కుప్పం (Kuppam) :
కుప్పం (Kuppam) నియోజకవర్గం నుంచి ఎనిమిదవ సారి టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సంబంధించి నామినేషన్లు దాఖలు చేయడానికి నారా భువనేశ్వరి కుప్పం చేరుకున్నారు. ఉదయం శ్రీ ప్రసన్న వరదరాజస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం భారీ ర్యాలీగా కూడా ఆమె చంద్రబాబు నాయుడికి సంబంధించిన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగులు పెద్ద ఎత్తున కుప్పం కి చేరుకొని చంద్రబాబు నాయుడుకి సంఘీభావం తెలుపుతున్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
చంద్రబాబు నాయుడు వికలాంగులకు ఇచ్చిన హామీని అభినందిస్తూ తమ వంతు సహాయంగా వికలాంగులు, నిరుద్యోగులు, విద్యార్థులు చంద్రబాబు నాయుడు నామినేషన్ కి సంబంధించి విరాళాలను నారా భువనేశ్వరి చేతులకు అందజేశారు. ప్రస్తుతం కుప్పంలో నారా భువనేశ్వరి..ఆర్వో కార్యాలయానికి భారీ ర్యాలీతో ముందుకెళ్తున్నారు.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- అమరావతిలో తొలిసారిగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.ఏపీ రాజధాని అమరావతిలో తొలిసారిగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వర్ణాంధ్ర–2047 థీమ్‌తో రాయపూడిలోని పరేడ్ గ్రౌండ్ వేదికగా జరిగిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.సీడ్ యాక్సెస్ రోడ్డు…
- ఈ నెల 25న రాయదుర్గంలో నారా లోకేష్ పర్యటన.అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో ఈ నెల 25న రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ పర్యటించనున్నారు. కనేకల్-1, కనేకల్-2 పేర్లతో ఏర్పాటు చేయబోయే పవన విద్యుత్ ప్రాజెక్టులకు మంత్రి శంకుస్థాపన చేయనున్నారు. మంత్రి పర్యటన నేపథ్యంలో…
- అమరావతిని ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేయడమే లక్ష్యం.ఏపీ రాజధాని అమరావతి అంటే ఇక గ్రాఫిక్స్ కాదు… గ్రౌండ్లో కనిపిస్తున్న రియాలిటీ. రాజధాని రోడ్లపై రయ్‌మంటూ దూసుకెళ్లే వాహనాలకు మరో కొత్త మార్గం సిద్ధమైంది. రాజధాని రవాణా వ్యవస్థకు వెన్నెముకగా నిలిచే ఈ-3 సీడ్ యాక్సెస్ రోడ్డు రెండో దశతో…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: బాబు తరపున భువనమ్మ నామినేషన్…