రాజన్న సిరిసిల్ల జిల్లా. వేములవాడ పట్టణంలోని గాంధీ నగర్ లో తాళం వేసిన ఇంట్లో అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు ఇంట్లోకి ప్రవేశించి 40 వేల రూపాయల నగదు, తులం బంగారం దొంగతనం చేశారు. తిప్పాపూర్ లోని గురుకుల పాఠశాలలో ప్రభుత్వ టీచర్లుగా పనిచేస్తున్న భార్యాభర్తలు ఎలక్షన్ డ్యూటీలో వెళ్లిన సమయంలో చోరీ జరిగినట్లు తెలుస్తుంది. గుర్తుతెలియని వ్యక్తి ఇంట్లోకి చొరబడే ముందు సిసి కెమెరాలో దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు వేములవాడ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయగా, క్లూస్ టీం రంగంలోకి ఆధారాలు సేకరిస్తుండగా, దొంగ తెలివిగా తన చేతికి గ్లౌజులు వేసుకోవడంతో వేలిముద్రలు సేకరించడంలో కష్టతరంగా మారింది.
cvr news
నాగార్జునసాగర్ డ్యామ్ వివాదం ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య మరోసారి చిచ్చు రాజేసింది. దాదాపు 500 మంది ఏపీ పోలీసులు డ్యామ్ పైకి వచ్చి 13 గేట్ల వరకు స్వాధీనం చేసుకుని, కుడి కాలువ ద్వారా నీటిని విడుదల చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న రోజున ఈ ఘటన జరిగింది. ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీసులు కూడా అక్కడకు భారీ సంఖ్యలో చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం సాగర్ డ్యామ్ ను కేంద్ర బలగాలు తమ అధీనంలోకి తీసుకున్నాయి. మరోవైపు, ఈ ఘటనపై తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి విమర్శలు గుప్పించారు. పోలింగ్ రోజున డ్యామ్ పైకి ఏపీ పోలీసులు దౌర్జన్యంగా వచ్చారని ఆయన మండిపడ్డారు. దురాలోచనతోనే ఏపీ ప్రభుత్వం ఈ దుశ్చర్యకు పాల్పడిందని అన్నారు. ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే ఇరు రాష్ట్రాల మధ్య సంబంధాలు దెబ్బతింటాయని చెప్పారు. ఈ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ గెలుస్తుందని ముఖ్యమంత్రిగా కేసీఆర్ హ్యాట్రిక్ కొడతారని ధీమా వ్యక్తం చేశారు.
Read Also..
Read Also..
తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల నీటి పంచాయితీపై కేంద్ర జలశక్తి శాఖ సమావేశం ముగిసింది. శనివారం శ్రమ శక్తి భవన్లో హైబ్రిడ్ మోడ్‌లో తెలుగు రాష్ట్రాల అధికారులతో దాదాపు గంటకుపైగా కేంద్ర జలశక్తి శాఖ అధికారుల సమావేశం జరిగింది. నాగార్జున సాగర్ డ్యామ్ వద్ద ఉద్రిక్తతలు, తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా నదీ జలాల పంపకాల సమస్యలపై కేంద్ర జలశక్తి శాఖ అధికారులు ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మినిట్స్ రూపంలో ఏపీ, తెలంగాణ అధికారులు విడుదల చేస్తారని సెంట్రల్ వాటర్ కమీషన్ ఛైర్మన్ వెల్లడించారు
బాపట్ల జిల్లాలో మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి వేటకు వెళ్లరాదని జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా శనివారం హెచ్చరికలు జారీ చేశారు. బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడిందని, 900 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం అయ్యిందన్నారు. మూడో తేదీ నుంచి 5వ తేదీ వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ నుంచి అధికారికంగా సమాచారం అందిందన్నారు. సముద్రంలోకి మత్స్యకారులు వెళ్లరాదని, ఇప్పటికే వేటకు వెళ్లి ఉంటే తక్షణమే బయటకు వచ్చేయాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో కోత దశకు వచ్చిన పంటలన్ని కోతతో తక్షణమే భద్రపరుచుకోవలన్నారు. లోతట్టు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. మందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామన్నారు. ముఖ్యంగా లంక గ్రామాల్లోని ప్రజలు, అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు.
