దేశవ్యాప్తంగా 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వరుసగా 11వ సారి మోదీ ప్రతిష్టాత్మక ఎర్రకోటపై జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆహార్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మోదీ తెల్లటి కుర్తా, చుడీదార్, లేత నీలం రంగు బంద్‌గాలా జాకెట్ ధరించారు. రాజస్థానీ లెహెరియా ప్రింట్ తలపాగా ధరించి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. స్వాతంత్య్ర దినోత్సవం నాడు వైవిధ్య భరితమైన ప్రత్యేక తలపాగాలను ధరించే సంప్రదాయాన్ని ప్రధాని మోదీ ఈసారి కూడా కొనసాగించారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున ప్రత్యేక తలపాగాలు ధరిస్తున్న ప్రధాని .ఇవాళ ధరించిన తలపాగా నారింజ, పసుపు, ఆకుపచ్చ రంగుల్లో ఉంది. తలపాగాకు ఉన్న పొడవాటి తోక కూడా ఈ మూడు రంగుల కలయికలోనే ఉంది. రాజస్థాన్‌కు చెందిన సాంప్రదాయ టెక్స్టైల్ టెక్నిక్‌తో దీనిని తయారు చేశారు. ఈ లెహెరియా డిజైన్‌ను థార్ ఎడారిలో కనిపించే ‘నేచురల్ వేవ్’ నమూనా నుంచి ప్రేరణగా తీసుకొని తయారు చేశారు.
ఇక గతేడాది స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం సందర్భంగా ప్రధాని మోదీ పసుపు, ఆకుపచ్చ, ఎరుపు రంగుల కలయికతో తయారు చేసిన రాజస్థానీ బంధాని ప్రింట్ తలపాగాను ధరించారు. ఇక అంతక్రితం ఏడాది2022లో ఎరుపు రంగు నమూనా, కుంకుమ పువ్వు రంగు రంగులో ఉన్న పొడవాటి తోక ఉన్న తలపాగాను మోదీ ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.మాజీ మంత్రి కొడాలి నానిపై నమోదైన కేసు విచారణకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 2021లో పంచాయతీ ఎన్నికల సమయంలో నమోదైన కేసులో ప్రాసిక్యూషన్‌కు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. 2021 ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో…
- హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. కొండచరియ విరిగిపడటంతో ధల్లి… సంజౌలి బైపాస్‌ను పూర్తిగా మూసివేశారు. దీంతో ఇరువైపులా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కొండచరియ విరిగిపడటంతో భారీగా శిథిలాలు రహదారిపైకి వచ్చిపడ్డాయి. శిథిలాలు అడ్డంకి ఉండటంతో వాహనాల రాకపోకలకు…
- అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.అమెరికాలోని న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ వద్ద కాల్పులు కలకం సృష్టించాయి. కాల్పులకు తెగబడటమే కాకుండా ఓ వ్యక్తిపై కత్తితో దాడి చేశాడు. నిత్యం రద్దీగా ఉండే మాన్హాటన్ పర్యాటక ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాల్పుల శబ్దం వినిపించడంతో పర్యాటకులు, స్థానికులు…
- అనకాపల్లి జిల్లాలో యలమంచిలిలో ప్రమాదం.ఏపీలో మరో బస్సు ప్రమాదం జరిగింది. అయితే వెంటనే అప్రమత్తం కావడంతో ప్రయాణికులంతా సురక్షితంగా బయట పడ్డారు. అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మండలం రేగుపాలెం జాతీయ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. భువనేశ్వర్ నుంచి చెన్నై…
- వర్షం వస్తేనే జంకుతున్న భద్రాద్రి గిరిజన గ్రామాలు.ఆకాశం నల్లటి మబ్బులు కమ్ముకుంటుంటే అన్నదాత ఆనందంతో మురిసిపోతాడు. కానీ… భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీతారాంపురం పంచాయతీ పరిధిలోని అన్నారం, చింతలపాడుతో పాటు మరో మూడు గిరిజన గ్రామాల ప్రజల గుండెల్లో మాత్రం వణుకు మొదలవుతుంది. వారికి వర్షం అంటే పరవశం…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి






Total views : 150023