృద్ధి శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసి దాదాపు 20 వేల మంది యువతకు ఉద్యగ కల్పనకు దారిచూపామని, దేశవ్యాప్తంగా మహిళా బిల్లుపై చర్చకు ప్రేరేపించామని వివరించారు.
రౌండ్ టేబుల్ సమావేశంలో యునైటెడ్ పూలే ఫ్రంట్ కన్వీనర్ గట్టు రామచందర్ రావు, కో కన్వీనర్ రాజా రామ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Total views : 141722