అకాల వర్షాలు అన్నదాతలను నిండా ముంచాయి. బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం ఫెయింజల్ తుఫాన్ గా మారడంతో రైతులు అష్ట కష్టాలు పడుతున్నారు. యావత్తు భారతానికి ధాన్యాగారంగా, రాష్ట్రానికి అన్నపూర్ణగా విరాజిల్లుతున్న కాకినాడ జిల్లాలో ధాన్యం తడిసిపోవడంతో రైతులు మూగగా రోదిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 95 వేల హెక్టార్లలో వరి సాగు చేశారు. ప్రస్తుతం 30 శాతం పైగా ధాన్యం అమ్మేశారు. మిగిలిన చోట్ల కోతలు కోస్తున్నారు. మరికొన్ని చోట్ల ధాన్యం రోడ్లపైనే ఆరబెట్టారు. ఇంకొన్ని చోట్ల కోత కోయకపోవడంతో గాలులకు, వర్షానికి పంట నేల వాలింది. అవి మొక్కలు వచ్చే ప్రమాదం ఉంది. మార్కెటింగ్ కమిటీలు ఉన్నా రైతులకు కళ్లాలు లేకపోవడంతో … ఎండబెట్టుకునేందుకు మార్కెట్ కమిటీలు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అయితే సెస్సు మాత్రం వసూలు చేస్తున్నారు. వర్షానికి ధాన్యం తడవడంతో తేమశాతం పెరిగింది. దీంతో తక్కువ ధరకే దళారులకు, మిల్లర్లకు అమ్ముకుంటున్నామని రైతులు వాపోతున్నారు. పాలకులు స్పందించి ఆదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- ఎర్రవెల్లి నివాసంలో కేసీఆర్ కీలక సమావేశంతెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఎర్రవెల్లిలోని తన నివాసంలో పార్టీ ముఖ్య నేతలతో అత్యంత కీలకమైన సమావేశం నిర్వహించారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడం, పార్టీ సంస్థాగత నిర్మాణంపై కేసీఆర్ ప్రధానంగా చర్చించారు. పార్టీ…
- శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాల అంశంపై కీలక నిర్ణయం..శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల జలాల అంశంపై కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు కేఆర్ఎంబీ హైదరాబాద్ జలసౌధలో సమావేశమైంది. తెలుగు రాష్ట్రాల తాగునీటి అవసరాలు, నీటి నిల్వలు, విడుదలపై అధికారులు చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నాగార్జున సాగర్ నుండి…
- జూన్ 2న ఆదిలాబాద్ లో ఇందిరమ్మ ఇండ్ల రెండో విడత ప్రారంభం..రాష్ట్రంలో పేదల సొంత ఇంటి కలను సాకారం చేయడానికి ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అమలు చేస్తోందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి శ్రీ పొంగులేటి…
- సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన హిమంత బిశ్వశర్మ..హిమంత బిశ్వ శర్మ ప్రమాణ స్వీకారంతో అసోం రాజకీయాల్లో చారిత్రాత్మక ఘట్టం నమోదైంది. గౌహతిలోని ఖానాపరాలో జరిగిన వేడుకలో హిమంత బిశ్వ శర్మ అసోం ముఖ్యమంత్రిగా వరుసగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య ఆయనతో ప్రమాణం…
- బ్లాక్ బస్టర్ ‘శంబాల’ కాంబో రిపీట్.. బృందా రవీందర్ దర్శకత్వంలో ఆది హీరోగా షైనింగ్ పిక్చర్స్బ్లాక్ బస్టర్ ‘శంబాల’ కాంబో రిపీట్.. బృందా రవీందర్ దర్శకత్వంలో ఆది హీరోగా షైనింగ్ పిక్చర్స్ సెన్సేషనల్ బ్లాక్బస్టర్ ‘శంబాల’తో షైనింగ్ పిక్చర్స్ నిర్మాతలు మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభిమోజు, దర్శకుడు యుగంధర్ ముని, హీరో ఆది ఇండస్ట్రీలో హాట్…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




Total views : 74528