అయోధ్యలో నిర్మించిన రామాలయంలో రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠాపన కార్యక్రమానికి 6000 మంది ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు శ్రీరాం జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ పోస్టు ద్వారా అందరికీ ఆహ్వానాలు పంపింది. జనవరి 22న అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం జరగనుంది. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరుకానున్న వారిలో సాధు సంతులు, ప్రధాని నరేంద్రమోదీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ సహా పలువురు వీవీఐపీలు ఉన్నారు. పోస్టు ద్వారా ఆహ్వానపత్రికలు పంపడంతోపాటు వాట్సాప్ ద్వారా పీడీఎఫ్ ఫైళ్లు కూడా పంపించారు. అతిథులు తమ ఆధార్ కార్డులను విధిగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. అయోధ్య సాధువులు అతిథులను సాదరంగా ఆహ్వానిస్తారు. మెగా ప్రాణ ప్రతిష్ఠకు రాముడి ఆశీర్వాదంతో తనకు తొలి ఆహ్వాన పత్రిక అందిందని మహంత్ విష్ణుదాస్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి దేశం నలుమూలల నుంచి సాధుసంతులు వస్తునట్టు తెలిపారు.
కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్లకు సీడబ్ల్యూసీ ఆమోదం తెలపలేదని నేషనల్ డ్యామ్ సెఫ్టీ అథారిటీ పేర్కొంది. తెలంగాణ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లోని సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ ఆమోదించిన డిజైన్లనే డీపీఆర్‌తోపాటూ సమర్పించారని తెలిపింది. బ్యారేజీ కుంగిన ఘటనపై తాము 20 రకాల డాక్యుమెంట్లు కోరామని, కానీ ప్రభుత్వం కొన్నింటినే ఇచ్చిందని వెల్లడించింది. వాటి ఆధారంగానే తాము నివేదిక ఇచ్చామని స్పష్టం చేసింది. బ్యారేజీ కుంగిన నేపథ్యంలో ప్రాజెక్టు సందర్శనకు వచ్చిన ఎన్డీఎస్ఏ బృందం ఆ తరువాత రాష్ట్ర ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు, ఇంజినీర్లతో సమావేశమైంది. అనంతరం.. ప్రభుత్వ అధికారుల ఇచ్చిన సమాచారం పరిగణలోకి తీసుకుని నివేదిక ఇచ్చింది. ఈ నివేదికపై రాష్ట్ర ఇరిగేషన్ స్పెషల్ సీఎస్ రజత్ కుమార్ ఎన్డీఎస్ఏ చైర్మన్‌కు లేఖ రాయగా సంస్థ కూడా తాజాగా ప్రత్యుత్తరమిచ్చింది. మేడిగడ్డ బ్యారేజీ కుంగడానికి ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ లోపాలున్నాయని మరోసారి చెప్పింది. అక్టోబర్ 21న మేడిగడ్డ బ్యారేజీలోని ఏడో బ్లాక్‌లో పిల్లర్ కుంగిపోయిన విషయం తెలిసిందే. బ్యారేజీలోని ఏడో బ్లాక్‌లోని పిల్లర్లు కుంగిపోయి, వాటిల్లో పగుళ్లు వచ్చాయని ఎన్డీఎస్ఏ పేర్కొంది. పిల్లర్లు ముందుకు కదిలాయని తన లేఖలో స్పష్టం చేసింది. ఇందుకు కారణాలపై స్టడీ చేయాలని ఇప్పటికే తాము తెలంగాణ ప్రభుత్వానికి సూచించామని తెలిపింది. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునాదుల కింది నుంచి పైపింగ్ జరిగిందని ఎన్డీఎస్ఏ తెలిపింది. మేడిగడ్డ బ్యారేజీలో నిర్మాణ లోపాలపై కేంద్ర కమిటీకి సమగ్రమైన అవగాహన ఉందని వ్యాఖ్యానించింది. ఆ అవగాహనతోనే నిర్ధారణకు వచ్చామని, తాము నిరాధారంగా నివేదిక ఇవ్వలేదని తేల్చి చెప్పింది. నిరంతర పర్యవేక్షణ, నిర్వహణ లోపంతోనూ సమస్య తలెత్తింది పేర్కొంది.
ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పిల్లల నుంచి పెద్దల వరకు తినగలిగే ఆహారంలో బాదం పప్పు కూడా ఒకటి. సూపర్ ఫుడ్‌గా పిలవబడే బాదంలో న్యూట్రీషియన్స్ , విటమిన్స్ , ఫైబర్, మెగ్నీషియం, ఓమేగా3 ఫ్యాటీయాసిడ్స్, ప్రోటీన్స్ అత్యధికంగా ఉన్నాయి.ఇవి మంచి ఆరోగ్యానికి తోడ్పడతాయి. బాదంను క్రమం తప్పకుండా తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే బాదం ప్రతి రోజు తినడం వల్ల ఇన్సులిన్ స్థాయి అదుపులో ఉంటుంది. ఇవి గ్లూకోజ్ ను శరీరం బాగా శోషించుకొనేలా చేస్తాయి. తద్వారా మధుమేహం అదుపులో ఉంటుంది. అయితే నానబెట్టిన బాదం తినొచ్చా.? అన్నది చాలా మందిలో ఉండే సందేహం. వాస్తవానికి కొందరు నానబెట్టిన బాదం తింటే. మరికొందరు బాదంను డైరెక్ట్‌గా తింటుంటారు. కానీ, నానబెట్టిన బాదాం పప్పులు తినడమే ఆరోగ్యానికి మంచిది. ఎందుకు మంచిది అంటే. బాదం పప్పులు మీద ఉండే తొక్కలో టానిన్ అనే పదార్ధం ఉంటుంది. అది మన శరీరం పోషకాలను గ్రహించకుండా చేస్తుంది. ఎప్పుడైతే బాదం పప్పులని నానబెట్టామో, అప్పుడు ఆ తొక్క ఊడిపోతుంది. అలా తిన్న బాదం మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అందులోనూ ముఖ్యంగా రాత్రి పూట నీటిలో నానబెట్టి ఉదయాన్నే తినడం వల్ల మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. ఇలా క్రమం తప్పకుండా బాదంను తినడం వల్ల జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. ఇక బరువు తగ్గాలనుకునే వారికి బాదం ఎంతగానో సహాయపడుతుంది. ఎందుకంటే బాదంలో ఉండే మోనో శ్యాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువ సమయం పొట్ట ఫుల్ గా ఉంచుతుంది. ఈ క్రమంలోనే ఆకలి తగ్గిస్తుంది.తద్వారా బరువు తగ్గొచ్చు. మరియు బాదంలో ఉండే బి17 లో న్యూట్రీషియన్స్ క్యాన్సర్ నివారణలో సహాపడతాయి.
Read Also..
Read Also..
ఏజెన్సీ నివురుగప్పిన నిప్పులా మారింది. గోదావరి పరివాహక ప్రాంతంలో ఖాకీలు డ్రోన్ కెమెరాలతో డేగ కన్ను పెట్టారు. నేటి నుంచి 08 వ తేదీ వరకు జరిగే PLGA వారోత్సవాలను విజయవంతం చేయాలని మావోయిస్ట్ లు పిలుపు నివ్వడంతో ఏజెన్సీలో హై అలెర్ట్ కొనసాగుతుంది. PLGA వారోత్సవాల సందర్భంగా మావోయిస్టులు ఏదైన విధ్వంసానికి పాల్పడవచ్చనే సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. ఒకవైపు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు, మరోవైపు కమాండ్ కంట్రోల్ డ్రోన్ కెమెరాలతో మావోయిస్టుల కదలికలను పసిగడుతున్నారు.
కడప జిల్లా.. అట్లూరు మండలంలోని కోనరాజుపల్లె పాఠశాల గేటుకు ఉరేసుకుని గంపల చిన్న ఎల్లయ్య అనే (37) వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎల్లయ్య మృతి పై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మృతునికి భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు. అట్లూరు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కాసేపట్లో తెలంగాణకు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ రానున్నారు. తెలంగాణ ఎన్నికల ఫలితాల మానిటరింగ్ చేసేందుకు డీకే శివకుమార్‌ను అధిష్టానం నియమించింది. ఎన్నికల్లో హంగ్ వచ్చిన.. తక్కువ మెజార్టీ వచ్చిన క్యాంపును ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ అధిష్టానం సన్నాహాలు చేస్తుంది. హంగ్ వస్తే డీకే శివకుమార్ కనుసన్నల్లోనే క్యాంపు ఆపరేషన్ జరగనుంది. మ్యాజిక్ ఫిగర్ దాటిన.. తక్కువ మెజార్టీ వచ్చిన గెలిచిన అభ్యర్ధులను బెంగళూరు క్యాంప్‌కు తరలించేందుకు కాంగ్రెస్ నాయకత్వం ఏర్పాట్లు చేస్తుంది. 18 నుంచి 22 సీట్లు గెలుస్తామని ధీమా మరో వైపు భారీ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర నాయకులు ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే పీసీసీ చీఫ్ రేవంత్ ఇంటికి కాంగ్రెస్ నేతలు క్యూ కడుతున్నారు. రేవంత్‌రెడ్డి ఇప్పటికే పోటీ చేసిన అభ్యర్థులతో సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో పోలింగ్ సరళి, తక్కువ, ఎక్కువ పోలింగ్ జరిగిన నియోజకవర్గాలపై కాంగ్రెస్ నేతలు సుధీర్ఘంగా సమీక్షించారు.